Others
స్ర్తిమూర్తి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 15 April 2019
- శ్రీమతి రమాదేవి నర్సింహారావు న్యూజిలాండ్
ఈ మానవ మృగాల రాజ్యములో
నలిగిపోయే పసిపిల్లలు ఎందరో
ఈ మానవ మృగాలు మనుషులుగా
మారేది ఎన్నడో
ఒంటరిగా ఆడపిల్ల బ్రతికే రోజెన్నడో
ఈ పసిపిల్లల దుస్థితి మారేదెన్నడో
ఈ దుర్యోధన దుశ్శాసనులు మారేదెప్పుడో
సమాజంలో మార్పు తెచ్చేది ఎప్పుడో
ప్రతి మనిషి భీమునిగా మారి
ఈ కామాంధులను చంపేదెన్నడో
ఆడదంటె ఆటబొమ్మ కాదు
నిన్ను కన్న తల్లి ఆడదేనురా
అది మారిన ఆదిపరాశక్తిరా
నిన్న కన్నతల్లి ఆడదేనురా
అది మారిన ఆదిపరాశక్తిరా
ఈ నిజాన్ని తెలిసి మారురా
నీ కన్నతల్లి నీ తోడ పుట్టిన చెల్లి
ఈ నేలతల్లి నీ పురుటిగడ్డ ఆడదేనురా
ఆడది ఎప్పుడూ తోడై
నీతో మసలును రా
ఎన్ని చట్టాలున్నా మనిషి
మారినపుడే ఇది సాధ్యమురా