Others

హార్మోన్ల అసమతుల్యతా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి జీవనశైలిలో హార్మోన్ల అసమతుల్యత పెను సమస్యగా మారింది. ముఖ్యంగా మహిళల్లో ఇది ఎక్కువగా ఉంది. దీన్ని అధిగమించాలంటే ఎవరికి వారు, శరీర సమస్యను అనుసరించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూద్దామా..
* శరీర బరువును తగ్గించుకునేందుకు చాలామంది కొవ్వు లభించే ఆహార పదార్థాలను మానేస్తూ ఉంటారు. దీనివల్ల శరీరం త్వరగా అలసిపోవడం, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతూ ఉంటుంది. అందుకని శరీరానికి మేలుచేసే కొవ్వు పదార్థాలను అందించడం మేలు.. ఇందుకోసం ఆలివ్ నూనె, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, చేపలు, కొబ్బరినూనె వంటివి వాడాలి.
* కెఫీన్ పదార్థాలను పూర్తిగా మానేయాలి. వీటికి బదులుగా హెర్బల్ టీలను వాడాలి. ఫలితంగా హార్మోన్లలో సమతుల్యత నెలకొంటుంది. పైగా వార్ధక్యపు చాయలు కూడా దరిచేరవు.
* ప్లాస్టిక్, క్రిమిసంహారకాలు, ఇంటిని శుభ్రపరిచే క్లీనర్లలో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప వీటిని వాడకపోవడమే మంచిది. ముఖ్యంగా వేడివేడి పదార్థాలను ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ ఉంచడం మానేయాలి.
* మనం నిద్రపోతున్నప్పుడు మనలో ఉన్న టాక్సీన్లను చురుగ్గా విసర్జిస్తుంది శరీరం. ఫలితంగా హార్మోన్లలో సమతుల్యత ఏర్పడుతుంది. కాబట్టి ఒకరోజు సరిగ్గా నిద్రపోకపోయినా హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. క్రమంగా మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకూ కంటినిండా నిద్రపోవడానికి ప్రయత్నించాలి.
* వ్యాయామం దినచర్యలో భాగం కావాలి. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యం ఉన్నవారు వ్యాయామాన్ని కచ్చితంగా చేయాల్సిందే.. ఈత, నడక, పరుగు, కార్డియో ఎక్సర్‌సైజ్.. ఇలా అన్నీ చేయాల్సి ఉంటుంది.
* ఆకుకూరలు, పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి. ఎప్పుడూ తాజా ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి.