Others

మితిలేనిది రాముని వాత్సల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామా అని పలికితే చాలు ఎన్నో జన్మల నుంచి సంచితంగా వచ్చే పాపమంతా ఒక్క లిప్తకాలంలో దహించి వేయ బడుతుంది. రామ అని పలుక రాని బోయ వాడు మరా అని పలుమార్లు అన్నా పదోసారి రామ అనే శక్తిని అందించింది. లోకంలో ఆదికవిగా నిలబెట్టి ఆచంద్రతా ర్కారము పేరు ఉండేట్టు చేసింది. రామ అన్న శబ్ద మహిమ అది. రామఅన్నా మరా అన్న అంతే శక్తిని కలిగిఉన్న నామం రామనామం. అందుకే పండితులు పామ రులను ఏ పూజ చేయకపోయనా ఫర్వా లేదు కేవలం రామనామాన్ని పలకండి. ఆ రాముడే మిమ్ములను ధర్మమూర్తులుగా తనంతటి వానిగా చేసేస్తాడు అని చెప్తుంటారు.
నిజమే రామ అన్న శబ్దం రాయడం వల్లనే రాముడు వారధి నిర్మించడానికి ఆంజనేయుడు విసిరిన రాళ్లు నీటిపై తేలి నిల్చున్నాయ. రామ శబ్దం విన్నందువల్లే గౌతముని వల్ల శాపం పొందిన అహల్య పూర్వ రూపాన్ని పొందింది.
రామ శబ్ద మహిమ వల్లే శబరి వైకుంఠానికి వెళ్లగలిగింది. రామ శబ్ద మహిమ తెలిసిన ఋషు లంతా రామనామాన్ని వదలక జపిస్తుంటారట. పర మేశ్వరుడే రామనామ ధ్యానం లో ఉంటూ తన పురిలో అంటే కాశీపురిలో మరణించ బోయే వారి చెవిలో రామ నామాన్ని వూది వారి నంతా వైకుంఠానికి తరలించడం లో తోడ్పడుతాడట. ఏ చదువులేదు.. జ్ఞానమంతఅబ్బలేదు.. అన్న వాడు సైతం రామ! నీ నామమేమి రుచిరా అనే పాడుకుంటూ ఉంటాడు.మరి ఇక ఈ సంకీర్తనా కారులు, వాగ్గేయ కారులు వూరుకొంటారా వారు ఎంతగా రాముని నామా న్ని ఎన్నో వందల వేల బాణీలు కట్టి పాడు కుంటారు. వారు పాడుకోవడమే కాదు వినే వారికందరికీ కూడా చక్కని ఆహ్లదాన్ని, మాన సోల్లాన్ని కల్గిస్తారు. ఆ రాముని పాటలు గేయాలు విన్నవారంతా పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమా అని పాడుకుంటారు. రాముడు తమను కాపాడుకోవడానికి ఆల స్యమైపోతుందేమో అనుకొని మము బ్రోవ మని చెప్పవే సీతమ్మ తల్లీ అంటూ మమ్ము కరుణించమని చెప్పు అమ్మా సీతమ్మా అంటూఅని రాముని భార్య సీతమ్మకు కూడా వారు మొరపెట్టుకుంటూ ఉంటారు. రాముని కొలి చిన వారికే కాదు వారి వంశఅంతా రాముని నీడలోనే తరించి పోతుం ది. వారి ముని మనవలు సైతం రాముని అభయాన్ని పొందు తూనే ఉంటారు. కనుక రామనామాన్ని వదలక ఆస్వాదించండి. రాముడే కర్తకర్మక్రియ అయ తన భక్తులను సర్వ వేళలా సర్వావస్థలలోను కాపాడుకుంటూ ఉంటాడు. రామునికి కుడి భుజంగా లక్ష్మణుడు దాసుడుగా దాసాంజ నేయుడు ఉంటారు. రాముని కనుసైగలతోనే రాముని భక్తులకు ఏ ఆపద రాకుండా వీరి ద్దరూ చూసుకుంటూ ఉంటారు. రాముని పరివారం లో మనమూ చేరితే చాలు రాముని అభయం మనకే కాదు మనం ఎన్ని జన్మలనెత్తినా అన్ని జన్మల్లోను, మన వంశాని కంతటికినీ రాముని వాత్సల్యం అందుతూనే ఉంటుంది.

- కూచిబొట్ల వెంకటలక్ష్మి