Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాయము తొలగిన వేళల ఏలను తన కోపం?
ముక్తి ప్రసాదించు వాని పైన నేల శాపం?

రాముండే యముండౌచు రావణున్ని చంపెనో?
మడిసిన తన పతిని జూచి మండోదరి ఏడ్చెనో?

తన కనులకు రామాయణ కథయే కన్పడెనో?
తన రాముని తన నోటనె తానే శపియించెనో?

ఐన బోయ తప్పేమిటి? బోయ వృత్తి బోయది
బోయవాని ధర్మమ్మది- తప్పన్నను తప్పు తనదె.

వాడు పక్షినొప్పించెను- వాని తాను నొప్పించెను
ముని వృత్తిని మాని తాను మూర్ఖుండై పోయెను

అనచు వౌని తనలోననె
తాను కుందసాగెను

అతని వేదనను గనుగొని ఆతని శిష్యులు జేరిరి
విషయమెల్ల వివరించగ వింతలందు దేలిరి

అతని మాటకర్థమ్ములు అనేకమ్ములై తోచెను
ఒక అర్థం రామాయణ గాథచ వరలెను

ఇదియె సరస్వతి తలంపు- ఇది బ్రహ్మ ప్రణాళిక
రమ్యవ్మౌ రామాయణ కథ రచింపవలె మీరిక

అనుచు వారు ఆ వౌనిని
అంత వేడుకొనిరి

అటుల వెడలు శ్లోకమ్మే రచనకు నాందిగనాయెను
అతడు వ్రాసె ‘సీత కథ’ను- అది కావ్యమాయెను

ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087