Others

చివరి తలంపు తోనే జన్మరాహిత్యము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుని సృష్టి విచిత్రమైనది. అది వాక్కుకు, మనసుకు, కాలానికి, బుద్ధికి అందదు. అందుకే దానిని ‘అనాది’, ‘అనిర్వచనీయం’ అను పేర్లతో పిలుస్తారు. అహంకార చతుష్ఠయములో మొదటిది మనసు (మనో, బుద్ధి, చిత్త, అహంకారం). ఈ మనసు పుట్టినది మొదలు మనము చచ్చేదాకా అగ్నిలో నుండి ‘మిణుగురులు’లాగా ‘ఆలోచనలు’ సృష్టిస్తుంది. అవి సముద్రములో అలల రీతి ఎగిసిపడుతూ వస్తుంటాయి. ఒక రహస్యమేమి అనగా ఒకే సమయంలో రెండు ఆలోచనలు రావు. ఒక ఆలోచన పైకి లేస్తుంది. ఆ ఆలోచన పైకి లేచి క్రిందకి రాగానే ఇంకొక ఆలోచన వరుసలో అతివేగంగా వస్తుంది.
ఈ ఆలోచనలనే ‘తలంపులు’ అంటాము. శరీరము పటుత్వం తగ్గినా ఇవి వూరుకోనివ్వవు. ఇంద్రియములకంటే మనసు బలవంతమైనది. ఈ మనసు ఆలోచనలను తయారుచేస్తూనే వుంటుంది. సామాన్య మానవునిలో ఈ ఆలోచనల వేగం ఒక నిముషానికి 20 సైకిల్స్ తిరుగుతాయి. యోగసాధన చేసే యోగులకు ఒకటి రెండు సైకిల్స్ తిరగవచ్చు. ఒక ఆలోచనకు మరియొక ఆలోచన మధ్య దూరము ఎక్కువ ఏర్పడ చేస్తే అది శూన్యస్థితి. ఈ స్థితిని సాక్షిగా చూస్తే అదే చైతన్య స్రవంతి.
మన ఆలోచనలు మన శ్వాసతో ముడిపడివుంటుంది. ఈ ఆలోచనలు సాత్వికము, రాజసము, తామస ప్రవృత్తిని కలిగివుంటాయి. ఇవే మానసిక, వాక్కు, కర్మలుగా రూపాంతరం చెందుతాయి. ఆలోచన (కోరిక) ఒక వస్తువును పొందాలని మనసు మాత్రమే భావిస్తే అది వాక్కు. కర్మగా పరిణతి చెందక సూక్ష్మరూపంలో చిత్తము భద్రపరుస్తుంది. ఈ ఆలోచన తీవ్రతరమైతే వాక్కుగా మారి, కర్మకు దారితీస్తుంది. తీరని ఈ ఆలోచనలు (కోర్కెలు) సంస్కారాలుగా మారి సూక్ష్మ శరీరంలో చేరి మరణానంతరము మనతో వస్తాయి. ఆలోచనారహితమైన స్థితే ‘అమనస్కరాజయోగము’. అప్పుడు కూడా అనగా ఆనందధామము చేరాలని, దుఃఖ రహిత స్థితి పునరావృత్తి రహితమైన కైవల్యము చేరాలనే ఒకే ఆలోచన చివరిదాకావుండి బుద్ధిలో లయమై, ఆత్మలో లీనవౌతుంది.
కాబట్టి విజ్ఞులైనవారు కోరికలను తగ్గించి, వాటిని ధర్మబద్ధంగా వుండే విధంగా చేయాలి. మనసును బాహ్య విషయములనుండి మరల్చి, అంతర్ముఖము చేసి సాధన చేస్తే ఆ ఆలోచనల వేగం తగ్గుతుంది. ఒక నిముషమునకు 15 శ్వాసల ప్రకారం, 24 గంటలకు 21,600 శ్వాసలు ఆడుతాయి.
చిత్తము పుట్టినది మొదలు మరణ సమయమువరకు ఫొటోలు తీస్తుంది. గుప్తంగా వున్న చిత్రాలు తీసే చిత్తమే చిత్రగుప్తుడు బలీయమైన కోరిక (ఆలోచన)గల చిత్రాన్ని మరణ సమయంలో ఆవిష్కరింపబడుతుంది. చివరి తలంపే భవిష్యజన్మగా మారుతుంది. భాగవతంలో జడ భరతుడు ఎదురుగా వున్న జింకను తదేకంగా చూసి ఆ ఆలోచనతో శరీరము వదలి జింక జన్మ ధరిస్తాడు. భాగవతంలో అజామిళోపాఖ్యానంలో అజామిళుడు క్రూరకర్మలు చేసినా భగవంతుడు మోక్షాన్నిచ్చాడు. కారణం చివరి శ్వాస, చివరి తలంపు నారాయణ నామస్మరణే.
ఎవడు మరణకాలమందు కూడా ననే్న స్మరించుచు శరీరమును విడుచుచున్నాడో అతడు నా స్వరూపమునే పొందును. ఇందు సంశయం లేదు. దైవానుగ్రహం మెండుగా వుండి, పూర్వజన్మ సంస్కార బలము వలన ఏ మహానుభావునికో తప్ప తక్కినవారికి మరణ సమయమున దైవభావము కలుగదు. చివరి నిముషము భగవంతుని ధ్యానిస్తే చాలు అనుకొంటే అది చాలా తప్పు. భగవంతుడు అసలు ఆ సమయంలో స్ఫురణకు రాడు. మరణ సమయంలో కఫ, వాత, పిత్తములచేత కంఠములో వాయువు చేరుటవలన భగవంతుని స్ఫురణ కలుగుతుందా? అంటే కుదరదు.
ఇది చివరి చలంపు, చివరి శ్వాస (చివరి ఊపిరితో) ముడిపడి వుంటుంది. జీవితాంతము ఏ కోరికలతో (ఏ ఆలోచనలతో) సతమతమవుతుంటాడో అవే గుర్తుకు వచ్చి, ఆ సంస్కారాలతో భవిష్యజ్జన్మలు ఎత్తుతాడు. అవి తమోగుణ, రజోగుణముతో వుంటే జంతు జన్మలు సంప్రాప్తమవుతాయి.
సత్త్వగుణంతో శరీర నిష్క్రమణ చేస్తే దేవతా, గంధర్వ మానవ జన్మలెత్తుతాడు. సత్వ గుణంతో శాస్తమ్రు నిర్దేశించినవి హితకర్మలు నిష్కామ కర్మతో చేస్తేమోక్షము వెంటనే రాకున్నా ఉత్తమజన్మలు సంప్రాప్తమై, మోక్షమార్గమువైపు అడుగులు పడతాయి. సత్కర్మ ఏకారణము చేతనైనను మధ్యలో నిలిచిపోయినను దోషము లేదు. ఈ ప్రయత్నము ఒకింతైనను సంసార భయం నుండి రక్షిస్తుంది. జన్మరాహిత్యానికి మార్గము సుగమవౌతుంది.

- కె. రఘునాథ్