Others

అందమై‘నది’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో ఇంత అందమైన నది మరొకటి ఉండదేమో.. దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఉన్న ఈ నదిని ‘ఖనిజాల గని’ అంటారు. ఈ నది రంగుని చూసి పర్యటకులంతా మంత్రముగ్ధులు అవుతుంటారు. ఈ ప్రాంతంలో ‘మకరేనియా క్లేవిగెరా’ అనే నీటి మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. వాటివల్లే ఈ నది రంగు అలా ఉంటుందట. వివిధ రంగుల్లో కనువిందు చేస్తున్న ఈ నది పేరు ‘కనో క్రిస్టాలీస్’. దీనే్న ‘రెయిన్‌బో రివర్’ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతానికి లక్షల ఏళ్ల చరిత్ర ఉంది. దీన్ని ‘షీల్డ్ ఆఫ్ గయానా’గా కూడా అభివర్ణిస్తారు. ఈ నది రంగు గురించి అనేక వాదనలు ఉన్నాయి. రాళ్లల్లో ఖనిజాలు ఎక్కువగా ఉండటంతో నదికి ఈ రంగు వచ్చిందని కొందరు అంటుంటారు. ఖనిజాలతో పాటు రాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగడం లేదని చెబుతారు. ఈ మొక్కలు ఏడాదికి ఒక సెంటీమీటర్ మాత్రమే పెరుగుతాయి. భూమిలోని ఖనిజాలకు అనుగుణంగా ఇక్కడి పూల రంగు ఉంటుంది. అమెజాన్ అడవి, ఆండియన్ పర్వత శ్రేణులు, ఒరినోకియా మైదాన ప్రాంతం ఇక్కడే కలిశాయి. నీటి మొక్కలు పెరిగే ఈ ప్రాంతంలో వేరు వేరు జోన్లు ఉంటాయి. ఈ నది వల్ల ఈ ప్రాంతానికి మంచి పేరొస్తోంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ప్రమాదకరమైన ప్రాంతంగా భావించేవారు. కానీ పర్యాటకంగా అభివృద్ధి చెందే కొద్దీ ఆ అభిప్రాయం పోతోంది. ఇక్కడి ప్రకృతి అందాలను చూసి అందరూ ముగ్ధులవుతుంటారు. *