Others

పోరాడి.. నెగ్గింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాళ్లకింది భూమి కదిలిపోతుంది..
నెత్తిన పిడుగు పడింది.. ఇవన్నీ సాధారణంగా కష్టం గురించి వివరించి చెప్పే ఉపమానాలు. ఆమె జీవితంలో ఈ ఉపమానాలకంటే పెద్ద కష్టాలే వచ్చాయి. కానీ ఆమెలో స్థైర్యం సడలలేదు. అడుగడుగునా బెదిరింపులు, అడ్డంకులూ వచ్చాయి. బెదరలేదు. కన్నకూతుర్ని చంపేసి, తన మానాన్ని చిదిమేస్తున్నా చలించలేదు.. నిలబడింది.. పోరాడింది.. చివరికి ఆమే గెలిచింది. చిన్న చిన్న కష్టాలకే భయపడిపోయి, బెదిరిపోయే నేటి కాలంలో.. కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు ఎలా తట్టుకుని నిలబడాలో అందరికీ ఉదాహరణగా నిలిచింది. ఆమే.. గోద్రా అల్లర్ల కేసులో సర్వస్వం కోల్పోయినా న్యాయం కోసం పోరాడి నెగ్గిన ధైర్యవంతురాలు బిల్కిస్‌బానో.. వివరాల్లోకి వెళితే..
అది 2002.. బిల్కిస్‌ది గుజరాత్‌లోని గోద్రాకు దగ్గర్లో ఉన్న రంధిక్‌పుర్. ఆమెకు అప్పుడు 19 సంవత్సరాలు. అప్పటికే ఆమె పెళ్లయిపోయింది. మూడు సంవత్సరాల కూతురు. ఐదు నెలల గర్భిణి. కుటుంబంతో హాయిగా, ఆనందంగా గడిచిపోయే ఆమె జీవితంలో ఆ రోజు అత్యంత దురదృష్టకమైన రోజు. ఆ రోజు బిల్కిస్ వంట చేస్తుండగా పక్కింట్లో ఉన్న ఒక మహిళ పరిగెత్తుకుంటూ వచ్చి మన ఇళ్లు కాల్చేస్తున్నారు.. మనం వెళ్లిపోవాలి.. అని తొందర పెట్టింది. బిల్కిస్ కూడా ఏమీ ఆలోచించకుండా తన కూతురిని తీసుకుని కట్టుబట్టలతో బయటకు వచ్చేసింది. అలా దాదాపు పదిహేనుమంది బృందం గ్రామపెద్ద దగ్గరకు వెళ్లారు. అప్పటికే అల్లరి మూకలు వచ్చేసి గ్రామపెద్దతో సహా మగవారిని, పిల్లల్నీ మట్టుపెట్టేశారు. తరవుత మిగిలిన మహిళల్ని దారుణంగా సామూహిక అత్యాచారం చేసి.. చంపేశారు. అలా ఆ ఘటనలో బిల్కిస్ కూతురితో సహా పధ్నాలుగు మంది చనిపోయారు. బిల్కిస్ బానో తాను ఐదునెలల గర్భిణిని అని చెబుతున్నా వినకుండా సాహూహిక అత్యాచారానికి తెగబడ్డారు ఆ నరహంతకులు. ఈ క్రమంలో ఆమె సృహ కోల్పోయింది. ఆమె చనిపోయిందనుకుని ఆమెను వదిలేసి ఆ నరహంతకులు వెళ్లిపోయారు. ఆ అరాచకానికి బలైన మూడు గంటల తర్వాత ఆమెకు మెలకువ వచ్చింది. చుట్టూ శవాలు. పక్కనే కూతురు శవం. ఒంటిపై నూలుపోగులేదు. అది చూసిన ఆమెకు ఏడ్చే ఓపిక కూడా లేకుండా పోయింది. ఎదురుగా ఉన్న ఏదో పిచ్చి గుడ్డను కప్పుకుని కొండల్లోకి పారిపోయింది. ఒక రోజంతా అక్కడే గడిపిన ఆమెను ఓ గిరిజన కుటుంబం చేరదీసింది. కొద్దిగా కోలుకున్న తరువాత బిల్కిస్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. బిల్కిస్ చదువుకోలేదు. అదే అదనుగా పోలీసులు కొంతమంది నిందితుల్ని ఎఫ్‌ఐఆర్ నుంచి తప్పించారు. తరువాత ఆమె ప్రభుత్వ శిబిరానికి వెళ్లి భర్తను కలుసుకుంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో స్థానిక కోర్టు ఆధారాలు ఏమీ లేవని కేసుని కొట్టేసింది. అప్పుడు కానీ ఆమెకు అసలు విషయం అర్థం కాలేదు. విషయం తెలిసిన వెంటనే ఆమె ఎలాగైనా సరే నిందితులకు శిక్ష వేయించాలని నిర్ణయించుకుంది. సామాజిక కార్యకర్తలు, ఓ ఎన్జీవో సాయంతో జాతీయ మానవహక్కుల కమీషన్‌తోపాటు సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేసింది. చివరికి సీబీఐ దర్యాప్తు మొదలైంది. నిందితులను అరెస్టు చేశారు. సీబీ ఐ విచారణ మొదలవగానే ఆమెపై ఒత్తిళ్లు పెరిగాయి. ఇంటిపై దాడులు జరిగాయి. బెదిరింపులు కూడా చాలానే వచ్చాయి. దాంతో ఆమె రెండు సంవత్సరాల్లో చాలాచోట్లకు మారింది. చివరికి ఆమె తమకు భద్రత లేదని, సాక్ష్యులను బెదిరిస్తున్నారని ఈ కేసుని గుజరాత్ బయట ఎక్కడైనా విచారించమని సుప్రీంకోర్టుని అభ్యర్థించింది. అలా ఈమె కేసు 2004లో ముంబయికి మారింది. తరువాత ట్రయిల్ కోర్టు ఇరవైమంది నిందితుల్లో పదకొండుమందికి యావజ్జీవ ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. సీబీ ఐ ఈ తీర్పుని ముంబయి హైకోర్టులో సవాల్ చేసింది. ముఖ్యంగా నరహంతకులైన గోవింద్ నాయి, జశ్వంత్ నాయి, శైలేష్‌భట్‌లకు మరణశిక్ష విధించాలని బిల్కిస్ అభ్యర్థించింది. అయితే ముంబయి హైకోర్టు ఈ కేసును కొట్టేసింది. అప్పటి ప్రభుత్వం ఆమెకు రూ. ఐదు లక్షల పరిహారం ఇవ్వజూపినా ఆమె దాన్ని తిరస్కరించింది. తనకు ఆమోద యోగ్యమైన పరిహారం చెల్లించాలని ఆమె అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దానిపై ఈ నెల 23న విచారణ జరిపిన న్యాయస్థానం ‘ప్రభుత్వం ఇప్పటికే ఇవ్వజూపిన పరిహారం ‘తాత్కాలికమైనది’ అని పేర్కొంటూ 2002 అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానోకు రూ. 50 లక్షల పరిహారం, ఉద్యోగం, వసతి కల్పించాలి’ అని సుప్రీంకోర్టు మంగళవారం గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇలా ఎన్నో కేసులు.. ఎన్నో పోరాటాలు.. మరెన్నో సమస్యల అనంతరం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. చివరికి బిల్కిస్‌బానో నెగ్గింది. *