Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదమంత్రమన్నట్టుల- వేదసార మన్నట్టుల
ఏర్పడె ‘సీతాయనమ్ము’- విశ్వతత్త్వ మన్నట్టుల

‘సీతాయన’కావ్యమ్మే- ‘రామాయణ’మాయెను
మొక్కవోలె పెరిగి పెరిగి మహావృక్షమాయెను

ఎందరొ రాములు బుట్టిరి- ఒకటే రామాయణం
ఎందరొ కలములబట్టిరి కవియన వాల్మీకియే

నిలుచుదాక విశ్వమ్మే- నిలుచును రామాయణం
ముగియునేమొ విశ్వమైన- ముగియదు రామాయణం
**
అయోధ్య

అది సరయూ నదీ తీరం. అది అయోధ్యాపురి. దానికే సాకేతపురమని పేరు. ప్రజలే నదీ తరంగాలనగా, నది ఒడ్డున నదిలా ఉంటుందది.
దానిపై దండెత్తిన యోధుడూ, జయించిన యోధుడూ ఇంతవరకూ పుట్టలేదు. పుట్టబోడు. అందుకే అది అయోధ్య.
అది కోసలకు రాజధాని. మునుపు దాని నిర్మాత, సగరుడు, దిలీపుడు, భగీరథుడు, అంబరీషుడు మున్నగు సూర్యవంశపు రాజులేలిన నేల అది. అత్యంత పవిత్రమైన స్థలమది. వీర గంధాల్ని విరజిమ్మే మట్టి అది.
అవి ఉన్నతమైన కోటలు. అక్కడి ప్రజలింకా మహోన్నతులు. కోట చుట్టూ నీటితో నిండిన కందకాలు, అవి చాలా లోతైనవి. అక్కడి ప్రజల మనస్సులింకా లోతైనవి.
విశాలమైన వీధులు అద్దాలవలె, అద్దాలు ప్రజల హృదయాలవలె నిర్మలంగా ఉంటాయి.
ఆ ఇళ్ళ లోగిళ్ళలో ఉండే చిలుకలు వేదమంత్రాల్ని పఠిస్తాయి. నెమళ్ళు వాకిళ్ళలో భరతనాట్యాలు చేస్తుంటాయి.
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087