Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన కథయే రామ కథ! మనమే రామాయణం
శ్వాసించిన వినిపించును ఎద ఎద రామాయణం!

ఆ కవితా గానమన్న నా భాగ్యమె భాగ్యం!
ఆ నాట్య కలాపమన్న ధన్యవ్మౌ జీవనం!

నేనెవ్వడ? శ్రీరాముని కథను చెప్పుకొరకు?
రాముండే రామకథను చెప్పుకొనెడివాడు!

నేనెవ్వడ శ్రీకృష్ణుని వంశిని మాత్రమ్మే!
పలికించెడి వాడాతడె పలుకుయు నాతండె!

అతని చరణ రేణువునై ఆడెదనీనాడు
అతని చేతి మురళినౌచు పాడెదనీ నాడు

చెప్పెదనే రాముని కథ - విప్పెదనేరహస్యమ్ము
రాముని కన్నను రాముని నామమ్మే తారకమ్ము

సూర్య చంద్రులేలినట్లు రాముడు తన వారలతో
భారతమ్ము నేలినట్టి దివ్యమైన రామకథ

‘రమ’ యనగా సీత కాదె? ‘రామ’ యనగ రాముండు
సీతను తనలో నిడుకొను వాడే రాముండు

రమ్మవ్మౌ రామాయణ కథ చెప్పెద వినుడీ!
భవ్యవ్మౌ భవతారక మంత్రమ్మిది కనుడీ!

రామభద్రునకు నిర్వురు భాస్కరులుదయించినారు
రామలక్ష్మణుల బోలుచు వెలుగుల విరజిమ్మినారు

కుశలవులని వారి పేర్లు కుశాగ్రమ్ము వారిమేధ
దశదిశలను రామాయణ గాథ వ్యాప్తి జేసినారు

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087