Others

పొగాకుపై చైనా ఆధిపత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రకరకాల చౌక వస్తువులతో ప్రపంచ మార్కెట్ వ్యవస్థను ముట్టడించిన చైనా తాజాగా తన పొగాకు ఎగుమతులతో ఘాటెత్తిస్తోంది. ఈ భూమి మీద పండే పొగాకులో 70శాతం చైనాలో పండిందే. అంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. ఆ తర్వాత స్థానం మాత్రం భారతదేశానిదే.
పొగాకు సాగును, పొగాకు ఉత్పత్తులను 2020నాటికి 50 శాతం తగ్గించాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ 2010లో ఉరుగ్వేలో ఫ్రేమ్‌వర్క్ కనె్వన్షన్ ఆఫ్ టొబాకో (ఎఫ్.సి.టి.సి) పేరిట చేసిన ప్రతిపాదనకు అనూహ్య స్పందన లభించింది. ఏకంగా 146 దేశాలు మద్దతు ప్రకటించి సంతకాలు కూడా చేశాయి. ఇందులో పొగాకు సాగులో మొదటి మూడు స్థానాల్లోఉన్న చైనా, భారత్, బ్రెజిల్ దేశాలు కూడా ఉన్నాయి. పొగాకులో 200కి పైగా హానికర రసాయనాలు ఉండటం అందులో 48 కేన్సర్ కారకాలయి ఏటా కొన్ని లక్షల మంది అకాల మరణానికి గురికావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పొగాకు ఉత్పత్తులపై యుద్ధం ప్రకటించింది. ప్రపంచ పొగాకు ఉత్పత్తుల లాబీ ఎన్ని ప్రయత్నాలు చేసినా 192 పెద్ద దేశాలను ఒక తాటిమీదకు తెచ్చి అందులో 146 దేశాల రాత పూర్వక హామీలు పొందటం ఒక పెద్ద ముందడుగ్గా చెప్పవచ్చు. 2020వ సంవత్సరం ఇంకా ఐదు సంవత్సరాల దూరంలో ఉండగానే బ్రెజిల్ దేశం తన పొగాకు ఉత్పత్తిని 650 మిలియన్ కిలోల నుండి 60 మిలియన్ కిలోలకు తగ్గించి వేసింది. అలాగే 250 మిలియన్ కిలోలు పండించే జింబాబ్వే 40 మిలియన్ కిలోలకు పరిమితమైపోయింది. భారతదేశం మాత్రం 300 మిలియన్ కిలోల సగటును కొనసాగిస్తోంది. కాగా చైనా ఈ పరిణామాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని ఏకంగా 2000 మిలియన్ కిలోల పొగాకును ఉత్పత్తిచేస్తోంది. ఈ కారణంగా చైనా ఒక్క పొగాకు ఎగుమతుల ద్వారా 17 శాతం విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. ప్రస్తుతానికి చైనా ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరికలను ఖాతరు చేయటం లేదు. 2020నాటికి 50 శాతం తగ్గించకపోతే అప్పుడు అడుగంటి-అప్పటి దాకా మా జోలికి రావద్దు అంటోంది.
కాగా గతంలో ఎక్కువ పొగాకును ఉత్పత్తిచేసే బ్రెజిల్, జింబాబ్వేల స్వయం నియంత్రణ కారణంగా భారతదేశం కూడా ఇప్పుడు భారీగా లాభపడింది. ఎప్పుడూ 2000 కోట్ల రూపాయలకు మించని పొగాకు ఎగుమతులు ఉండని దశలో 2012-13లో 4వేల కోట్లను 2013-2014లో ఏకంగా ఆరువేల 89 కోట్ల రూపాయలు 2014-15లో 5200 కోట్లు, 2015-16లో 4500 కోట్లు ఎగుమతుల ద్వారా సంపాదించింది. పొగాకు బోర్డు ప్రకటించిన విధంగా 10వేల కోట్ల సంపాదన కలగానే మిగిలిపోయింది.
2013-2014లో పొగాకు ఉత్పత్తులు చైనా- 70, భారత్-8, బ్రెజిల్-6, అమెరికా-5, ఇండోనేషియా-3 శాతం సాధించాయి.
భారత్ సాగులో ఒడిదుడుకులు:
భారతదేశంలో ఏటా 28వేల కోట్ల రూపాయల విలువైన పొగాకు ఉత్పత్తి అవుతోంది. అయినా పొగాకు సాగు మొదటినుండి ఒడిదుడుకులకు లోనవుతూ వస్తోంది. అంతర్జాతీయ పొగాకు మార్కెట్‌లో ఏ దేశమైనా తుమ్మితే మన పొగాకు మార్కెట్‌కు జలుబుచేస్తోంది. ఈ కారణంగా పొగాకు సేద్యం పరిస్థితి జూదంలా తయారైంది. ఒక సంవత్సరం లాభాలు వస్తే తర్వాత సంవత్సరం నష్టాలు తప్పవు. భారతదేశంలో పొగాకు సాగు అంటే అది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన అంశంగా మిగిలిపోయింది. ఎందుకంటే భారతదేశంలో ఉత్పత్తిఅయ్యే పొగాకులో 90 శాతం ఈ రెండు రాష్ట్రాలకు చెందినదే. మిగిలిన 10 శాతం ఒరిస్సా, మహారాష్టల్రలో ఉత్పత్తిఅవుతోంది.
పొగాకు విషయంలో చైనా ప్రభుత్వపరంగా తీసుకుంటున్న చర్యలు అక్కడి రైతాంగాన్ని నష్టాలబారినుండి కాపాడుతున్నాయి. భారతదేశంలో హెక్టారుకి 12 క్వింటాళ్ళు దిగుబడి ఉంటే చైనాలో 20 క్వింటాళ్ళు ఉంటోంది. చైనా ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్‌లోని పొగాకు ధరలతో సంబంధం లేకుండా కనీసం గిట్టుబాటు ధర ఇచ్చి రైతులనుండి పొగాకు కొనుగోలు చేయటంవల్ల రైతులు లాభపడుతున్నారు. చైనా ప్రభుత్వం పొగాకు విస్తీర్ణం విషయంలో రాజీపడదు. ఇందుకోసం పటిష్టమైన నియంత్రణ సంస్థను ఏర్పాటుచేసి అక్రమ పొగాకు సాగును నిరోధిస్తుంది. చైనాలో ఏకంగా 21 లక్షల హెక్టార్లలో పొగాకు సాగు చేస్తూ రెండు కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు.
తెలుగు రైతుల హవా:
భారతదేశంలో పొగాకు పంట సాగుకు కోస్తాఆంధ్రాకు చెందిన తెలుగు రైతులు మహారాజ పోషకులుగా ఉన్నారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా దశాబ్దాలు తరబడి వారు పొగాకు పంటను నమ్ముకొని ఉన్నారు. భారతదేశ పొగాకు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా 70శాతం పైమాటే. దేశ విదేశాల్లో పేరుపొందిన నాణ్యమైన బ్రాండ్ సిగరెట్లు తెలుగుగడ్డపై పండిన పొగాకుతో తయారయినవే. ఆంధ్రా పొగాకు 80 దేశాలకు ఎగుమతి అవుతోంది. ఈ కారణంగానే కేంద్ర పొగాకు బోర్డును గుంటూరులోని పొగాకు పరిశోధనా కేంద్రాన్ని రాజమండ్రిలోను ఏర్పాటుచేశారు. అధిక ఉత్పత్తికారణంగా 2015-2016 సీజన్‌లో రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోగా ఈ ఏడాది వర్షాభావం వల్ల దిగుబడులు తగ్గి నష్టపోయారు. పొగాకు కొనుగోలుచేసే వ్యాపారులు కూడా సిండికేట్ కావడంతో రైతులకు అన్యాయం జరుగుతోంది. రాష్ట్రంలో 19వేల కేంద్రాలద్వారా పొగాకు అమ్మకం జరుగుతోంది. 2013-2014 సీజన్‌లో రైతులు స్వల్పలాభాలతో బయటపడినా తిరిగి 2014-2015 సంవత్సరంలో నష్టపోయారు. ఈ విధంగా మన పొగాకు సేద్యం పెద్ద జూదంగా మారిపోయింది. ప్రస్తుతం కిలో 167 రూపాయల ధరతో ఆశాజనకంగా 2019-2020 సీజన్ ప్రారంభమైంది.

- పుట్టా సోమన్నచౌదరి 94403 39682