Others

సంఘటిత శక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వేచ్ఛామృత ధారలతో
స్వర్ణాన్ని పండించే ఓ రైతన్నా!
ఇక్కట్ల ఇనుప తెరలు
చుట్టేసిన నేపథ్యంలో
ఊపిరి సలపక
విలవిల్లాడిపోతున్నావే!
శ్రమైక జీవన సౌందర్యాన్ని
ఆవిష్కరిస్తున్న ఓ శ్రామికా!
వెట్టి చాకిరితోవెన్నువిరిగి
అచేతనంగా పడిపోయిన నీకు
ఆసరా దొరకక
అల్లల్లాడిపోతున్నావే!
బిగించిన ఉక్కు పిడికిలి
ఉద్యమస్ఫూర్తికి చిహ్నంగా
కదులుతూ పదం పాడే
నీ ముందు లోకం మోకరిల్లే క్షణాలు
నీ ముందుకొచ్చాయని తెలుసుకో!!
రేపటి వెలుగు నీదే జయమూ నీదే !!
ఇక సంఘటిత శక్తిని చాటుతో!!

వెలుగుల పులుగు తెలుగు

సీ. తెలుగు నెవ్వాడు రా వెలుగులేదను వాడు
అవ్వాని హీనత కవధిలేదు
తెలుగు నెవ్వాడురా తెగ తెగనాడెడి
ధూర్తుండు దురితుండు భరము భువికి
తెలుగు నెవ్వాడురా చులకన జేయంగ
జూచు వాడజ్ఞాని కాచుకొనుడు
తెలుగులో బలమేది? తెలుగులో నేమున్న
దన సాహసింతురే దమ్ము గలద?

గీ. తీరు తీరున విరిసెనె తెలుగు పూలు
దివ్య తేజంబు గలది యే తీరుజూడ
అమ్మభాషకు నమరిన వన్ని హంగు
లనగ సందేహమేలరా లక్షణముగ

గీ. క్రొత్తపాతలు గలుపుచు గొలువుదీరి
శ్రేయముంగూర్చు నా తెల్గు సిరుల పంట
తెలుగు వారలు ధన్యాత్ములిల గనంగ
కలిమి బలములు గలది నా తెలుగు భాష!!

కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం 9492457262