Others

వేసవిలో శీతల పానీయాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవికాలం ఆరంభమైంది, విద్యార్థులకు ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. త్వరలో వేసవి సెలవులు సైతం రాబోతున్నాయి. గత మూడు, నాలుగు సంవత్సరాల నుండి వేసవికాలంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. రోజూ వివిధ దినపత్రికలో ఎండ వేడిమి తాపాన్ని తట్టుకోలేక నేలకొరిగిన వాళ్ళను సైతం చూస్తున్నాము. జరుగుతున్న పరిస్థితుల అనుసారంగా నడుచుకుంటూ జాగ్రత్తలు తీసుకోకపోతే చిక్కులు తప్పవు.
ప్రత్యేకంగా చిన్న పిల్లలు ఆటలకు అలవాటుపడి, చెబితే వినకుండా ఎండలలో ఆడటం, వృద్ధులు పనిమీద బయటికి వెళ్లి వివిధ ఇబ్బందులకు గురికావడం చూస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరూ వేసవికాలం వచ్చిందంటే చాలు శీతల పానీయాలు థమ్స్ అప్, స్ప్రైట్, మజా.. ఇలా ఎన్నింటిలో తయారుచేసి గ్రామాలకు సైతం తరలించి వ్యాపారాలు సాగిస్తున్నారు.
ఎండవేడిమిని తట్టుకోలేక వాటిని త్రాగి సేదదీరడాని ప్రయత్నిస్తుంటారు కానీ వివిధ అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. అలాగే ఐస్‌క్రీమ్స్‌ను పొరుగు రాష్ట్రాలనండి వచ్చి గల్లీ గల్లీకి ఒకరిద్దరు అమ్ముతూ ఉండడం, చిన్నపిల్లలు మారాం చేసి కొనిపించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ వాటిని తయారుచేసే విధానంలో నాణ్యత కలిగిన పదార్థాలను వాడకపోగా, అపరిశుభ్ర వాతావరణంలో తయారుచేయడం, దానివలన వివిధ అనారోగ్యాల బారిన పడినట్లు సామాజిక మాథ్యమాలలో తరచూగా చూస్తూనే ఉన్నాం.
కావున ఈ వేసవికాలంలో రోజు రోజుకు ఉష్ణోగ్రత పెరిగి తీవ్ర ఇబ్బందులకు గురిచేయబోతున్నది. కావున దానికి తగినట్లుగా జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
చేయకూడని పనులు
- వీలైనంతవరకూ పగటి పూడ బయటికి వెళ్ళకుండా ఉండడం.
- ఆల్కహాల్‌లను తీసుకోరాదు. అవి శరీరంలో ఇంకా ఎక్కువ వేడిని కల్గించి డీహైడ్రేషన్‌కు గురిచేసి, శరీరంలోని నీటిని చెమట రూంలో బయటికి పంపుతుంది.
- ఫ్రిజ్‌లోని నీటిని చల్లబరచుకొని త్రాగితే, వెంటనే చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది.
- రసాయనాలతో తయారుచేస్తున్న శీతల పానీయాలను సేవించరాదు.
- మార్కెట్‌లలో లభించే వివిఐ ఐస్‌క్రీమ్స్‌లకు దూరంగా ఉండాలి.
- మసాలాలు, నూనెలతో తయారుచేసిన పదార్థాలు, మాంసాహారాలు తినకూడదు.
- వేపుళ్ళకు స్వస్తి పలకాలి.
- నల్లటి రంగు రంగుల, మందమైన దుస్తులను వేసుకోకూడదు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- మధ్యాహ్నం 12 గంటలనుండి 3 గంటల వరకు బయటకు వెళ్ళకుండా ఉండడం. ఒకవేళ వెళ్లవలసి వస్తే పాదరక్షలు, గొడుగు, కూలింగ్ గ్లాసెస్, హెల్మెట్ తప్పనిసరిగా వాడాల్సిన అవసరం ఉంది.
- సాధారణంగా రోజుకు 5 లీటర్ల నీటిని సేవించాలి. కాని వేసవిలో కనీసం 7 లీటర్ల నీటిని తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
- శీతల పానీయాలను సేవించకుండా, చిరుధాన్యాలతో చేసుకున్న అంబలి, నిమ్మరసాలను, కొబ్బరినీటిని సేవించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
- మట్టితో చేసిన కొత్త కుండలను, కూజాలలోని నీటిని సేవించాలి.
- నల్లటి దుస్తులు కాకుండా లేత రంగుల దుస్తులనే వేసుకోవాలి.
- ఇంటి ఆవరణలో పచ్చటి మొక్కలు, తీగబారు చెట్లను పెంచుకొని ఇంటిని సైతం చల్లగా వుంచుకోవడానికి ప్రయత్నించాలి.
- ఐస్‌క్రీమ్స్ లాంటి చల్లటి పదార్థాలను కాకుండా పెరుగును గిలకొట్టి మజ్జిగగా చేసుకొని సేవిస్తే ఇంకా మంచిది.
- ఎలక్ట్రాల్, గ్లూకోజ్ పౌడర్ నీళ్ళలో కలుపుకొని త్రాగాలి.
పైవిధమైన చిట్కాలు పాటిస్తే వేసవి తాపంనుండి బయటపడటానికి వీలవుతుంది.

-డా పోలం సైదులు 94419 30361