Others

ఓటు వేద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశమనియెడు దీన వృక్షం
తుకుడ తుకుడా చేస్తమంటూ
దూకు గ్యాంగుల మెచ్చుకొంటూ
వేరు పురుగుల కోటు వేద్దాం!

* ఉగ్రవాదుల నిగ్రహించే
అగ్రవీరుల తిట్టి, పాకుల
మెచ్చి దండకు మెడలు వంచే
మేటి నేతల కోటువేద్దాం!

* హిందుగాళ్లూ బొందుగాళ్లని
ఘనముగా జాతులను పొగడే
నాయకాగ్రణి మంచి మాటది
తీయగుందని ఓటు వేద్దాం!

* తియ్యముచ్చట వినుడు వినుడు
క్వాటరిస్త హాఫు ఇస్తరు
చాలదంటే ఫుల్లు ఇస్తరు
ఫుల్లుకే మరి ఓటువేద్దాం!

* పూల పొట్లం కాదు కాదిది
బిర్యాని పొట్లం సుమా
ఆ మసాలా ఘుమాయింపున
పరవశమ్మయి ఓటు వేద్దాం!

* విద్యదానం వైద్యముచితం
బస్సు పయనం కూడ ఉచితం
గాలి మోటరు రైలు పయనం
ఉచిత మంటరు ఓటువేద్దాం

* కులం పేరిట కోర్కిలన్నీ
తీర్చడానికె ఉన్నమంటరు
కులం ఏకత కోరకుండా
ఉన్నవారికె ఓటు వేద్దాం!

* తాగనోళ్లకు కూడ మద్యం
తాగుతాగూ అంటు పోస్తరు
మద్యమాదాయమ్మె ప్రభుతకు
మూల మంటరు ఓటు వేద్దాం!

* పెండ్లికిస్తరు చావుకిస్తరు
పుట్టు బిడ్డకు ఊయలిస్తరు
సబ్బులిస్తరు పౌడరిస్తరు
పనులవద్దిక ఓటువేద్దాం!

* సెంటుమెంటులు తెచ్చి పెడ్తరు
చీరలిస్తరు దోతులిస్తరు
పసుపు కుంకుమ బొట్టుబిళ్లలు
గాజులిస్టరు ఓటువేద్దాం!

* పార్టి సిద్ధాంతాలు చెప్పరు
తాయిలాలని టముకు వేస్తరు
ఆకర్షణల వల విసర్తరు
అందులో పడి ఓటువేద్దాం!

* మొక్కినోనికి పొగిడినోనికి
నోటు ఓటుకు పంచినోనికి
ప్రజాస్వామ్యం మరిచిపోదం
సిగ్గు విడచీ ఓటు వేద్దాం!

- ఆచార్య కసిరెడ్డి 9866956250