Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఋక్షుడు తెల్లబోయాడు..
‘‘ఏమిటిది?... ఇలా నల్లబడిందేం?’’...అంటూ అతని వీణియనతనికిచ్చేశాడు.
నారదుని చేతిలో అది మళ్ళీ స్వర్ణవీణగా మారిపోయింది.
ఋక్షుడు మరింత ఆశ్చర్యపోయాడు.
అప్పుడు దాని తీవెల్ని సుతారంగా మీటాడు నారదుడు.
‘‘నారాయణ! నారాయణ!’’అంటూ అది మనోజ్ఞంగా పలికింది. కళ్ళు తేలవేశాడు ఋక్షుడు.
‘‘నేను రాత్రింబవళ్ళు’ నారాయణ నామస్మరణ గావిస్తాను. అందుకే అది స్వర్ణవీణగా మారిపోయింది. అది నావలెనే ‘నారాయణ’జపం చేస్తోంది. నీవేమో నీ భార్యాబిడ్డల నామస్మరణ గావిస్తావు. వారి పోషణార్థం దారుల్ని కొల్లగొడుతూ పాపం మూటగట్టుకుంటున్నావు. అందుకే ఇలా జరుగుతోంది’’! అన్నాడు. నారద మహర్షి.
‘‘ఐతే ఏం చేయమంటారు స్వామీ’’?
‘‘ఏంలేదు, నీవూ నావలెనే భగవన్నామ స్మరణచేయాలి. అప్పుడు నీవు మట్టిముట్టుకుంటే బంగారమవుతుంది.’’
‘‘ఐతే ఉపదేశించండి’’అన్నాడు ఋక్షుడు.
ఆయన ‘విష్ణు అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు. కానీ ఋక్షుడది ఉచ్ఛరించలేకపోయాడు.
అప్పుడు ‘‘శివ పంచాక్షరీ మంత్రాన్ని’’ఉపదేశించాడు.
దాన్నీ పలకలేకపోయాడు.
దాంతో ‘రామ’ నామ మంత్రోపదేశం చేశాడు.
అదీ స్పష్టంగా పలకలేక ‘‘మరా మరా మరా!’’ అనసాగాడు. నీవు తలకిందులుగా నిలిచి తపస్సుచేస్తావనుకుంటే, రామునే్న తలక్రిందులు చేస్తున్నావు సుమా! అయినా రాముడు రాముడే! ‘రామశబ్దం’ అత్యంత శక్తిమంతమే!.. అలాగే దీక్షతో జపిస్తూ ఉండు. నీ మనోరథం నెరవేరుతుంది.’’అంటూ ఒక తెలిమబ్బుల గుంపుల్లోకి దూరి, మబ్బులా మాయమైపోయాడు నారదుడు.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087