Others

ఆరోగ్యానికి సరైన ఆహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక కాలంలో ఉద్యోగాలు మెదడుకు తప్ప శరీరానికి శ్రమ ఇచ్చేవిగా ఉండటం లేదు. రోజుకు పది, పనె్నండు గంటలపాటు కదలకుండా డెస్క్ ముందు కూర్చొని పనిచేసి అలసిపోయి ఇంటికి తిరిగివచ్చి తినీ తినక ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. దాదాపుగా ఏ రంగాన్ని తీసుకున్నా పనివిధానమిలాగే ఉంటోంది. కాబట్టి ఉద్యోగం మానడమనేది కుదరని పని. మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమెలా అంటే అందుకూ మార్గం ఉన్నది. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా రోజంగా రోబోలా కూర్చుని పనిచేయడం వల్ల వచ్చే ప్రతికూల పరిణామాలను తగ్గించుకోవచ్చు. ఆఫీసులో కూర్చుని ఏం తింటాం అనుకోవలసిన అవసరం లేకుండా తేలికగా మోసుకు వెళ్ళగల ఆహారమిది. అవి గుండెకు, బీపీకి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ఆహారం. అందులో ఐదింటి గురించి తెలుసుకుందాం.
అక్రూట్లు
బాదం పప్పు, బఠాణీలు, పిస్తాలు, మరే ఇతర నట్స్ కన్నా కూడా అక్రూట్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. డ్రైఫ్రూట్స్ అన్నీ గుండెకు సంబంధించే వ్యాధులను తగ్గించే లిపిడ్స్‌ను మెరుగుపరుస్తాయి. కానీ అక్రూట్లు అంతకు మించి సాయపడతాయని పరిశోధనల్లో తేలింది. అల్జీమర్స్‌తో బాధపడుతున్న జంతువులకు వీటిని తినిపించగా వాటి జ్ఞాపకశక్తి మెరుగుపడినట్లు తేలింది. రోజుకు ఏడు అక్రూట్లు తింటే చాలని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో అధికశాతం ఉండే పాలిఫెనాల్స్ ధ్వంసమైన డి.ఎన్.ఏ.ను మరమ్మతు చేయడమే కాకుండా రోగనిరోధక వ్యవస్థను కూడా ఉత్తేజితం చేస్తాయి. అంతేకాదు గ్రీన్ టీలు కేన్సర్ రాకుండా నిరోధిస్తుంది. చర్మం, ప్రోస్టేట్ కేన్సర్లు రాకుండా కూడా ఇది నిరోధించగలదు.
పాప్‌కార్న్
ఆరోగ్యకరమైన స్నాక్స్ చిట్టా ఏదైనా మీ వద్ద ఉంటే అందులో తప్పనిసరిగా ఉండే పేరు దీనిదే.. మనకు అందుబాటులో ఉండే ఆరోగ్యకరమైన స్నాక్స్‌లో పాప్‌కార్న్ ఒకటని చాలామంది చెబుతుంటారు. ఇందులో ఫైబర్ కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికశాతంలో ఉంటాయి. అయితే ఉప్పు తగ్గించుకుని వేసుకుంటే దాన్ని మించిన ఆహారం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆఫీసులో మైక్రోవేవ్ సౌకర్యం ఉంటే అందులో తక్కువ ఉప్పుగల పాప్‌కార్న్ తెచ్చి రెండు నిముషాల్లో వాటిని తయారుచేసుకోవచ్చు.
డార్క్ చాకొలేట్
ఇందులో కూడా పాలిఫెనాల్స్ వంటి బలమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె వ్యాధులను నిరోధించడమే కాకుండా రక్తం గడ్డకట్టిపోవడాన్ని కూడా నిరోధిస్తుందిట. రోజూ చిన్న డార్క్ చాకొలెట్ బార్‌ను తింటే రక్తపోటు తగ్గిపోతుందట. డార్క్ చాకొలేట్‌లో ఉండే కెఫైన్ మానసికంగా ఉత్తేజితం చేయడమే కాదు ఏకాగ్రత పెరిగేందుకు కూడా దోహదం చేస్తోంది.
పళ్ళు
ఆకలి వేస్తున్న భావనను జయించేందుకు అత్యుత్తమ ఆయుధం పళ్ళే.. అంతేకాదు అందులో ఉండే పౌష్టికత మనం నీరసపడకుండా రోజంతా పనిచేసేందుకు సహాయపడుతుంది. ఆపిల్స్, అరటిపళ్ళు, మామిడిపళ్ళు, బొప్పాయి వంటి పళ్ళను రోజువారీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆమాత్రం చేయక తప్పదు మరి.