Others

విప్లవ నాయకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రెసిడెంట్ ఒమర్ ఆల్ బషీర్ మూడు దశాబ్దాల పాలనలో కన్నా గతవారంలోనే సూడాన్‌లో పెనుమార్పులు చోటుచేసుకోవడం గమనార్హం. గత కొన్ని నెలలుగా ఇక్కడ నిరంతరాయంగా ప్రజా నిరసనలు చోటుచేసుకుంటున్న ఫలితంగా ఈ నెల ప్రారంభంలో తిరుగుబాటు జరిగి ఒమల్ ఆల్ బషీర్ పదవీచ్యుతడయ్యాడు. ఇతన్ని గద్దె దించేందుకు జరిగిన విప్లవంలో మహిళలు కీలకపాత్ర పోషించారు. ఇందులో 22 సంవత్సరాల విద్యార్థిని అలా సలాహ్ ముఖ్య భూమిక పోషించింది. మెరుగైన సూడాన్ కోసం కలలు కన్న ఆమె.. అధ్యక్షుడికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో చురుగ్గా పాల్గొంది. నిరసనల్లో పాల్గొన్నప్పటికీ ఆమె వీడియో ఒకటి వైరల్ కావడంతో ప్రపంచమంతా ఆమె నాయకత్వాన్ని చూసింది. ఆమె నాయకత్వ లక్షణాల్ని ప్రజలంతా వేనోళ్ల పొగుడుతున్నారు. తోటి విద్యార్థినీ విద్యార్థులు మాత్రం ఆమెను ఓ హీరోయిన్‌లా చూస్తూ.. ఆమెను అంతా విప్లవనాయకిగా కీర్తిస్తున్నారు. దీని గురించి అలా సలాహ్ మాట్లాడుతూ ‘నన్ను అంతా విప్లవనాయకిగా పిలుస్తారని నేను అస్సలు ఊహించలేదు. నిజానికి సూడాన్ ప్రజలంతా ఈ విప్లవానికి ప్రతీకలే.. నేను విప్లవంలో పాలుపంచుకున్నాను. కానీ ఇంత వెల్లువ వస్తుందనుకోలేదు. నా వీడియో కూడా ఇంతలా వైరల్ అవుతుందనీ అనుకోలేదు. ప్రతి ఒక్కరూ గౌరవంగా బతికే సూడాన్ కోసం కలలు కన్నాను. అందుకే ప్రాణాలకు తెగించి నిరసనల్లో భాగమయ్యాను. ఉద్యమానికి, నిరసనలకు నేను ఏమాత్రం భయపడలేదు కానీ జాగ్రత్తగా ఉండటంలో తప్పులేదు కదా.. అందుకే ఏమైనా జరగొచ్చని ముందునుంచీ జాగ్రత్తగా ఉన్నాం. కాల్పుల్లో ప్రాణాలైనా పోవచ్చు. కాలో, చెయ్యో, కన్నో పోవచ్చనుకున్నా.. కానీ బెదరలేదు. వెనకడుగు వేయలేదు. అనుకున్నట్లుగానే ఒమర్ అల్ బషీర్‌ను గద్దె దించాం’ అని చెబుతోంది.
నిరసనల్లో మహిళలు పోషించిన పాత్రపై బలిస్ బద్రి అనే ఉద్యమకారిణి సంతోషం వ్యక్తం చేసింది. వారి గురించి మాట్లాడుతూ ‘వారి ధైర్యం చూసి ఆశ్చర్యపోయాను. ఈ విప్లవం ఎంతో మేలు చేసింది. ముఖ్యంగా అలా సలాహ్ చూపిన తెగువ అసామాన్యం. ఆమె తోటి మహిళలు, యువతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది’ అని సంతోషాన్ని వ్యక్తం చేసింది. *