Others

సీతారాములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడబాటుకు తడబడని
ఆ మనువు మకుటాయమానం
సంకటాలకు సంచలించని
ఆ వలపు తలమానికం
అపనిందలకు హడలిపోని
ఆ అనురాగం అజరామరం
వనవాసానికి వెనుదీయని
ఆ సాంగత్యం
లోకం మెచ్చిన దాంపత్యం
అగ్ని పరీక్షకు అదరని బెదరని
ఆ తియ్యని చెలిమి
వాడని వీడని మమతల కలిమి
ఆకాపురం కష్టాల కడలే అయినా
ఆ బంధం జగానికే అందం
ఆ సంసారం వ్యాకుల సాగరమైనా
ఆ అన్యోన్యం ఆదర్శాలకు అగ్రపీఠం
బతుకంతా చింతల సెగలే అయినా
ఆ ఓరిమి ముందుతరాలకు ప్రామాణ్యం
పరాయి వాడు గడ్డిపరకని
తెలిపెను సీతమ్మ తల్లి
ఒక సతికేబతుకని చాటెను
రామయ్య తండ్రి
శుభలేఖలపై ముద్రించే
మురిపాలముఖచిత్రం వారు
‘శ్రీరామపత్నీ జనకస్య పుత్రీ’ అను
తొలిపలుకుల శ్రీకారం వారు
వివాహవేదికల మీద వధూవరుల ఎదురుగా
పటమున నిలిచి దీవెనలొసగే దేవతలు వారు
సృష్టిలో ఆ ప్రేమకు సరిలేదులే
ఆలుమగలంటే సీతారాములే!

చిరమన వెంకట రమణయ్య సెల్. నెం. 9441380336