Others

శ్వాసపై ధ్యాసతోనే ఫలితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీచక్రము, మానవ శరీరం
డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్
9849560014

- ప్రతులకు -
7-8-51, ఫ్లాట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2, హైదరాబాద్- 500079
*
గొప్ప భక్తిజ్ఞాన, ధ్యానులైన, ధృవుడు, ప్రహ్లాద, నారద, పరాశ, పుండరీకాది, భాగవతోత్తములు ఏ విధమైన నిశ్చల భక్తి జ్ఞాన నిష్టాగరిష్టులై, ధ్యాన యోగావలంబులైనారో అట్టి మార్గము ననుసరించుట శ్రేయస్కరము.
ధ్యాన (9వ మార్గంలో) యోగంలో పరిణతి సాధించటానికి సద్గురు కటాక్షమెంతో అవసరం.
సద్గురు కృపతోనే ధ్యానయోగం సాకారంగా ప్రారంభమై నిర్గుణ ధ్యానంగా పరిణమిస్తుంది. ధ్యానసాధనాక్రమంలో అనేకమంది మహానుభావులు, సిద్ధపురుషులు, విజ్ఞులు వారి వారి భావనలను, అనుభవాలను తెలియజేశారు. వీటిలో దత్తక్రియాయోగుల కనుసరణీయమైన గురుగీతలో తెలిపిన విధానాన్ని పరిశీలిద్దాం. ‘్ధ్యనమూలం గురోర్మూర్తిః’ అంటే గురురూపం, ధ్యానానికి ఆధారం, అట్టి రూపానె్నట్లు ధారణ చేయాలి.
పరాత్పరుడు, స్ఫటికం వలె పరిశుద్ధుడైన తన గురుమూర్తిని, తన హృదయాకాశం మధ్యలో అంగుష్టమాత్రం (బొటనవ్రేలి) పరిమాణంగా ధ్యానించాలి. ప్రారంభంలో నిట్టి గురువుని ఎలా భావించాలో ఈ క్రింది విధంగా చెప్పారు.
హృదయ కమల మధ్యమందు కర్ణికమీదనున్న సింహాసనంలో కూర్చుని, దివ్యమైన రూపంతో చంద్రరేఖవలె ప్రకాశిస్తూ, సచ్చిదానందమనే వరాన్ని యిచ్చేవాడయిన సద్గురుని ధారణ చేసి ధ్యానించాలి. గురువునే ఎందుకు ధ్యానించాలి అంటే - గురువు అజ్ఞానాన్ని పోగొట్టేవాడు కనుక. ‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే దాన్ని పోగొట్టేవాడు అని అర్థం. అంతేకాక ఆయన క్షిప్ర ప్రసాది అని చెప్పుకోవాలి. ‘గురుం వినా, న బోధ్యతే, జ్ఞానమ్- జ్ఞానాత్, సంజయతే, జ్ఞానమ్’ - గురువువల్లనే మనకు జ్ఞానబోధయు, ధ్యానబోధయు జరుగుతుంది. ధ్యానంవల్ల జ్ఞానం పెరుగుతుంది. శ్రీ శంకర భగవత్పాదులవారు శివానందలహరిలో ఈ విధంగా వివరించారు.
జీవుని యొక్క పూర్వపుణ్యములనెడి ఉదయగిరులపై అమృత స్వరూపుడైన చంద్రుడు, పదునారు కళలతో శివసుందర ప్రసన్నుడై ప్రకాశిస్తుంటే అంతరంగాన వున్న చీకట్లు పారద్రోలి, హృదయాకాశంలో ప్రకాశిస్తున్న జ్ఞానామృత మూర్తిని చేరినంతనే అంతరంగమనబడే సముద్రం ధ్యాన రసానుభూతులనబడే కెరటాలతో ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ఇంకా శివానందలహరిలోని శ్లోకాలలోకూడా ధ్యానయోగానికి చెందిన సమన్వయం చెప్పబడింది.
ఇక ధ్యాన పద్ధతులను గురించి ఎందరో జ్ఞానులు, ధ్యానులు ఎన్నో విధాలుగా వర్ణించి వివరించారు.- గౌతమబుద్ధుడు బోధించిన ధ్యానమార్గం (విపాననా ధ్యానం) శ్వాసమీద ధ్యాసయుంచమని, ఆసనసిద్ధితో ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ నిశ్చల మనస్సుతో ప్రయత్నిస్తే ధ్యానం స్థిరపడుతుందని బోధించారు. శ్వాసమీద ధ్యాస నిలిపి ధ్యానము చేయగా చేయగా కొంతకాలమునకు మనస్సు నిర్మలవౌతుంది. అప్పుడు ధ్యానం నిలబడుతుంది. ధ్యానం స్థిరమయినపుడు, సాధకునికి ఉచ్ఛ్వాస నిశ్వాసలమీద గమనిక క్రమంగా పోతుంది. కాని ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగిపోకుండా మంద్రంగా జరుగుతాయి. అలా చేయగా చేయగా సాధకుని మనస్సునందు ఒక వెలుగు మొదలవుతుంది. అదే జ్ఞానం. అట్టి జ్ఞానంవల్ల దేహాత్మభావం నశించి చిద్రూప దర్శనమవుతుంది. అపుడు మాత్రమే స్వయం ప్రకాశకుడైన పరమాత్మను సాధకుడు దర్శించగలుగుతాడు. దీనిని హంస స్వరూపమంటారు. ధ్యానం గురించి శ్రీ విద్యారణ్యస్వామి - అనుభవమునకు రాకున్నను, నేనే బ్రహ్మమను భావముతో ధ్యానము చేయవలెను. ఏలననగా ధ్యానము వలన అసద్రూపములగు దృశ్య పదార్థములే లభించుచుండగా సత్యమైన, వాస్తవముగా తన స్వరూపమేయైన బ్రహ్మము నేల పొందలేడు? కావున మనసును దృశ్యమాన జగత్తునుండి (బయటి ప్రపంచమునుండి) మరల్చి అంతర్ముఖుడై సాధకుడు హృదయాంతర్గతమగు చైతన్యాత్మనే ధ్యానించవలెను. నిజానికి ధ్యానమనునది ఎల్లరకును ఎంతో కొంత అనుభవములోనో, అభ్యాసములోనో ఉన్నదే. కాకపోతే ఒక్కొక్కరు విషయవాంఛపై మనస్సుపెట్టి ధ్యానం చేస్తుంటారు. చేయవలసినదల్లా పరమాత్మవైపు ధ్యానం మార్చుకోవడమే.
- ఇంకా ఉంది