Others

నిష్కామ కర్మతో మోక్షానికి దారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం కర్మభూమి. భగవద్గీత ఈ గడ్డమీదే పుట్టింది.ఈ భూమి యోగభూమిగా అనాదిగా యోగ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. వేన వేల సంవత్సరాల క్రితం సర్వోత్తముడైన పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుని రూపంలో గీతోపదేశం చేశాడు. జీవోత్తముడయిన వ్యాస మహర్షి భగవాన్ ఉవాచను కృష్ణా ర్జున సంవాద రూపంలో అక్షరబద్ధం చేశాడు. గీతాగ్రంథం జన ప్రియమైన ఒక అద్భుత అమరకృతి.
ప్రపంచానికే తలమానికమైన ఆధ్యాత్మిక అనుష్ఠాన శిక్షణాచిరుపుస్తకం. శబ్దార్థ సార్వభౌమత్వం కలిగిన తాత్త్విక సమాహారం. ఆధ్యాత్మిక నిదర్శనం. తేలిక భాషలో అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పిన మధురపదార్థం ఈ గీతోపనిషత్తు.
మొదటి అధ్యాయం భగవానుని ఉదరం, చివరి రెండు అధ్యాయాలు దేవుని పాదాలు. తరువాత ఐదు ఆధ్యాయాలు ముఖమని మిగతా పది అధ్యాయాలు తొడలని, - ఇలా తన వాఙ్మయ స్వరూపాన్ని కృష్ణుడు మనకోసం ప్రసన్నం చేశాడు. మరో విశేషమేమంటే గీతా మహాత్మ్యాన్ని తెలియ చేసింది శివుడని, దానికి భాష్య అర్థ తాత్పర్యాలను సమకూర్చినది సాక్షాత్తు వాయుదేవుని అవతారం అయిన శ్రీమధ్వాచార్యులని ప్రతీతి.
గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. విషాదంతో పాటు మొదలు కావటం ఏమిటన్న సందేహం చాలామందికి వస్తుంటుంది.
చీకటి నుంచి వెలుగు ఎలాగో, పాలసముద్ర మధనంలో హాలాహలం తరువాత అమృతం ఎలాగో , ఇదీ అలాంటిదే. విభక్తమైన మనస్తత్వం వియోగ బాధకు గురి కావటం వల్ల అర్జునునికి విషాదం ఏర్పడింది. అర్జునుని విషయంలో జరిగిందదే. మనస్సు మోహాంధకారంలో ఉన్నంత వరకూ విషాద యోగం తప్పదు. వివేకమనే జ్ఞాన ఖడ్గాన్ని కృష్ణుని దయవల్ల చేపట్టగా ఆజ్ఞానమనే తెర తొలగిపోతుంది. అర్జునుడి ముందు తక్షణ కర్తవ్యం సాక్షాత్కరించింది. దశ దిశ మారిపోయాయి. రథంలో నున్న అర్జునుడికి సారథి స్థానంలో సర్వోత్తముడైన కృష్ణుడు రథంపైన రెపరెప లాడుతున్న కపిధ్వజం , వరుణ దేవుడిచ్చిన గాండీవం, రథానికి పూన్చిన తెల్లని ఏడు గుర్రాలు చేతిలో ఉన్న దేవదత్త శంఖం గుర్తుకు వచ్చాయి. సంశయం తొలిగిపోయింది. విజయ శంఖం పూరించి సింహంలా శత్రు సైన్యం మీదికి విజృంభించాడు.
అర్జున విషాదయోగం సాధనలో తొలి సోపానం. అర్జునుడు ఆ మెట్టు ఎక్కడానికి ఎంతోకష్టపడ్డాడు. అది మనం తెలుసుకోవాలి.మనమూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి కూడా కష్టపడాల్సిందే.
తత్వజ్ఞాన ఫలం అందుకోవడానికి కర్మమార్గంలో ముందుకు అడుగువేయాలి. కర్మానుభావం వల్ల కష్టసుఖాలు కలుగుతుంటాయి. వాటిని తెలసుకోవడం చాలా అవసరం. కర్మయోగానికి ఫలితం జ్ఞాన యోగ సాధన. దీని వల్ల కలిగేది మోక్ష ఫలం. మూడవ అధ్యాయం పూర్తిగా కర్మయోగాన్ని నిరూపించడానికే ఉపయోగపడింది. కర్మబంధం తొలగాలంటే ఫలితాన్ని గురించి ఆలోచించటం మానాలి. కృష్ణార్పణ బుద్ధితో కర్తవ్య కర్మను అనుష్టించాలి. ఫలాన్ని ఆశించకుండా కర్మను చేయడమే కర్మయోగం. బంధానికి మోక్షానికి కర్మేకారణం. కామ్యకర్మబంధానికి, నిష్కామ కర్మమోక్షానికి కర్మసిద్ధాతమే దారిచూపిస్తాయి. స్వార్థ లాలసతో కర్మ చేస్తే బంధం. విహిత కర్మ చేస్తే విముక్తి. జగత్ చక్రం నడవాలంటే కర్మ తప్పనిసరి. తెలివిగా జీవించడానికి వైరాగ్య భావనతో కర్మను చేయడమే మంచిది. అన్నింటికీ ఈశ్వరుడే కర్తకర్మఅని కర్తవ్యాన్ని చేస్తూ పోతే చాలు ఫలితం ఏమి ఇవ్వాలో భగవంతుడే చూసు కొంటాడు.

- నిరామయ