AADIVAVRAM - Others

ముక్తకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతగా సముద్రాన్ని మధిస్తేనే
అమృతం వచ్చింది
ఆరుగాలం పొలంలో శ్రమిస్తేనే
అన్నం దొరుకుతుంది

జీవితం
గాలిపటాలాట కాదు
పెయించీ వేసి తెగ్గొడితే
జీవితమే గాలిలో గాలిపటం

మారాలని చెప్పే ముందు
మారు నువ్వు ముందు
నీ నుంచే రావాలి
ఏ మార్పైనా ముందు

అడుగు ముందుకు వెయ్యడం
అభ్యుదయానికి చిహ్నం
వేసిన ప్రతి అడుగూ
విజయానికి సంకేతం

పంతులు చెప్పేవే
పాఠాలు కాదు
ప్రకృతి చెప్పేవీ
పాఠాలే మిత్రమా!

ఛీత్కారాలతో బతకడం
జీవితం కాదు
మరువంలా మానవత్వంతో
పరిమళించడమే జీవితం
బెత్తం పట్టుకున్నవాడు
బాధ గురువు
చిత్తాల్లో దీపాలు వెలిగించేవాడు
బోధ గురువు

జ్యోతిష్యం చెబుతానంటాడు
బూడిద గురువు
వాని బ్రతుకు రేపేవౌతుందో
వాడికే తెలియదు

రైతుకు కావలసినవి నేడు
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు
నాయకుల ప్రసంగాలు కాదు
‘రాఫెల్’ కుంభకోణాలు కాదు

రాజకీయమే
ఓ డ్రైనేజీ
దానిలో ఈదుతున్న నేతలు
గంగాస్నానమనుకుంటున్నారు

-డా.తిరునగరి 93924 65475