Others

శ్రీరామ నీ నామ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుష్టశిక్షణ చేయడానికి రూపం లేని భగవంతుడు రూపాన్ని ధరించి నామాన్ని అలంకరించు కుని భువికి దిగివస్తాడు. ఎక్కడ అధర్మం పెరిగిపోతుందో, అన్యాయం రాజ్య మేలుతుందో అక్కడికి తన్ను తాను సృజి యంచుకుని వచ్చేస్తాడు. దుష్టులను వారి కోరికలమేరకే సంహరిస్తాడు. వారిలో ఉన్న అజ్ఞానాన్ని పారద్రోలుతాడు. ధర్మాన్ని పునః స్థాపితం చేస్తాడు. ఆ క్రమంలోనే ఓసారి రావణాసురుడు మృత్యువు రాకుండా వరాలను పొందాడు. ఆ వరాలను అడిగే సమయంలో మానవులు , వానరుల చేత చావకూడదు అన్న నియమాన్ని పెట్టలేదు, వరప్రభావం వల్ల ఎందరో సజ్జనులను హింసించే తన సహజ ప్రవృత్తిని వృత్తిగా కూడా చేసుకొన్నాడు. ఆ రాక్షసాధముడిని సంహరించడానికి రాముడు దశరథ నందనుడిగా మానవుడిగా పుట్టాడు. ఆయనకు సహకారాన్ని అందించడానికి పరమశివుడు వానరుడుగా ఆంజనేయునిగా ఆవిరభవింఛాడు. ఇక ఏమీ ? దుష్టశిక్షణ జరిగాల్సిందే కదా. అటువంటి సమయంలోనే రావణాసురుడు అధర్మాన్ని పెంచి పోషించు కోవడానికి రాముని భార్యను సీతమ్మను అపహరించాడు. అంతే రామ రావణ యుధ్ధం ఆరంభమైంది. అధర్మపరుడైన రావణుడు ధర్మమే రూపముగా మారిన రాముని చేతిలో మరణించాడు. లంకారాజ్యంలో ధర్మం సుసా పితం చేయడానికి రావణుని తమ్ముడు, ధర్మ పరాయణుడు అయన విభీషణుడిని ధర్మ మూర్తి అయన రాముడు రాజును చేశాడు. అటువంటి రాముని గూర్చి (రాముడంటే మహావిష్ణువే కదా) పార్వతీ దేవి పరమశివుని ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అని, విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరింది. దానికి పరమేశ్వరుడు, ‘‘ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితముకొరకు జపించేది ఇదే సుమా!’’ అంటూ ఇలా చెప్పాడు.
శ్లో॥ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే॥
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణుసహస్రనామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. శ్రీరామ నీనామ మేమి రుచిరా... ఎంతో రుచిరా... మరి ఎంతో రుచిరా... అనిభక్తరామదాసు అద్భుతంగా ఆలపించారు. ఎవరైనా సరే శ్రీరామ నామాన్ని ఉచ్చరించేటప్పుడు ‘రా’అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకువచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట! అలాగనే ‘మ’అనే అక్షరం ఉచ్చరించినప్పుడు బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞా నాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందని పురాణాలు, శాస్త్రాలే కాదు పెద్దలు అదేపనిగా చెబుతున్నారు. కనుక ఈ శ్రీరామ నవమి రోజుననే కాదు అందరమూ సదా రామ నామాన్ని పానం చేద్దాం. మన జీవితాలను ఆనందమయం చేద్దాం. ధర్మాన్ని ఆచరించి రాముని బాటలో మనమూ నడుద్దాం.

- చివుకుల రామ మోహన్