Others

చుక్కానివి నీవే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిక్కిన కడుపుకు
గుప్పెడు మెతుకులు పెట్టలేని
అమృత ఘడియలెందుకు

మనిషి పుట్టుకను ఆపలేని
దుర్ముహూర్తం ఊసెందుకు

మంచి చెడులను నిర్థారించలేని
తిథుల కుతి ఎందుకు

జీవిత గమనానికి
దిక్సూచి కాలేని
హస్తరేఖల గోలెందుకు

అభాగ్యుల జీవితాల్లో
చిరునవ్వులు పూయంచలేని
చిలుక పలుకులెందుకు

జీవితంలోని ఆటుపోట్లకు
పరిష్కారం చూపలేని
జాతకచక్రం చుట్టూ
గిరికీలు కొట్టడమెందుకు

మన బలహీనతే
మంత్రగాడి బలం

పేదోడి కన్నీళ్లే
బాబాలు, స్వాములకు పెట్టుబడి

నాటి ఆశ్రమాల్లో
జ్ఞానబోధ జరిగేది
నేటి ఆశ్రమాల్లో
సమస్యల సొద మారుమోగుతోంది

మూఢ విశ్వాసాలను నూరిపోస్తూ
నిలువు దోపిడీ చేస్తూ
బాబాలుగా అవతారమెత్తుతున్న వేళ

మనిషి జీవితమే ఒక గ్రంథం
నీ మెదడే జ్ఞాన భాండాగారం
స్థిమితమైన ఆలోచనే
సమస్యకు పరిష్కారం

తలరాతంటూ నిరాశతో కృంగిపోక
కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో
ముందుకు సాగిపో...
నీ జీవితానికి చుక్కానివి నీవేనని
తెలుసుకుని మసలుకో

- గుండు కరుణాకర్, 9866899046