Others

కపిలుని గీత ( శ్రీచక్రము, మానవ శరీరం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
HNo.7-8-51, Plot No. . 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
=====================================================
కర్దమ ప్రజాపతి కుమారుడైన సాక్షాత్తు విష్ణ్వుంశగల కపిలుడు తన తల్లియైన దేవహూతికి ధ్యానయోగాన్ని క్రింది విధంగా బోధించాడు.
అమ్మా! భగవంతుని యందు నిమగ్నమైన మనస్సు సహజంగానే జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను వేదం చెప్పిన అనుష్టానం వైపు మరల్చుతుంది. అదియే భగవంతునియందు కలిగే కోరికలు లేని భక్తి. ఇట్టి భక్తిజీవుడు భుజించిన ఆహారాన్ని జఠరాగ్ని ఏ విధంగా దహించి వేస్తుందో ఆ విధంగా కర్మబంధాన్ని నశింపజేసి నా యందు నిశ్చల భక్తి నిలుచునట్లు చేస్తుంది. అట్టి యోగ స్థితిని పొందిన యోగులు, బ్రహ్మ ఆత్మ ఒకటేనని తెలిసి, అనుభూతి పొంది నా మహత్తును శ్లాఘిస్తారు.
అమ్మా! అటువంటి యోగులు, ప్రసన్నమైన నా ముఖాన్ని ఎఱ్ఱని కనులతో వెలుగొందే నా యొక్క అనేక రూపాలను సందర్శించి నాతో(పరమాత్మ) మాట్లాడగలరు. ‘‘దర్శించతగిన నా యొక్క అనేక రూపములు యోగులనాకర్షిస్తాయి. నా గంభీరమైన లీలలు, చర్యలు, మృదు మధురమైన నా వాక్కులు, దయతోకూడిన చూపులు, భావించి సదా ధ్యానించి నన్ను పొందాలనే, యోగసాధనచే సఫలతనొంది నాలో లయమవుతారు. అట్టి ధ్యేయముకల యోగులు, మాయాతీతుడనైన నా తత్వాన్ని దర్శించినవారై, సత్యలోకాది సంపత్తిని కాని, అణిమాది అష్టసిద్ధులను కానీ కోరక, సర్వదా నా సాన్నిధ్యాదుల ననుభవిస్తూ నిత్యం నా విభూతిని పొందెదరు (నాలోనే రమించెదరు). ఎవరైతే నిత్యం ననే్న ఆరాధిస్తూ ననే్న హృదయంలో ధ్యానిస్తున్నారో పుత్రునివలె, మిత్రునివలె, గురువువలె, ఇష్టదైవంగా ఎల్లప్పుడు సేవిస్తున్నారో అట్టివారికి పరమపద వైకుంఠ నివాసం ప్రాప్తిస్తుంది. నా ఆయుధమైన కాలం వారిని చనకదు. ఎవరైతే రుూ లోకం అశాశ్వతమని, శరీరమశాశ్వతమని భావించి, ఇతర చింతలు మాని, ఏకాంత ధ్యాన భక్తియుక్తులై ననే్న ధ్యేయంగా భావించి అభేద భావంతో నన్ను సేవిస్తున్నారో అట్టివారిని నేను జనన మరణ చక్రం నుండి ఉద్ధరిస్తాను (విముక్తులను చేస్తాను). అమ్మా! సకల జీవులకు ప్రకృతికి అధీశ్వరుణ్ణి నేనే. సకల ప్రాణుల ఆత్మతత్వమైన నన్ను ఆశ్రయించిన వారికి ఏ భయాలు లేవు. పంచభూతాత్మకమైన ఈ ప్రపంచంలోని సకల కదలికలు అన్నివిధముల చైతన్య శక్తులు, మృత్యువుకూడ, నా అధీనమై యున్నది. కాబట్టి యోగులు, సదా జ్ఞాన వైరాగ్యాలతోకూడిన భక్తితో నాయందర్పించబడిన స్థిరచిత్తంతో ధ్యానమగ్నులై ఉంటారు. అలా ఉండడమే సర్వోత్కృష్టమైన కర్మయని భగవాన్ కపిలుడు తన తల్లియైన దేవహూతికి తెలిపెను.
ఇట్టి విషయమునే భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ కూడా ఎట్టివారు తనకు ప్రీతిపాత్రులై తనను పొందుచున్నారో ఇట్లు తెలిపెను.
శ్లో తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏక భక్తిర్విశిష్యతే
ప్రియోహి జ్ఞానినో త్యర్థ్యమహం, సచమమ ప్రియూయః
ఈ శ్లోకానికి ముందున్న 16వ శ్లోకంతో సమన్వయం చేసుకొని ఈ శ్లోకాన్ని గ్రహించాలి. ఆర్తో= ఆపదలోనున్నవాడు, జిజ్ఞాసో= తెలిసికొనగోరువాడు, అర్థేర్దీ = సంపదను కోరువాడు, జ్ఞానీచ= ఆత్మ సాక్షాత్కారము పొందినవాడును, తేషాం అంటే వారిలో సంపూర్ణ జ్ఞానం కలవాడును, సర్వదా విశుద్ధ భక్తియుక్త సేవలో నిమగ్నమైనవాడు అత్యుత్తముడు. అట్టివానికి నేను మిక్కిలి ప్రియుడను. అతడును నాకు మిక్కిలి ప్రియుడు అని పరమాత్మ చెప్పాడు.

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9849560014