Others

మానవుడే మహనీయుడు.. (నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుని విశిష్టతను తెలియజేసే ఒక పాటను ఇద్దరు లబ్దప్రతిష్ఠులు -ఒకే రకమైన కథాంశం, ఒకే సన్నివేశానికి వారి బాణిలో రాసి స్ఫూర్తిదాయకం చేశారు. మహాభారతంలో గాంధారి వ్రతం చేస్తూ కుంతిని పిలవదు. దాంతో -తల్లికి జరిగిన అవమానానికి పంచ పాండవులు కోపోద్రిక్తులవుతారు. అలాంటి వ్రతానే్న తల్లిచేత చేయించ సంకల్పిస్తారు. అర్జునుడు ఆకాశానికి బాణాలతో నిచ్చెన కట్టగా, భీముడు అధిరోహించి సురలోకానికి వెళ్లి ఇంద్రుని మెప్పించి ఐరావతాన్ని తీసుకొస్తాడు. ఈ నేపథ్యంలో వచ్చే గీతాన్ని 1959లో వచ్చిన ‘గాంధారి గర్వభంగం’ కోసం మహాకవి శ్రీశ్రీ ‘మనుజుడు ఇల మహానుభావుడే’ అంటూ రాయగా పామర్తివారు కట్టిన బాణీని అమరగాయకుడు ఘంటసాల అద్భుతంగా ఆలపించారు. మనజులు తలచుకుంటే నదుల గతులు మార్చడా, భూమ్యాకాశాలను ఏకం చేసే సేతువు నిర్మించడా? అంటూ శ్రీశ్రీ స్ఫూర్తిదాయక గీతాన్ని అందించారు. ఇదే సన్నివేశాన్ని 1972లో వచ్చిన ‘బాల భారతం’లో వాడగా, ‘మానవుడే మహనీయుడు’ అంటూ ఆరుద్ర మరో స్ఫూర్తిదాయకమైన గీతాన్ని అందించారు. శివుని జటాఝూటంలోని గంగను భువికి తెచ్చిన భగీరథుడు, సుస్థిర తారగా మారిన ధ్రువుడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుడు నరేలేనంటాడు. గ్రహరాసులను అధిగమించి -చంద్రలోకమైన, దేవేంద్రలోకమైన జయించి బొందితో భువికి రాగలిగిన వాడు మానవుడే అంటూ ముగిస్తారు. ఎస్ రాజేశ్వర రావు స్వర బాణీకి ఘంటసాల అద్భుతగానాన్ని అందించి ప్రేరణాత్మక గీతం చేశారు. రచనల్లోని సృజన, ప్రేరణ పిల్లలకు అందాలంటే ఇలాంటి గీతాలు పాఠ్యాంశాలు చేయదగ్గవే. అందరూ మెచ్చదగిన పాటలివి.

సుసర్ల సర్వేశ్వర శాస్ర్తీ, విశాఖపట్నం