Others

రామతీర్థ దర్శనం.. జన్మసాఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రేతాయుగంలో సీతారాములు అన్యోన్య అనురాగాలున్న దంపతులుగా కీర్తించబడ్డారు. శివుని విల్లు విరిచి దశరథుని అనుమతితో శ్రీరాముడు జనక మహారాజు ముద్దుల కుమార్తెగా పెరిగిన అయోనిజ సీతమ్మను పెండ్లాడాడు. కాని కాలవశాన రాముడు వనవాసాలకు వెళ్లవలసి వచ్చింది. రాముని వెంట సీతమ్మ వనాలకు బయలుదేరింది. సీతారాముల వెంట లక్ష్మణుడూ బయలుదేరాడు. ఆట్లా ముగ్గురూ వనవాసం చేయడానికి వెళ్లారు.
అక్కడ అనుకోని విధంగా రావణాసురుడనే రాక్షసుడు సీతమ్మ వారిని అపహరించాడు. ఆతల్లిని వెతుకుతూ రామలక్ష్మణుడు అడవి అంతా గాలించారు. అపుడే వారికి వానరులతో అందులో సుగ్రీవునితో, ఆంజనేయునితో మంచి స్నేహం కుదరింది. వానరులతో కలసి సీతమ్మను అనే్వషణ కావించారు.
సముద్ర లంఘనం చేసి ఆంజనేయుడు రావణుడు పాలించిన లంకాపట్టణంలో సీతమ్మ వారు ఉన్నారని రాముడికి చెప్పాడు. సముద్రం పైన వారధి నిర్మించి రావణుని దగ్గరకు చేరి వానరులతో కలసి రామలక్ష్మణులు రావణునితో పోరు సల్పారు. అధర్మం రూపు కట్టినవాడు రావణుడు కనుక యుద్ధంలో ఓడిపోయాడు. చివరకు ధర్మమూర్తి అయిన రాముని చేతిలో రావణాసురుడు సంహరించబడ్డాడు. రావణుని పీడ వదిలిందని ఎందరో సజ్జనులు సంతోషించారు. దుర్మార్గుల పోరు తగ్గిందని భూదేవి ఆనందించింది.
ఆతరువాత సీతమ్మను తీసుకొని రామలక్ష్మణులు వనవాసం పూర్తి అయినందువల్ల అయోధ్యకు బయలుదేరారు. ఆ సమయంలో సాయంకాలం పూర్తి అయిందని సంధ్యోపాసన చేయాలని అనుకొని రామలక్ష్మణులు సముద్రం దగ్గర ఆగారు. అక్కడ సంధ్య పూర్తి చేసుకొని శివార్చన చేయాలని తలచారు. అక్కడే ఉన్న సైకతంతో శివలింగాన్ని తయారు చేసుకొని లింగార్చన చేశాడు. ఇట్లా రాముని చేతిలో సైకత లింగం ప్రతిష్ఠ జరిగింది కనుక ఈ శివునికి రామలింగేశ్వరుడన్న బిరుదు వచ్చింది. ఈ ప్రదేశానికి రామతీర్థ అన్న పేరు ప్రఖ్యాతి వహించింది. ఈ ప్రాతం నెల్లూరు జిల్లాలోని విడవలూరు మండలంలో ఉంది. నెల్లూరు జిల్లాకు 36 కి.మీ. దూరంలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఈ గ్రామానికి రామతీర్థం అనే పేరు వాడుకలో ఆనాటి నుంచి వస్తున్నది. యుగాలు మారి ఎందరో రాజులు మారి నేడు కలియుగం వచ్చిన తరువాత ఆ రామతీర్థలోని రామలింగేశ్వరుని గుడి మాత్రం జీర్ణావస్థలోకి వెళ్లింది. పల్లవ రాజులు ఈ గుడిని పునర్నిర్మాణం చేశారు. నేడు మన ప్రభుత్వాలు, భక్తులు కలసి ఈ గుడిని తిరిగి బాగు చేయించి స్వామి వారికి ధూప దీప నైవేద్యాలకు ఏర్పాటుచేశారు.
ఈ ఆలయంలోని పార్వతీదేవి కామాక్షి అమ్మవారుగా కీర్తనలందుకుంటున్నారు. అమావాస్య రోజున సముద్ర స్నానం చేసి ఈ ఆలయంలోని కామాక్షి రామలింగేశ్వరులను దర్శించుకొని పూజలు సల్పితే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు చెబుతున్నారు. కార్తీక మాసంలో, శివరాత్రి లోను వైభవోపేతంగా ఉత్సవాలు ఇక్కడ జరుపుతారు. ఇవే కాక దేవీ నవరాత్రులల్లోను అమ్మవారికి విశేష పూజలు చేస్తారు.

- బ్రహ్మశ్రీ కురువాడ మురళీధర్ శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరీ శంకరమఠం