Others

మనసులోని భావమే మాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడు మానవునకిచ్చిన అద్భుత వరం.. ‘వాక్కు’! మనిషి మనసులోని భావమే వాక్కుగా పరిణమించి నోటి వెంట వెలువడుతుంది. కాలు జారితే ఫర్వాలేదు కానీ నోరు జారితే వెనక్కు తీసుకోలేము అంటారు. అంటే నోటి మాట చాలా గొప్పది. మాట వల్లనే కొందరు మిత్రులు ఏర్పడితే మరికొందరు ఆ మాట అందుకే వాక్కును లక్ష్మీ నివాసం అంటూంటారు. మాట్లాడేటపుడు ఒకటి రెండు సార్లు బాగా ఆలోచించి మాట్లాడాలి. మాట వల్ల ఎదుటివారు నొచ్చుకోకుండా తాను నొవ్వకుండా మాట్లాడగలగాలి.
మానవుల మనస్సుల్లోని మలినాలను పోగొట్టి, మంచి దారిలో నడిపించడానికి దోహదపడేదే నిజమైన వాక్కు. ఎవరు మాట్లాడితే వాతావరణం ప్రశాంతంగా మారుతుందో ఎవరు మాట్లాడితే ఎదుటివారు ప్రసన్నులు అవుతారో , శత్రువులు కూడా మిత్రులుగా మారుతారో అటువంటివారిని మంచి వాక్కు కలవారుగా ఉత్తములు కీర్తిస్తారు. ఏది మాటాడితే తమకు, తమతో పాటు సమాజానికి మేలు చేకూరుతుందో అని ఆలోచించి ఆచి తూచి మాట్లాడేవారు సమాజ హితైషులు అంటారు.
ఎపుడు మాట్లాడినావాస్తవం మాట్లాడాలి. అబద్ధం ఆడకూడదు. అట్లాఅని ఎదుటివారిని నొప్పించకూడదు. ఎవరికి భయం, దుఃఖం కలిగించకుండా ఉండాలి, చెప్పేది వినసొంపుగా వుండి, సుఖశాంతులు అందించేదిగా కూడా ఉండాలి. అటువంటి మాటలు మాట్లాడితే వారిని వాచిక తపస్సు చేస్తున్నవారు అంటారు. మనసుకు మాటకు మధ్య ఐక్యత వుండాలి. కొందరిని నోరు మాట్లాడుతూ ఉంటే నొసలు వెక్కిరిస్తుంటారు అంటారు కదా. అంటే మనసులో ఎదుటివారిని వెక్కిరిస్తూ లేక ఎగతాళి చేస్తూ వారి ముందు మాత్రం వినయం నటిస్తూ ఉంటే అది మంచిపని కాదన్నమాట.
సత్వగుణాన్ని అలవర్చుకుంటే మనసు ఎపుడూ ప్రశాంతంగా ఉంటుంది. వారుఏది చెబుతారో దాన్ని ఆచరించడానికి ప్రయత్ని స్తారు. చేసిన దానే్న చెబుతారు. వారి మాటల్లో ఆడంబరాలు, గొప్పతనాలు ఉండవు. వారిని చూసి వారి మాటలు విని ఎదుటివారు వారిని అనుకరిస్తే బాగుండు అనుకొంటారు. మంచి నడవడిక కలిగి నలుగురికీ ఆదర్శవంతంగా జీవితాన్ని జీవిస్తుంటారు.
మరికొందరు తీయగా మాట్లాడుతారు. ఎదుటివారికి చాలా సులభంగా ఆకాశంలో నడవచ్చు అనే ఆశలను కలిగిస్తారు. కాకపోతే నిజానికి వారిని నేలమీద నడవడానికి కూడా వీలు లేనిస్థితికూడా ఉండకపోవచ్చు. చెప్పేదొకటి, చేసేది మరొకటిగా వుంటుంది. వారు దురాలోచనపరులు, వంచకులు అవుతారు.
ఉన్మాదం, దురహంకారంగలవారు రాక్షస ప్రవృత్తి కలిగి వుంటారు. కొందరు కటువుగా మాట్లాడినా మనసు మెత్తనిదై ఉపకార పరాయణులుగా వుంటారు. మాటను బట్టి మనసును కొంతవరకు తెలుసుకోవచ్చు కాని అన్నివేళలా అది సాధ్యంకాదు.సాధారణంగా మాత్రం వారి గుణాలను బట్టే వారి మాట చేత ఉంటుంది. వారి గుణాలను బట్టే వారు మంచివారుగానో చెడు వారిగానో తెలుసుకోవచ్చు. కొందరు సమయానుకూలంగా మాట్లాడి పబ్బం గడుపుకునే స్వభావం కలిగి వుంటారు. ఎప్పటికామాటలాడి తప్పించుకు తిరిగే ధన్యులు... అని శతక కారులు చెప్పినప్పటికీ ఇది అంతమ ంచి పని కాదు.వీరివల్ల ఎవరికీఅంత ప్రయోజనముండదు! కేవలం మాట సాయం వల్లనే ఇతరులు బాగుపడుతారు అంటే దానిని కాదనకుండా చేయొచ్చు. ఎపుడూ ఎవరికీ అపకారం కలిగించే మాటలు మాట్లాడ కూడదు.
అంతేకాదు ఎదుటివారు మనం చెప్పేమాటలను ఎంతవరకు వింటున్నారు. ఆ మాటలు వారికి వినసొంపును లేక మంచి ని కలిగిస్తున్నాయని వారు నమ్ముతున్నారా లేదా అని కూడా చూడాల్సి ఉంటుంది. లేకపోతే రావణుని తమ్ముడు విభీషణునిగా ఛెడు వాని దగ్గరకు వెళ్లి మంచిమాటలు చెప్తే వారికి చెవికెక్కవు. పైగా చెప్పిన వానికిఆపదలు కూడా కల్గిస్తారు. కనుక వినేవాడు సజ్జనుడు గాదా అని కూడా చూసుకోవాలి. చెడ్డదారిలో పయనించేవారికి కూడామంచి చెప్పాలి కాని పరిస్థితులను అంచనా వేసుకొంటూ బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే కోరి ఆపదలు తెచ్చుకున్నట్టు అవుతుంది.

- చివకుల రామమోహన్