AADIVAVRAM - Others

భంగపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వానలు కురిసినపుడు
నెత్తి మీద మెత్తగా స్పర్శించాడు
శీతాకాలం
చలి బనీను మీద వెచ్చగా వెలిగాడు
వేసవి రాగానే మాత్రం
గుబురుగడ్డం రౌడీలా జనం మీద పడ్డాడు!

నిన్నటి దాక..
కొంకర్లు పోయిన దేహానికి వైద్యం చేసాడు
వానలో నానిపోయిన
గొడ్లు గాసే పోరడికి
తుండుతో తల తుడిచే
తల్లిలా కనపడ్డాడు
చలికి రగ్గులో దూరిన దేహాలకు
ప్రేయసి బుగ్గపై ప్రియుడి
ముద్దులా అనిపించాడు
ఇవాళే ఎండరౌడీ
కత్తులు దూస్తున్నాడు..!

ఎండరౌడీ దాడికి రాగానే...
పిల్లలు ఆటవస్తువులు
వదిలేసి పరిగెత్తారు..
ఆడవాళ్లు చీర ముసుగులో
దాక్కున్నారు
మీసమున్న మగాళ్లు తలపడ్డారు కానీ
కాసేపటికే చెమటలు గక్కి పిక్కబలం చూపారు!
మిట్టమధ్యాహ్నానికి చూడాలి
ఇళ్లన్నీ తలుపులేసుకుని లోపల నక్కాయి..!
వడదెబ్బ తగిలిన ముసలాళ్లకి
ఎండ రౌడీని తిట్టడానికైనా
నోరు పెగళ్లేదు..!
అలాంటి ఎండరౌడీ
చివరకు ఓడిపోయాడు ఒకచోట...
పార్కు బల్ల మీద కూర్చున్న
ప్రేమికుల జంట కౌగిలి
మధ్యన మాత్రం
ఎండరౌడీ నలిగిపోయాడు...!
ఎంతటోడికైనా..
ఎంత మిడిసిపడినోడికైనా..
ఎక్కడో ఓ చోట భంగపాటు తప్పదు కదా..!

-మెట్టా నాగేశ్వరరావు