Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాటయందుప్రణవమ్మును, ఆడయందు విశ్వక్రీడ
మాటలందు మర్మమ్ముల వారలు చూపించినారు

వాల్మీకియె వారి గురువు వ్రాసెనతడు సీతకథ
రామాయణ మనుపేరను రాజిల్లెను విశ్వమ్మున

వెలుగుల వలె సంచరించి, వాయువటుల వ్యాపించి
సీతారాముల కథలను ఇంటింటికి జేర్చినారు

తలలూపుచు చిరుతలతో ఆ బుడతలు ఆడినారు
బుడతలైన చిరుతమైన చిరుతల తలపించినారు

ఎంత మధురమాగానం? ఎంత మనోహరము?
ఆగానం మదిపొంగును భాగీరథి వోలె

తలనిండెను మదినిండెను నిండెను జగమెల్లను
నేనే గానమ్మై పోవుచు సుడులు తిరుగు చుంటిని

రామునితో రాముని కథ వారలెటుల చెప్పినారొ?
తన కథ విని సీతవోలె రాముడెటుల కరిగినాడొ?

ఎరుగుదురే అమ్మలార? ఎరుగదురే మీరు?

వారలు పాడిన పాటయె నేనిప్పుడు పాడెద
వారలు ఆడిన ఆటయె మీ ముందర నాడెద

అనుచు మారుతాత్మజుండు ఆనందమునందినాడు
ఆడుచుపాడుచు సీతారాముల కథ తెలిపినాడు

ఇంకావుంది...