Others

క్షమించడమే ఉత్తమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపకారికి ఉపకారం నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ .. అంటూ శతకకారుడే కాదు మన పెద్దలూ నీతిబోధ చేస్తుంటారు. అపకారం ఫలానా వారు చేశారు అని తెలిస్తే చాలు వారిమీద ఎక్కడ లేని ఆగ్రహం వచ్చితీరుతుంది. ఒకవేళ రాకపోతే అదేవింత అవుతుంది. అటువంటి అపకారులకు ఉపకారం చేయాలనేది మన పెద్దల బోధ. ఎవరు తప్పు చేసినా వారిని క్షమించడమే గొప్పవిషయం కాని అపకారం చేసిన వారిని శిక్షించడం కన్నా క్షమించడమే వారికి పెద్ద శిక్ష అనిపిస్తుంది. వారు మానసికంగా ఆత్మ పరిశీలన చేసుకొనే అవకాశం వారికి వస్తుంది. తాము చేసింది తప్పుఅని తెలియగానే వారిలో పశ్చాత్తాపం మొలకెఋ్తంది. ఇలా పశ్చాత్తాపం చెందితే వారిలో మరలా తప్పు చేసే ఆలోచన రాదు. కనుక కేవలం క్షమించడం వల్ల గొడవలు, అపార్థాలు కక్షలు కార్పణ్యాలు పెరగకుండా ఉండడమే కాదు ఎదుటివారిలో తప్పు చేసినవారిలో , వారి ఆలోచనావిధానములో మార్పు తీసుకొని రావచ్చు. తప్పులెన్ను తండోపతండంబుగా ఉంటారు. తప్పు చేయని ఈఉర్విలో ఎవరైనా ఉండడానికి సాధ్యమా అని మరో శతకకారుడు అడుగుతాడు. నిజమే చిన్నదో పెద్దదో కొద్దో గొప్పగానో తప్పు చేయడం సహజమే. కాని ఆ తప్పు ను తెలుసుకొని తిరిగి తప్పు చేయకుండా ఉండేవాడే మనిషి అనిపించుకుంటాడు.
అట్లా తప్పు చేయకుండా ఉండేఅవకాశాన్ని ఈ క్షమించేవారు ఇస్తారు. కనుక క్షమించినవారు గొప్పవారు, తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం చెందేవారు గొప్పవారిగా మారేవారు ఇద్దరూ మనుషులుగా రాణించడానికి అవకాశం దొరుకుతుంది.
గౌతముడు అనే బ్రాహ్మణుడు స్వధర్మం విడిచి చెడు సావాసాలకు లోనై ఒక బోయ వనితను వివాహం చేసుకున్నాడు. మాంసభక్షణ చేస్తూ మద్యం సేవిస్తూ పరమ దుర్మార్గుడై డబ్బు కోసం అడవిలో వర్తకులతో తిరుగుతుండేవాడు. ఒకనాడు అరణ్యంలో వెళ్తుండగా వానిని ఒక మదపుటేనుగు తరమగా అతను దారి తప్పి అలసటతో ఒక మర్రిచెట్టు క్రింద దాగున్నాడు. ఆ మర్రిచెట్టు నాడీజంఘడు అనే బకము నివాసం. ఆ నాడీజంఘుడు బ్రహ్మకు మిత్రుడు. గొప్ప ధార్మికుడు. ఆ నాడీజంఘుడు అలసి ఉన్న ఆ బ్రాహ్మణుని అతిథిగా తలచి గౌరవించి భోజనం ఏర్పాటుచేసి అతని కథ విని జాలిపడి ‘‘స్వామీ నా వద్ద ధనం లేదు, నా మిత్రుడు విరూపాక్షుడనే దనుజుడు మధువ్రజపురంలో ఉన్నాడు. వానివద్దకు వెళ్ళు, నీకు ధనమిస్తాడు’’ అని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు మధువజ్రపురం వెళ్లి విరూపాక్షుని కలిశాడు. వీనిని చూడగానే విరూపాక్షుడు వీడు పరమ దుర్మార్గుడు, నీచుడని గ్రహించాడు. ధనమివ్వదల్చుకోలేదు. కారణం నీచులకు ఉపకారం చేస్తే అది అపకారమే అవుతుంది. ఏ విధంగానంటే పాముకు పాలు పోసి పెంచితే అది మరింత విషాన్ని వృద్ధి చేసుకొని కాటువేస్తుంది అని నీతిశాస్త్రంలో చెప్పబడింది.
తన మిత్రుని మాట విని విరూపాక్షుడు ఆ బ్రాహ్మణునికి ధనం ఇచ్చి పంపాడు. దాన్ని తీసుకుని ఆ బ్రాహ్మణుడు తిరుగు ప్రయాణంలో ఎండ వేడికి నాడీజంఘుడు నివాసమున్న మర్రిచెట్టు నీడను విశ్రమించాడు. నాఢీ జంఘుడు తిరిగి ఆ విప్రుడికి సేవ చేసి తాను కొంత సేపు విశ్రమించాడు. కాని ఈ ఆ బ్రాహ్మణుడు గాఢ నిద్రలో వున్న నాఢీజంఘుని చంపేశాడు. మరునాడు యథాప్రకారంగా నాడీజంఘుడు తన వద్దకు రాకపోవడం చూసి కారణం తెలుసుకొని రమ్మనమని విరూపాక్షుడు దూతలను పంపాడు. వారు వచ్చి బకము చంపబడ్డ విషయం చెప్పారు. ఘోరం చేసింది ఆ బ్రాహ్మణుడే అని తలచి వానిని పట్టి బంధించి తెమ్మనమని ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ బ్రాహ్మణుని బంధించి తెచ్చారు. విరూపా క్షుడు బ్రాహ్మణుని చంపి కాకులకు వేయమని చెపితే ఆ కాకులు ఈ మూర్ఖుని శరీరాన్ని ముట్టుకోమని చెప్తాయ.
వానిని చంపి తినడానికి చివరకు కుక్కలు కూడా అంగీకరించలేదు. విరూపాక్షుడు ముందుగా తన మిత్రునికి అంత్యక్రియలు జరిపిద్దామని మిత్రుని కళేబరాన్ని చితిపై పెట్టి నిప్పు అంటించబోయే సమయంలో ఇంద్రుడు అటుగా రావడం చూసి తన మిత్రుడిని బ్రతికించమని పార్థించాడు.అంతలో ‘‘ఈ నాడీజంఘుని చితికి దగ్గరలో సురభి తన దూడకు పాలిస్తుండగా ఆ దూడ మూతినుండి పాలనురుగు గాలికి ఎగిరివచ్చి చితిమీద పడింది. దాంతో నాడీజంఘుడుకి ప్రాణం తిరిగివచ్చి లేచాడు. అదంతా బ్రహ్మదేవుని ప్రభావం అనిఇంద్రుడు వారికి చెప్పారు. నాడీజంఘుడు బ్రాహ్మణుడు బధించబడి ఉండడం చూసి వానికి విధించబడిన శిక్ష తెలుసుకొని వానిని క్షమించి విడిచిపెట్టమని వారిని ప్రార్థించి వానిని విడిపించాడు. అంతేకాదు ఆ బ్రాహ్మణుడికి ధనమిప్పించి పంపాడు నాడీజంఘుడు.
ఇలా ఎవరైనా అపకారం చేసినవారికి ఉపకారమే చేస్తూ ఉంటే కొన్నాళ్లకు అపకారు లకు బుద్ధి మారవచ్చు.

- కె. వాణి ప్రభాకరి