Others

పసి హృదయాలకు ‘ప్రేమ’ను పంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నేటి బాలలే రేపటి పౌరులు’’ కదా! పసి హృదయాలలో ప్రేమను పంచాలి. అలా వారి మనసుల్లో ప్రేమభావం వెల్లివిరిస్తే చక్కగా చిన్ననాటినుండే రాణించగలరు. పిల్లల భవితవ్యం అమ్మ చేతుల్లోనే వుంది. తీరిక సమయాలలో పిల్లలకు హోంవర్కు నేర్పించాలి. సమయం విలువైనది అని చిన్ననాటినుండే చిన్నారులకు తెలియజేయాలి. పిల్లల అభిరుచికి అనుగుణంగా పెద్దలు వారిని ప్రోత్సహించాలి. కొంతమంది చిన్నారులు.. ఏదో ఆలోచిస్తూ అదోరకంగా వుంటారు. అటువంటి పిల్లలను పెద్దలు గమనించి వారిని ప్రేమతో పలకరించాలి. పిల్లలను చీటికి మాటికీ విసుగుకోరాదు కసురుకోరాదు. అలా చేస్తే వారు మొండికేస్తారు. ‘మొక్కై వంగనిది మానై వంగునా’ అన్న సామెతను అనుసరించి చిన్నపిల్లల మనస్తత్వం తెలుసుకుని ప్రవర్తించాలి. వారి వారి అభిరుచికి అనుగుణంగా వారిని పెద్దలే ప్రోత్సహించాలి. ఉదాహరణకు కొందరు పిల్లలు చిన్ననాటినుండే బొమ్మలు వేయడానికి ఇష్టపడతారు. వారిలో చిత్ర కళా ప్రతిభ దాగివుందని మనం గ్రహించి ప్రోత్సహించాలి. మరికొందరు చదువుపై, ఇంకొందరు ఆటలుపైన, కొందరు పిల్లలు చదువుపై అలా అలా ఆసక్తి చూపిస్తుంటారు. పిల్లల మనస్తత్వం పెద్దలు గ్రహించాలి. వారికి అనుగుణంగా ప్రోత్సహిస్తే పిల్లలు ప్రతిభావంతులు కాగలరు.
పసి హృదయాలు చాలా సున్నితంగా వుంటాయి. వారిని ప్రేమగా పలకరించాలి. ఆప్యాయతా, ఆదరణ వారికి కలుగజేయాలి. పెద్దల అండ వుంటే వారికి కాస్త మనోధైర్యం కలుగుతుంది. పిల్లలను లాలించి, బుజ్జగించి ప్రోత్సహించాలి. చిన్నతనం నుండే వారిలో మనోనిబ్బరం వికసింపజేయాలి. పెద్దల అలవాట్ల ప్రభావం పిల్లలపై వుంటుందని గ్రహించాలి. మంచి అలవాట్లు వారికి నేర్పించాలి. నీతిదాయకమైన కథలు, దేశభక్తి గాథలు వారికి వినిపించాలి.
నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దడంలో పెద్దలు కృషి చేయాలి. పసి హృదయాలలో వెనె్నల వెలుగులు వికసింజేయాలి. చిన్నారులను చిరునవ్వులతో ప్రేమగా చూడండి. అప్పుడే వారు భావి భారత పౌరులుగా వెలుగొందగలరు.
**

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక
ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- ఎల్.ప్రఫుల్లచంద్ర