Others

బల్గేరియా నాట్య గురువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బల్గేరియా మహిళ కట్యాటొషేవా స్వదేశంలో ఇంజనీర్ ఉద్యోగాన్ని వదులుకుని భారతీయ నృత్యరీతులకు అంకితమైపోయింది. బల్గేరియాలోని చిన్నారులకూ ఈ నాట్య కళలపై శిక్షణ ఇస్తుంది. ఇందుకోసం తన సొంత పట్టణం సోఫియాలో కయా అనే డ్యాన్స్ స్కూల్‌ను నెలకొల్పింది. దీని గురించి ఆమెను అడిగితే.. ‘్భరతదేశ సంస్కృతి, ఇక్కడి నాట్యాలు నన్ను సమ్మోహనపరిచాయి. అందుకే ఇంజనీర్ ఉద్యోగాన్ని మానుకుని భారతదేశంలో శాస్ర్తియ నృత్య రీతులను నేర్చుకుంటున్నాను. ప్రస్తుతం భరతనాట్యం, కథక్ వంటి నృత్యరీతులను అభ్యసిస్తున్నాను. ఇక్కడ నేర్చుకుంటున్న విద్య బల్గేరియాలో చిన్నారులకు నేర్పిస్తున్నాను. నాలాంటి విదేశీ మహిళలకు శాస్ర్తియ నృత్యం నేర్చుకోవడం చాలా కష్టమైన పని. ఈ విషయంలో నేను నా గురువులకు రుణపడి ఉన్నా.. వారు ప్రతీ పదం అర్థం వివరిస్తూ వారు నాకు నాట్యం నేర్పిస్తున్నాను. భారతదేశ నృత్య రీతుల్ని నేర్చుకునేందుకు నేను చాలా గర్వపడుతున్నా.. అందుకే నేను నేర్చుకున్న విద్యను అందరికీ పంచుతున్నా..’ అంటూ ఆనందంగా చెబుతోంది కట్యా.