Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆపై కుశలవులు తమ గురువుగారైన వాల్మీకి గురించీ, ఆయన రామాయణ రచనకు పూనుకున్న విధానం గురించీ, పాడిన పాటని ఇలా ఆడుతూ, పాడుతూ, వినిపించాడు హనుమ.
రచన
(వాల్మీకి మహర్షిచే శ్రీమద్రామాయణ రచన)
మహితాత్ముడు మాగురుండు- మహాయోగి వాల్మీకి
కారణజన్ముండాతడు- రామాయణ రచన చేసె
దారులు గొట్టినవాడే- దారిచ మనకు నిలిచె
దోపిడి చేసినవాడే- హృదయాలను దోచె
‘రామ’యనగ లేకనతడు-
‘మరా’యంచు జపముచేసె
తలక్రిందుగ మారి జపము- తలనిండుగ నిండెను

చచ్చెనతని యజ్ఞానం- హెచ్చెనతని తేజమ్ములు
క్రొత్త జన్మ నెత్తెనతడు- క్రొత్తపేర బరగెను

ఆతడొక్క ఉదయమ్మున- తమసానది స్నానమాడి
వెనుదిరిగెను శిష్యులతో- తనదు ఆశ్రమమునకు

పాదమ్ములె పాదుకలుగ- కన్నులె జ్యోతులుగా
సృష్టికావ్యమును చదువుచు- వెడలెను నెమ్మదిగా

ఒక జ్యోతియె భూమికి దిగి- నడక నేర్చుకొనినట్టుల
ఒక తారయె మనుజులతో-
చెలిమి నెరప నెంచునటుల

నెలిగిపోయె నా మహర్షి- ఒక తేజ.పుంజమట్లు
కదలసాగె నా మహర్షి- వెలుగుల దాగులను

మనమందున తిరుగువాడు- వనమందున తిరిగెను
కళ్ళుమూసికొనెడువాడు- కళ్ళు తెరచి చూచెను
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087