AADIVAVRAM - Others

జై శ్రీరామ్ - జై భీమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సంవత్సరం శ్రీరామనవమి (శ్రీరాముని జయంతి, పట్ట్భాషేకం) డా॥ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న ఒకే రోజున వచ్చాయి. సామాజిక సమరసతను అందివ్వడం లో శ్రీరాముడు, డా॥ అంబేద్కర్‌ల పాత్రలను స్మరిం చుకోవటం ఈ వ్యాస ఉద్దేశ్యం.
శ్రీరాముడు, డా॥ భీమ్‌రావ్ అంబేద్కర్ ఇద్దరూ విభిన్న యుగాలకు, కాలాలకు చెందినవారు. వీరిద్దరిని పోల్చడం ఈ వ్యాస లక్ష్యంకాదు. సమరసతకోసం కృషిచేస్తున్న వ్యక్తులకు, సంస్థలకు వీరి వ్యక్తిత్వాలను గురించి అవగాహన కల్పిస్తూ విశే్లషించుకోవటమే ఈ వ్యాసపు పరిమితులు.
వేల సంవత్సరాలుగా శ్రీరాముణ్ని హిందువులు భగవత్ అవతారంగా కొలుస్తున్నారు. ఆదికవి వాల్మీకి శ్రీరాముణ్ని భగవంతుడుగా కాక ‘ఉత్తమ మానవుని’గా చిత్రీకరించారు. అనేక సుగుణాలున్న వ్యక్తి శ్రీరాముడు మాత్రమే అని వాల్మీకికి నారదమహర్షి తెలిపారు. శ్రీరాముడు అంటే, ‘‘ఒకే బాణం - ఒకే మాట, ఒకే పత్ని’’ అని సామాన్యులు చెపుతారు. ‘‘్ధర్మానికి మూర్త్భీవించిన స్వరూపమే శ్రీరాముడు’’ అని కొందరు పేర్కొంటారు (రామో విగ్రహవాన్ ధర్మః). ప్రపంచ చరిత్రలో అనేకమంది రాజులు - మహరాజులు - చక్రవర్తులు ప్రజలను పాలించారు. వీరిలో ఎందరో ప్రజా పరిపాలకులున్నారు. కానీ ప్రజలకు అన్నివిధాల మేలుకలిగించే రాజ్యాన్ని ‘రామరాజ్యం’గా పేర్కొం టుంటాం. రామరాజ్యం అని చెప్పగానే సగటు భారతీయునికి స్పష్టంగా అర్థం అయిపోతుంది. మరే వివరణలు అవసరంలేదు. భారతీయుల హృదయాలతో మేళవించిన కథ శ్రీరామకథ. రామాయణగాథ భారతదేశంలోని అన్ని భాషలలోను సుదూర గిరిజన తెగలలో మాత్రమే కాక ఆసియాకు చెందిన ఇతర దేశాలలోకూడా శ్రీరామకథ సుపరిచితం. సీతారాములు భారతీయులకు అన్ని విధాలా ఆదర్శపురుషులు. ఉత్తమ కుమారునిగా, ఉత్తమ భర్తగా, ఉత్తమ సోదరునిగా, ఉత్తమ మిత్రునిగా, ఉత్తమ పరిపాలకునిగా అన్ని విధాలా సమగ్ర ఉత్తమ వ్యక్తిత్వం శ్రీరామునిలో మనకు కనబడుతుంది.
కష్టంలోనూ, సుఖంలోనూ జీవితం లో అందరిపట్ల సమభావంతో వ్యవహరించటం గొప్ప వ్యక్తి లక్షణం. సమభావన ఆధారంగానే సమరసత ఏర్పడుతుంది. సమరసతతో కూడిన ఆచరణవల్లే వ్యక్తులు బంధుభావనతో కలిసి జీవిస్తారు. అలాంటిచోటే అభివృద్ధి, ఆనందం అందరిలో వెల్లివిరుస్తాయి.
ధర్మరక్షణకు శ్రీరామలక్ష్మణులను తమతో పంపమని విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజును కోరాడు. ఆ సమయంలో రామలక్ష్మణుల వయస్సు చిన్నదే. తండ్రి ఆజ్ఞతో మారు మాట్లాడకుండా విశ్వామిత్రునివెంట రామ లక్ష్మణులు బయలుదేరారు. పుట్టింది, గారాబంగా పెరిగింది చక్రవర్తి కుటుంబంలో. మహర్షి కోరిక మేరకు, తండ్రి ఆజ్ఞమేరకు విశ్వామిత్రుని వెంట పాదచారులై వెళ్ళారు. వనాలు, చెట్లు వారికి ఆశ్రయమిచ్చాయి. ధర్మరక్షణకు అవసరమైన జ్ఞానాన్ని పొందారు. అనేక శాస్త్రాలను, విద్యలను నేర్చుకున్నారు. భారత దర్శనం ప్రారంభించారు.
తండ్రి దశరథుడు ‘‘రేపు నీకు యువజన పట్ట్భాషేకం. ఇది ప్రజానిర్ణయం, రాజు నిర్ణయం’’ అని శ్రీరామునికి తెలిపినపుడు తండ్రి ఆజ్ఞను ఎంత ఆనందంగా స్వీకరించాడో కొద్దిగంటలు తిరక్కముందే తల్లి కైకేయి పిలిచి ‘‘నీ తండ్రి నాకిచ్చిన మాటమేరకు నీవు వెంటనే అయోధ్యను వీడి 14సం॥ వనవాసం చేయాలి’’ అని చెప్పినపుడు తండ్రి ఆజ్ఞను అంతే ఆనందంగా నమ్రతతో స్వీకరించాడు. రెండవ ఆలోచనకు స్థానం కల్పించలేదు. తర్కవితర్కాలకు అవకాశం కల్పించలేదు. శ్రీరాముడు అవలంబించిన ఈ సమభావన ఆచరణీయం.
‘‘వనవాసంలో ఉండగా ఈ ఆయుధాలు దేనికి? రాక్షసులతో మనకెందుకు తగవులు?’’ అని సీత ప్రశ్నించినపుడు వనవాసంలో ఉన్నా ధర్మరక్షణ, సజ్జన ప్రజల రక్షణ క్షత్రియునిగా తన ధర్మం, బాధ్యత అని శ్రీరాముడు పేర్కొన్నారు. ఈ నిర్ణయం సీతాపహరణకు దారితీసింది. అనేక కష్టాలను ఎదుర్కొవలసివచ్చింది. అయితే అంతిమంగా ధర్మరక్షణ జరిగింది.
ఆ కాలంలో క్షత్రియ పురుషులు అనేకమంది భార్యలను కలిగివుండే ఆచారం ఉంది. కానీ శూర్పణఖ కోరికను శ్రీరాముడు తిరస్కరించాడు. ఫలితంగా రావణాసురుడు సీతమ్మను అపహరించాడు. శ్రీరాముడు ఆ సమయంలో ఒక సామాన్య మానవునివలె విలపించాడు. వాల్మీకి శ్రీరాముణ్ణి రామాయణంలో ఒక ఉత్తమ మానవునిగానే చిత్రీకరించారు, దేవునిగా చిత్రీకరించలేదు.
నిషాద రాజైన గుహునితో శ్రీరాముడు మిత్రుడుగా వ్యవహరించాడు. సీతాపహరణ సమయంలో తమ ప్రాణాలకు తెగించి రావణునితో పోరాడి, మరణించిన జటాయువుకు పక్షి అని భావించకుండా తన తండ్రివలె అంత్యక్రియలు చేశారు. వానర నాయకుడైన సుగ్రీవుడు, ఆంజనేయుడు తదితరులతో సోదర మిత్రత్వాన్ని నెరిపాడు.
త్వమస్మాకం చతుర్ణాం వైభ్రాతాః సుగ్రీవ పశ్చమః
సౌహదార్జాయతే మిత్రపకారో- రిలక్షణమ్ ॥
అర్థము: సుగ్రీవా! మేము నల్గురు అన్నదమ్ములం. నీవు ఐదవ సోదరుడివి. కష్టంలో ఉన్న సమయాని సహాయహస్తాన్ని అందించేవాడే సోదరుడు.
శ్రీరాముడు అంటున్నాడు-
ఏష సర్వస్యభూతస్తు పరిష్టంగా హనూమంతః
మయా కాలమిమం ప్రాప్య దత్తస్తస్య మహాత్మనః ॥
హనుమంతుడు మహాత్ముడు. అతని గౌరవించడానికి నాదగ్గర ఏమీలేవు. నేను కౌగలించుకోవడం తప్ప ఏమీ చేయలేను, అంటూ హనుమంతుణ్ణి శ్రీరాముడు కౌగలిం చుకున్నాడు. హనుమంతుడు వనాల్లో తిరిగే వానరుడు. శ్రీరాముడు చక్రవర్తి. కౌగలించుకోవడం అంటే మిత్రత్వం, సోదరభావం కదా!
రాక్షస రాజైన విభీషణుడిని సైతం సోదరునిగా స్వీకరించాడు. ఈ సమయంలో ఎక్కడా శ్రీరాముడు తాను ఒక పెద్ద పరిపాలకున్ని అనే హెచ్చ్భువాన్ని ఎక్కడా వ్యక్తం చేయకపోవటం విశేషం. రామ, రావణ యుద్ధానంతరం తిరిగి అయోధ్యకు వెళుతూ తనవెంట విభీషణుడు, వానర సైనికులు, వానర సైనికుల పత్నులను పుష్పకవిమానంలో తీసుకువెళ్ళాడు. శ్రీరామపట్ట్భాషేకం సందర్భంగా అంతఃపుర స్ర్తీలకు గౌరవాలు ఇచ్చినట్లే వానర వీరుల పత్నులకు కూడా అదే గౌరవాలను రాజమహలులో వసతి కల్పించాడు. ప్రజారంజకమైన పాలనను అందివ్వటంతోపాటు సామాన్య ప్రజల మాటలకు ఆలోచనలకు తగుస్థానం కల్పించాడు. వనవాసంలో ఉండగా భక్త్భివంతో శబరిమాత ఇచ్చిన ఎంగిలిపండ్లను సైతం ఆనందంగా స్వీకరించాడు. అపవాదునకు గురై వౌనంగా అచేతన స్థితిలోఉన్న అహల్యకు విమోచన కల్పిస్తూ సమాజంలో గౌరవనీయ స్థానం కల్పించాడు. ‘‘ఎంతో వైభవంగా ఉన్నా ఇది మన స్థలంకాదు, తల్లి, మాతృభూమి స్వర్గంకంటే గొప్పవి’’ అంటూ శ్రీలంకకు విభీషనుని రాజుగాచేసి తాను తన మాతృదేశంవైపు తరలివెళ్ళాడు.
యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయాడు. లక్ష్మణుడు మరణించాడని అందరూ భావించారు. ‘‘ఎవరినైనా పొందగలం, సోదరున్ని పొందడం కష్టం,’’ అంటూ శ్రీరాముడు విలపించాడు.
దేశే దేశే కళత్రాణి దేశే దేశేచ బాంధవః
తం తు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరః ॥
(6-101-15)
అర్థము : ప్రతీ దేశంలోను బంధువులను, భార్యలను పొందవచ్చును. ఏ దేశంలోనూ సోదరుణ్ణి పొందలేము.
శ్రీరాముడు తన జీవితంలో లక్ష్మణునునేకాక ఇంకా అనేకమందిని తన ఆత్మీయ సోదరులుగా పరిగణించారు. వాల్మీకి మహర్షి అనేక ఉత్తమ గుణాలతోపాటు సమభావాన్ని శ్రీరామునిలో చిత్రీకరించటం నేడు మనం స్వీకరించవలసిన విషయం. శ్రీరాముడు సమతామూర్తి.
డా॥ భీమ్‌రావ్ రాజా అంబేడ్కర్
భీమ్‌రావ్ తండ్రి రామ్‌జీ సక్పాల్. తన కొడుకు జ్ఞానవంతుడు కావాలని అప్పుచేసైనా సరే పుస్తకాలను కొనియిచ్చేవాడు. వారి కుటుంబ పేదరికం భీమ్‌రావ్ జ్ఞానార్జనకు ఆటంకం కాలేదు. భార్య రమాదేవి అత్యంత బీదరికాన్ని జీవిస్తూ భర్త ఉన్నత విదేశీ చదువుల కోసం అన్నిరకాలుగాను సహకరించింది. డా॥ అంబేద్కర్ కూడా భార్యకు దూరంగాఉన్నా, భోగాలకు విలాసాలకు కేంద్రమైన అమెరికా, ఇంగ్లండులో ఉన్నా ఎలాంటి దురలవాట్లకు గురికాలేదు. శ్రీరామునివలె వ్యక్తిగత శీలానికి ఎంతో ప్రాముఖ్యాన్ని భీమ్‌రావ్ ఇచ్చాడు. ఈ విషయాన్ని భార్య రమాదేవి పదే పదే పేర్కొంది.
విదేశీ చదువులు, స్వదేశం వచ్చిన తరువాత సామాజిక సమతకై ఉద్యమంలో తలమునకలు ఈ జీవన ప్రయాణంలో డా॥ అంబేద్కర్ సంసార ఆనందాన్ని పొందింది బహుతక్కువే. జన్మించిన పిల్లలు సయితం ఎక్కువమంది చనిపోయారు. తన 43వ ఏట భార్య రమాదేవి అకాలంగా మరణించింది. ఆ సమయంలో డా॥ అంబేద్కర్ తీవ్ర దుఃఖానికి గురయ్యారు. ఆ సమయంలోనే కాషాయవస్త్రాలు ధరించిన ఫొటో మనకు కనబడుతుంది. భార్యా వియోగ సమయంలో శ్రీరాముడు, భీమ్‌రావ్‌లు వ్యవహరించిన తీరులో తేడా ఏమీలేదు. తాను చదివిన ఉన్నత చదువులతో, తన అపార జ్ఞానంతో ఆంగ్లేయుల ముందు తలవంచి వుంటే వారికి ఎంతో ఉన్నతపదవులు వరించి ఉండేవి. స్వర్గంకంటే తల్లి, జన్మభూమి ఎంతో గొప్పవని శ్రీరాముడు చెప్పినట్లే ధనసంపాదన, విదేశీ పరిపాలకులవద్ద ఉన్నత పదవులకంటే తాను నమ్మిన సమతా ఉద్యమంకొరకు అంకితం కావటమే శ్రేష్టమని ఆరకంగా జీవించారు డా॥ అంబేద్కర్.
శ్రీరాముడు విల్లంబులను ధరించింది ధర్మరక్షణకు. భీమ్‌రావ్ సమతా ఉద్యమానికి తన జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని ఆయుధంగా ఉపయోగించారు. శ్రీరాముని హృదయం ఎంత స్నేహమయమో డా॥ భీమ్‌రావ్ అంతరంగం కూడా అంత మృదువైనది, మెత్తనైనది, పూవువంటిది. ప్రముఖ కార్మికనేత శ్రీ దత్తోపంత్ రేంగ్డే, డా॥ అంబేద్కర్ గురించి వివరిస్తూ, ‘‘వారి హృదయం పైకి వజ్రంలా కఠోరమైనది. కాని వారిలోని మనసు పూవువంటి మెత్తనిది,’’ అని పేర్కొన్నారు. తనకోసం తన కుటుంబంకోసం డా॥ అంబేద్కర్ జీవించలేదు. బంధుభావనతో కూడిన సమసమాజంకోసం వారు జీవించారు. వారు నిర్వహించిన ఉద్యమాలుకాని, వారు తయారుచేసిన భారత రాజ్యాంగంకాని సమతా భారత్ కొరకే. సమతా భారత్ ద్వారానే భారతదేశం సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తుంది. సమతా భారత్‌కు రామ రాజ్యానికి తేడా ఏమీ లేదు.
డా॥ అంబేద్కర్ సమతా ఉద్యమానికి మారుపేరు. సమతా భారత్ వారి ఆకాంక్ష.
శ్రీరాముడు ధర్మస్వరూపుడు. ధర్మం అంటే ప్రజలను కలిపివుంచేది. ‘‘ప్రజలను విడగొట్టేది ధర్మం ఎట్లా అవుతుంది?’’ భౌతిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి దారిచూపేది ధర్మం. ధర్మంలో సమత్వం కూడా ఒక భాగం. వ్యక్తిగత, సమిష్టి సమగ్ర అభివృద్ధికి దారితీసేదే రామరాజ్యం. రామునికి రామరాజ్యానికి తేడాలేదు.
మహాభారతంలో ఒక శ్లోకం-
త్యజే దేకం కులస్యార్థే, గ్రామస్యార్థే కులం త్యజేత్,
గ్రామం జనపద స్యార్థే, ఆత్మార్థే పృథివీం త్యజేత్ ॥
అర్థం: కులమును రక్షించుటకై వ్యక్తిని, గ్రామం కొరకు కులమును, దేశంకోసం గ్రామాన్నీ విడిచిపెట్టాలి. ఇక ఆత్మకొరకైతే లోకమునే త్యజించవచ్చును.
25 నవంబరు 1949న భారత రాజ్యాంగసభ చివరి రోజున భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్న సందర్భంలో రాజ్యాంగసభ డ్రాఫ్టుకమిటి చైర్మన్ అయిన డా॥ అంబేద్కర్ భారత ప్రజలను ఉద్దేశిస్తూ, ‘‘గత 1000 సం॥ మనం స్వాతంత్య్రాన్ని కోల్పోయాము. నేడు మనకు స్వాతంత్య్రం లభించింది. ఈ లభించిన స్వాతంత్య్రం నిలబెట్టుకుంటామా? మరొకసారి కోల్పోతామా అన్న భయం నాకుంది. గతంలో విదేశీ ఆక్రమణకారులు మనదేశంపై దండయాత్ర చేసినపుడు మనదేశం స్వాతంత్య్రం కొరకు పోరాడిన పురుషోత్తము డు, పృథ్వీరాజు, రాణాప్రతాప్, శివాజీలకు వ్యతిరేకంగా ఆనాటి భారతీయులే విదేశస్థులకు సహకరించారు. దేశమంతా కలసి 1957 స్వాతంత్ర సంగ్రామం చేస్తూ ఉంటే సిక్కులు తటస్థంగా చూస్తూ ఊరుకున్నారు. చరిత్ర పునరావృతవౌతుందా? అని భయపడుతున్నాను. వ్యక్తిగత లాభం, కులపు లాభం, ప్రాంతీయ లాభం, పార్టీలాభం, సంస్థాగతలాభం కంటే దేశప్రయోజనాలే ముఖ్యమని మనందరమూ భావించి వ్యవహరించినపుడే మనదేశ స్వాతంత్రం రక్షింప బడుతుంది’’ అని వారు హెచ్చరించారు. మహాభారతంలో వ్యాసుడు హెచ్చరించిన అంశానే్న డా॥ అంబేద్కర్ తన జీవనంలో ఆచరించి చూపారు.

- కె. శ్యామ్‌ప్రసాద్, సామాజిక సమరసత. 94409 01360