Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాల్మీకి మహర్షి భక్తితో నమస్కారం చేశాడు.
అతనిలోని మార్పును గమనించిన నారదుడు ఎంతో సంతసించాడు. కుశల ప్రశ్నల్ని వేశాడు. మనసారా ఆశీర్వదించాడు.
‘‘మహాత్మా! మీరు ఏఏ లోకాలు తిరిగి వస్తున్నారు? ఎవరెవరిని సందర్శించారు?’’ అంటూ ప్రశ్నించాడు వాల్మీకి.
‘‘మహర్షీ! నేను ముల్లోకాలూ తిరిగి వస్తున్నాను. కానీ, ఆ ముల్లోకాల్లోనూ భూలోకమే దివ్యంగా ఉంది’’. సుమా అన్నాడు.
‘‘ఎందుకని మహత్మా?’’
‘‘ఇప్పుడు భూలోకంలో కోసల రాజ్యాన్ని సూర్యవంశపు రాజైన, దశరథుని కుమారుడైన శ్రీరాముడు పరిపాలించడంవల్లనే. ఆయన పరిపాలనలో ధర్మం నాలుగు పాదాలతో నడవడంవల్లనే!’’అంటూ శ్రీరాముని గుణగణాల్ని వర్ణించాడు నారదుడు.
‘‘అలాగా స్వామీ!...ఐతే, ఆ కథ చెప్తారా?’’అంటూ ప్రశ్నించాడు ఋక్షుడు.
‘‘తప్పకుండా నాయనా!’’అంటూ సంక్షిప్తంగా రామకథని వినిపించాడు. అంతా విన్నాక---
‘‘ఈ కథని కావ్యంగా రచిస్తే ఎలా ఉంటుంది స్వామీ?’’
‘‘చాలా గొప్పగా ఉంటుంది. సమాజానికి ఆదర్శప్రాయంగా ఉంటుంది. విశ్వకళ్యాణం సిద్ధిస్తుంది. అందువల్ల ఆ పనికి నీవే పూనుకోవాలి! శుభమస్తు!’’అని ఆశీర్వదించి, మళ్ళీ మబ్బుల్లోకి దూరి అదృశ్యమైపోయాడు.
కృష్ణపత్నులు- ‘‘మరియెప్పుడు? ఎలా? ఆయన రామ కథని రచించాడు?’’ అని అనుకొన్నారు.
నారదుడు- ‘‘ఆయన క్రౌంచ మిథునాన్ని చూశాక, ఆ జంటలో ఒక మగ పక్షిని బోయవాడు కూల్చాక, ఆతడిని తీవ్రమైన పదజాలంతో వాల్మీకి శపించాక, ఆ మాటలు ఛందోబద్ధమైన శ్లోకంగా ఉండడంవల్ల ఆయన తీవ్రమైన వేదనకూ, ఆశ్చర్యానికీ గురియై ఆలోచనల్లో మునిగిపోతాడు.’’ కృష్ణపత్నులు- ఐతే ఏమయింది?

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087