Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథామృత గానం
(హనుమనోట కుశలవులపాట)
‘‘రామా’’! యన రామాయణ వౌనుగాదె బ్రతుకు
‘‘రామా’’! యన రామరాజ్య వౌను గాదె తుదకు!

మనిషిలోని మనిషి కరిగి మైనముగా మారిన కథ
కనులలోని కరుణ కరిగి కాల్వలుగా పారెడు కథ

ఆకసమ్మునుండి భువికి అవతరించు వెలుగుల కథ
చీకటి రక్కసుల తోడ పోరినట్టి భానుని కథ

బాలునిలో బ్రహ్మమును కాంచిన కౌశికుని కథ
తనయునిలో ప్రజల భవిత దర్శించిన తండ్రి కథ

హరివిల్లును రవిబూనుచు ఆటలాడుకొనినట్టుల
హరధనువును రఘురాముడు విరిచి సీతనందినాడు

ఒక చంద్రుడు భాస్కరునకు దారినిచ్చి తొలగునట్లు
ఒక రాముడు రాఘవునకు ప్రణమిల్లుచు తొలగినాడు

కవ్వమట్లు చిలికి విషం మంథర పుట్టించెను
భారతమున రామాయణ కథను కైక లిఖియించెను

తండ్రి మనసునెరిగి కానకేగినాడు రాముండు
కోనయె కోసలయటంచు భావించెను జానకి

పట్టపగలె చీకట్టులు పుడమిని ముంచెత్తినవి
పట్నమిడిచి ప్రజల్లెలరు కానకేగ నెంచినారు
రాముండే తండ్రియంచు- సీతమ్మే తల్లియంచు
వెడలె వెంట సౌమిత్రియు- వనసీమయె స్వర్గమంచు
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087