Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెప్ప వేయడాయె వౌని తన చర్యల నెల్లమాని
పక్షులలో పక్షివోలె- సంచరించెనతని యాత్మ

‘సరసర’మని బిరబిరమన శరమొక్కటి వచ్చెను
బాణము తగిలినదొ లేదొ ప్రాణము
విడె మగ క్రౌంచము

ఆడుపక్షి ఆర్తితోడ అరచిన అరపులు వినబడె
పక్షి భాష దేవుడెరుకు రక్షించగనెవడు?

చచ్చిపడిన పక్షిపైన- చచ్చినటుల పడినది
శవముపైన బడి యేడ్చుచు- శవమైపోయినది.

చచ్చెనపుడు పక్షి కాని- చచ్చెనోయి వౌని
‘గిలగిల’లాడెను హృదయం- ‘కుతకుత’మనె కోపం

చూపులె బాణమ్ములౌచు- బోయను బాధించెను
పక్షివోలె ‘గిజగిజ’మని అతడు వణకిపోయెను

పొంగి వచ్చె గంగవోలె శోక ప్రవాహమ్ము
కనులు కరిగి తరగలతో ఉబికెను సంద్రమ్ము

‘‘పక్షి జంట నెడబాపిన పాపాత్ముడ వోరుూ!
పక్షుల వలె జంట బాసి అలమటింతు వోరుూ!’’

అని పలికెను ఆ మహర్షి అగ్నివోలె మండెను
రుద్రుండే భువికి దిగిన యటులనూగి పోయెను

ఒక బోయను బోయవాడు చిత్రము శపియించుట
ఎరుకువాని ఎరుకువాడె మాటలతో నరకుట

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087