Others

ఆదర్శ జీవనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మాతాచ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః
బాంధవాః శివభక్తాచ స్వదేశో భువనత్రయం’’.
ఈలోకంలో శివుని పూజించని వారు అరుదుగా ఉంటారు. శివుడు లయకారుడు. కాని శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని కష్టానికి సుఖానికి శివుడిని అనుకునేవారు చాలామంది ఉంటారు. శివుడు, రాముడు వీరిద్దరినీ తమ ఆప్తులుగా తమ బంధువులుగా అనుకొనేవారు కోకొల్లలు. ఒక తల్లి త్రినేత్రుడైనా తన తనయుడుగా తలచి కాళ్లపై వేసుకొని లాల పోసి తరించింది. మరో తల్లి లింగధారుడైనా నమ్మి కొలిచి తనతో మాట్లాడేట్టు చేసుకొంది. అట్లానే రాముడు పేర్లల్లోనే కాదు కష్టం రాగనే రామచంద్రా అనే వారు వెతకకుండానే కనిపిస్తారు. రాముడిని తమ తమ తనయుడిగా భావించిన ప్రతివారు రామారావు, రామయ్య అనేపేర్లు కలియుగంలోను పెట్టుకుంటున్నారు. పుత్రులను పిలుస్తూ పరమాత్మనే పిలుస్తున్నామని భావించి తరించిపోతున్నారు.
నవదంపతులను సీతారాముల్లాగా వర్థిల్లండి అని అంటారు. వయస్సులో పెద్దవారైన దంపతు లు కనిపిస్తే పురాణ దంపతులైన పార్వతీ పరమేశ్వరులని భావించి వారికి నమోవాకాలు అర్పించేవారు లెక్కకు మించి ఉంటారు.
శివకల్యాణమైనా రామకల్యాణమైన చేసి లోకోపకారం చేయాలనుకొనేవారు ఎక్కువే. ఆ దంపతుల కళ్యాణాలు లోకకళ్యాణాలుగా భావి స్తారు. వారు లోకానికి శుభాలతోపాటు చక్కని ఆదర్శాన్ని చూపిస్తున్నారు. శివుడు తన శరీరంలో అర్థ భాగం తన సతినే అంటే సతి తప్ప అన్య స్ర్తిలు నాకు తెలియదు ఏకపత్నీ వ్రతం ఆచరించాడు రాముడు. అందుకే శివపార్వతుల జంటను ‘‘వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే, జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ’’ అని స్తుతిస్తారు. సీతా రాములు అనురాగమూర్తులు. వారిరువురూ అసురుల వల్ల వేరైనా వారి హృదయాలు మాత్రం కలసే ఉన్నాయ.రాముని మాట సీతమ్మకు తెలుసు. సీతమ్మ మనోవాంఛ రాముల వారికీ తెలుసు. అందుకే ఇప్పటి వధూవరులను సీతారాముల్లా కాలం గడపమని ఆశీర్వదిస్తారు.

- కూచిబొట్ల వెంకటలక్ష్మి