Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారదుడు- అలా ఆయన రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. అందరూ నిద్రించారు. కానీ, ఆయనకు నిద్రపట్టడంలేదు.
ఆశ్రమం బయట, ఉద్యానవనంలో, కుశలశయ్యపై వెల్లకిలా పడుకుని, ఆకసం వంక చూస్తున్నాడు.
అది శరత్పూర్ణిమ, చంద్రుడు వెండి వెలుగుల దారాల్ని వడుకుతున్నాడు. పిండారబోసినట్లుగా ఉంది వెనె్నల.
ఆకసంలో అక్షరాల్లా నక్షత్రాలు! చివర్ని ఒక పూర్ణ బిందువులా ఉన్న చంద్రుడు! ఆ అక్షరాలు ఒక వాక్యంలా, ఆ వాక్యం ఒక కావ్యంలా తోచిందామహర్షికి!
అతడు తన దృష్టినంతా చంద్రునిపైనే కేంద్రీకరించాడు. అతనికి తెలియకుండానే అతని ఆత్మచంద్రునిలోకి వెళ్ళిపోయింది.
వెండికొండపై, మంచుముద్దలపై నడుస్తోన్న దివ్యానుభూతి కలుగుతోంది! మనోజ్ఞమైన పరీమళం వీస్తోంది! అక్కడ ఓ ప్రశాంత సరోవర తీరాన ఉన్న హిమఖండంపై కూర్చున్నాడు. మబ్బులు వీవెన వీస్తున్నాయి! హిమానీ నదాలు పాదప్రక్షాళన గావిస్తున్నాయి! రాయంచలు సరస్సులో కేళీవినోదంలో మునిగాయి. నక్షత్రాలు ఆ కొలని నీటిలో ఈదులాడుతున్నాయి. కొమ్మల్లోంచి, ఓ కోకిల మధురాతిమధురంగా రామాయణ కథామృతాన్ని గానంచేస్తోంది!
అక్కడ, ఆయన పద్మాసనంవేసి కూర్చున్నాడు. తనలోకి తాను పయనిస్తున్నాడు!
ఇంతలో కమలాసనుడు, వెండివెనె్నల వెలుగుల్తో, పత్నీసమేతంగా దర్శనమిచ్చాడు ఆతనికి.
చంద్రునిపై చంద్రునిలా ఉన్నాడు బ్రహ్మ!
ఆ చంద్రుని వెనె్నల వెలుగుల్లా ఉంది సర్వశుక్ల!
వారిరువురకూ పాదాభివందనం చేశాడు వాల్మీకి.
వారతనిపై పూలనీ, లాజల్నీ చల్లుతూ ఆశీర్వదించారు.
‘‘నాయనా! నీ బాధ అర్థమైంది మాకు’’- అంది సరస్వతీ దేవి.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087