Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏం చేయమంటారు మాతా!’’అంటూ ప్రశ్నించాడు మహర్షి.
‘‘రామాయణ మహాకావ్యాన్ని లిఖించు నాయనా!’’అన్నాడు బ్రహ్మ.
‘‘అది నాకు సాధ్యమవుతుందా స్వామీ?’’
‘‘తప్పకుండా! అదీ నీవల్లే అవుతుంది. శ్రీరామభక్తుడవు నీవు. ఆ పనిని నీవు తప్ప మరొకరు చేయలేరు. ఎక్కడ సత్సంకల్పం ఉంటుందో, అక్కడ దారులు విచ్చుకుంటాయి! గమ్యం తనంతటతానుగా ఎదురొస్తుంది.’’ అంది ఆ మహాతల్లి.
‘‘్ధన్యోస్మి!’’
‘‘ఇదిగో!’’అంటూ ఓ దివ్య లేఖినిని అనుగ్రహించింది శారద.
‘‘ఇదిగో!’’అంటూ వేదాన్ని చేతికందించాడు బ్రహ్మ!’’
‘‘మహాప్రసాదం!’’అంటూ, ఆ రెండింటినీ అందుకొని కళ్ళకద్దుకున్నాడు వాల్మీకి మహర్షి.
‘‘నీ పేరు ఆచంద్ర తారార్కం శాశ్వతంగా నిలుస్తుంది!’’ అంటూ ఆశీర్వదించి, ఆ దంపతులు అదృశ్యమైపోయారు.
గమ్మత్తుగా తానొక రాయంచలా మారిపోయాడు వాల్మీకి! రెక్కవిప్పి, దివ్య లోకాల్లో తేలియాడుతూ, భూమిపైన, మానస సరోవరంలో అవతరించాడు! ఆ అమృత జలాల్లో ఈదులాడి, ఒడ్డుకి చేరుకున్నాడు!
కళ్ళుతెరిచే సరికి ఏముంది?
తాను, తన శయ్యపైపడుకొని ఉన్నాడు.
మరునాడుదయాన- ఆయన రామకథా రచనకి ఉపక్రమించాడు. ఆ కావ్యానికి ఆయన ‘సీతాచరితం’అన్న నామకరణం చేశాడు. ఆపై ఆతని శిష్యులు, ప్రశిష్యులు దానిని గానంచేస్తూ ప్రపంచమంతా వ్యాపింపజేశారు. కాలక్రమంలో అది విస్తరింపబడి, ఒక రామాయణ మహాకావ్యంగా అవతరించింది.’’-

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087