Others

డైరెక్టర్స్ ఛాయిస్.. నా మూడేళ్ల కల అది...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు రాజసింహ తాడినాడ
రచయితలు దర్శకులుగా మారుతున్న ఒరవడిలోనే -తనకున్న అక్షరానుభవాన్ని దృశ్యంగా స్క్రీన్‌మీదకు తెచ్చే ప్రయత్నం చేశాడు రాజసింహ తాడినాడ. తొలి ప్రయత్నంలోనే ‘ప్రయోగాత్మక’ కథను ప్రయోగించి -దర్శకుడిగా తన స్టామినాను ప్రూవ్ చేసుకున్నాడు. సందీప్ కిషన్, నిత్యమీనన్ జంటగా తెరకెక్కించిన ‘ఒక్క అమ్మాయి తప్ప’ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, వైవిధ్యమైన సినిమాను తెరకెక్కించగల స్టామినావున్న దర్శకుడిగా రాజసింహతో ఈవారం చిట్‌చాట్.
మీ గురించి?
-బర్త్ ప్లేస్ విజయవాడ. కానీ -ఊహ తెలిసిన దగ్గర్నుంచీ తిరుపతితోనే ఎక్కువ పరిచయం. ఎందుకంటే -పెరిగింది, చదువుకున్నది అంతా అక్కడే.
సినిమా చాన్స్‌లు?
8వ తరగతిలోనే మాట్లాడే బొమ్మతో (వెంట్రిలాక్విజం) షోస్ చేసేవాడిని. 1996లో సృజనాత్మక దర్శకుడు కె విశ్వనాథ్ నా షో చూశారు. అలా, నా కళకు ఓ పాత్ర సృష్టించి వెంకటేష్ హీరోగా ఆయన తీసిన చిన్నబ్బాయి సినిమాలో అవకాశమిచ్చారు. అలా -వెంకటేష్‌తో పరిచయం పెరిగింది. తరువాత ప్రేమించుకుందాం రా చిత్రంలో రచయతగా అవకాశం వచ్చింది. అక్కడి నుంచి దర్శకుడు జయంత్ దగ్గర బావగారూ బాగున్నారా? నుంచి టక్కరిదొంగ వరకూ పని చేశాను.
చేసిన సినిమాలు?
మనసంతా నవ్వే సినిమాలో విఎన్ ఆదిత్యతో కలిసి పని చేశా. 1999లో పరిచూరి బ్రదర్స్ దగ్గర జాయనయ్యా. ఆరేళ్లలో 40 సినిమాలకు పనిచేశా. శంకర్‌దాదా ఎంబిబిఎస్‌లో చిరంజీవి ఇంగ్లీష్ సామెతలకు ట్రాన్స్‌లేషన్ రాసింది నేనే. ఈమధ్యే రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రకి డైలాగ్స్ రాశా. అవి బాగా పేలాయి.
ఒక అమ్మాయి మిస్ ఫైర్ అయ్యిందేమో?
2013లో మొదలు కావాల్సిన సినిమా. మొదలై ఆగిపోవడం -అలవాటైపోయేంత స్థితికి వచ్చింది. అలా 13సార్లు జరిగింది. అయితే, కథమీద నమ్మకంతో వదల్లేదు. ఒకసారి హైదరాబాద్‌లో మూసాపేటవైపు వెళ్తుంటే, ట్రాఫిక్ జామై అందులో ఇరుక్కున్నా. అక్కడ పుట్టిన ఆలోచనకు -ఏడాది కష్టం జత చేశా. అదే కథ.
తదుపరి చిత్రాలు
సిద్ధంగానే ఉన్నాయి. కొన్నింటిపై చర్చలు సాగుతున్నాయి. చూడాలి, ఏది వర్కవుటవుతుందో.

-శీ