సబ్ ఫీచర్

బోధి వృక్షం.. ఓ సంస్కృత పదం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిహార్ (ఒకప్పుడు కపిలవస్తు రాజ్యం)లోని (బోధ్) గయలో గల ‘బోధి వృక్షం’ సందర్శించేందుకు బౌద్ధమతస్తులు తరలివస్తుంటారు. ముస్లింలకు ‘మక్కా’, క్రైస్తవులకు జెరూసలెం ఎలాగో బౌద్ధం ఆచరించేవారు ‘బోథ్‌గయ’ను అంత పవిత్రంగా భావిస్తారు. రెండున్నర వేల ఏళ్ల క్రితం సిద్ధార్థుడు ఈ వృక్షం కిందనే కూర్చుని ‘్ధ్యనం’ చేయగా ‘జ్ఞానోదయ’మైంది కాబట్టి ఆ ప్రాంతాన్ని, ఆ చెట్టును పవిత్రంగా భావిస్తారు. తెలుగులో దీన్ని ‘రావిచెట్టు’ అంటారు. దాని శాస్ర్తియ నామం ఫికస్ రిలిజియస. కాని ప్రపంచ వ్యాప్తంగా ‘బోధివృక్షం’గా సంస్కృత పేరుతో ప్రచారం చేశారు, చేస్తున్నారు. వాస్తవానికి బుద్ధుడు సంస్కృత భాషనుగాక ‘పాళి’ భాషను ప్రేమించాడని, ఆ రోజుల్లో జన బాహుళ్యపు భాష అది కాబట్టి దానికి ప్రాధాన్యత నిచ్చాడంటారు. పాళి భాషలో ఆ చెట్టును పిలవలేదు. అందరి నోళ్ళలోనూ ‘బోధి వృక్ష’మన్న మాటలు వినబడేలా చూశారు.
ఆనాడు సంస్కృతం బ్రాహ్మణుల ఆరవ ప్రాణం. సాధికారిక గ్రంథాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. ముని కుటీరాలలో, గురుకులాలలో సంస్కృత భాషనే, ఆ మాధ్యమంలోనే బోధించారు. అది సుసంపన్నమైన భాషగా గుర్తింపు పొందింది. ఆ రకంగా రావిచెట్టు కాస్త బోధివృక్షంగా ప్రసిద్ధి చెందింది.
పవిత్రమైన గంగానది ఉపనదికి ఆనుకుని ఉన్న విష్ణు దేవాలయం వద్ద ఆ బోధివృక్షం కింద ధ్యానం చేస్తే ఫలితముంటుందని బ్రాహ్మణ సన్యాసులు బుద్ధునికి సూచించారు. బ్రాహ్మణులు లేకుండా సంస్కృతం లేదు, సంస్కృతం లేకుండా బౌద్ధం లేదు. ఈ మాట కొందరికి ఆగ్రహం కలిగించవచ్చుగాని ఇది ‘సత్యం’. బ్రాహ్మణ (సంస్కృతం) శంఖంలో నీళ్లు పోస్తే అది తీర్థం (బౌద్ధం)గా మారింది. పవిత్రతను సంపాదించుకుంది. తొలినుంచి జరిగిన పరిణామాలను పరిశీలిస్తే తేలే సారాంశం ఇదే! అతిశయాన్ని, అహాన్ని విడనాడి పరిశీలన చేస్తే వాస్తవాలు వెల్లడవుతాయి. ‘బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి’ అన్న నినాదాలు, బోధనలు సైతం సంస్కృత భాష భూయిష్టమైనవే తప్ప పాళీ భాషనో, మరో ప్రాంతీయ భాష పదజాలం కాదు. ఆ నినాదాలు రూపొందించింది సైతం బుద్ధుని తొలి శిష్యులైన బ్రాహ్మణులే!
గౌతమ బుద్ధుడు తనకు ‘జ్ఞానోదయం’ కలిగిందని భావించిన వెనువెంటనే బోధ్‌గయ నుంచి సారానాథ్‌కు పయనమై తనతో చాలాకాలం ధ్యానం చేసిన బ్రాహ్మణులను కలిశాడు. క్షత్రియుడైన సిద్ధార్థుడిపై హిందూ ధర్మం ఆచరించే ఆ బ్రాహ్మణులు వివక్ష చూపలేదు. జ్ఞానాన్ని పంచుకున్నారు. అంతవరకు పోగైన జ్ఞాన సంపదను సిద్ధార్థునికి పరిచయం చేశారు. అందులోని సారాన్ని అందించారు. అశ్వత్థ వృక్షం (బోధివృక్షం) ప్రాశస్త్యాన్ని తెలిపారు. ఆ పునాదులపైనే, ఆ మార్గంలోనే, ఆ తపస్సు- ధ్యాన మార్గాల ఆధారంగా సిద్ధార్థుడు పయనమయ్యాడే తప్ప కొత్త మార్గం, కొత్త దారిలో పయనించలేదు. సిద్ధార్థునికి ఆధారమల్లా తోటి బ్రాహ్మణ సన్యాసుల మార్గదర్శనం, వారి ఆచార వ్యవహారాలు, అప్పటికే ఆచరణలో ఉన్న ధ్యానం, తపస్సు, యోగ పద్ధతులు. వాటినే ఆయన ఆచరించారు. అప్పటికే సంవత్సరాలపాటు వారి సహచర్యం కారణంగా, ఆ బోధనలు మనసులో నింపుకొని మనోక్షేత్రంలో ఆ సంస్కృత శ్లోకాల ఉచ్ఛారణ.. ధ్యానం.. యోగ.. ఈ భూమిక నుంచి మొలకెత్తినవే బుద్ధుని పలుకులు. సహజంగానే ఆ సారమంతా ఆ పలుకుల్లో పరిమళించింది. బ్రాహ్మణులు, సంస్కృత భాష వినా బుద్ధుని ‘మనోవికాసం’ కనిపించదు. ఆయన కమల పుష్పం, చేతి ముద్ర, కాషాయ వస్త్రం ఇలా సర్వం బ్రాహ్మణ.. సనాతన బ్రాహ్మణ సంప్రదాయంలోంచి వచ్చినవే తప్ప కొత్త చిహ్నాలు కావు. కొత్త ఆవిష్కరణల అంతకన్నా కావు. సనాతన బ్రాహ్మణ సంప్రదాయం కొనసాగింపే- ‘బౌద్ధం’ అంటే అతిశయోక్తి కాదు.
పురాణాల్లో ‘అశ్వత్థ వృక్షం’ మహాత్మ్యం తెలిశాకే గౌతముడు ఆ వృక్షాన్ని ఎంపిక చేసుకున్నాడన్నది యదార్థం. బుద్ధుడు ‘పునర్జన్మ’ను అంగీకరించడంతోనే తోటి బ్రాహ్మణ సన్యాసులు బుద్ధుని బోధనల పట్ల సానుకూలత కనబరిచి తలకెత్తుకున్నారు. ‘కర్మ’ సిద్ధాంతానికి ఊపిరిలాంటిది పనర్జన్మ. అంటే హిందూ ధర్మాన్ని కించిత్ కూడా కించపరచడం లేదు కాబట్టి బ్రాహ్మణ సన్యాసులు బుద్ధుడిని తమలో కలుపుకున్నారు, అతనితో కలిసిపోయారు. ఆ రకంగా వారు ‘అద్వైతాన్ని’ తిలకించారు. ఆ తత్త్వం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కర్మ సిద్ధాంత ఫలం పునర్జన్మ కావడంతో విభేదించడానికి అవకాశం హిందూ ధర్మం ఆచరించే వారికి అగుపించలేదు. అందుకే బ్రాహ్మణులు తమ జ్ఞానాన్ని, ధారణాశక్తిని, విస్తృత అధ్యయన అనుభవాన్ని, సంస్కృత భాషా పటిమను బౌద్ధ బోధనలకు జత చేశారు. ఆ విధంగానే రావిచెట్టు కాస్త ‘బోధి వృక్ష’మైంది. బుద్ధుడిని నమ్మండి అనే మాట కాస్త బుద్ధం శరణం గచ్ఛామి అయింది. విష్ణువు నాభిలోంచి వచ్చిందని భావించే పద్మం.. కమలాన్ని బుద్ధుడికి విష్ణు దేవాలయం పక్కనగల బోధి వృక్షం వద్ద సమర్పించారు. చివరికి ఆ పద్మమే.. కమలమే అతనికి ఆసనమైంది. అంతా సనాతన హిందూ ధర్మం కొనసాగింపుగానే దర్శనమవుతోంది కదా? దానికొనసాగింపుగా కనిపిస్తోంది కదా?.
అంతేగాక ఆకాశంలో సగంగా భావించే మహిళలను ‘సంఘం’లోకి తీసుకోవాలని బుద్ధునికి సూచించింది బ్రాహ్మణ శిష్యులే. ఆ రకంగా సన్యాసినుల సంఖ్య పెరిగింది. ఈ మాత్రం దానికి వీరావేశాలు ప్రదర్శించడం అవసరమా? ‘సమ్యక్ దృష్టి’ని కోల్పోవడం న్యాయమా? వర్తమానంలో బుద్ధుని బోధనల పట్ల ఆకర్షితులై బౌద్ధాన్ని ఆచరిస్తున్నామనే వారిలో ప్రేమ, కరుణ, దయ, వినమ్రత, నిరాడంబరత, పరోపకారం, జీవకారుణ్యం కనిపించదు. ఎంతసేపూ మరో మతానికి ‘పోటీ’గా, దానికి ‘ప్రచ్ఛన్నం’గా బౌద్ధ ధర్మాన్ని (మతాన్ని) నిలపాలన్న ‘యావ’ తప్ప, బుద్ధుని వౌలిక బోధనల ఆచరణ అనుసరణ కనిపించదు. మహాయానం, హీనయానం అంటూ హీనంగా కొట్టుకోవడమే అగుపిస్తోంది. తాజాగా ‘జెన్’గా బౌద్ధం రూపాంతరం చెందింది. మరో ఇరవై ధోరణులు ప్రబలుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో వైఖరి అవలంబిస్తున్నారు. బుద్ధగయలో వాటి ఛాయలు స్పష్టంగా దర్శనమిస్తాయి. వివిధ దేశాల నిర్మాణ, వాస్తుశైలికి అనుగుణంగా ఆరాధనా మందిరాలు- పగోడాలు, గోపురాలు, మేడలు, ఆరామాలు మెరుస్తున్నాయి. చిత్రమేమిటంటే నకిలీ (సూడో) సన్యాసుల బెడదతో అసలైన సన్యాసులు సతమతమవుతున్నారు. ఇదొక ఉపాధి మార్గంగా బుద్ధగయలో మారింది. భిక్షాపాత్రతో బయలుదేరడం సరేసరి!
‘కార్పొరేట్ కల్చర్’కు అనుగుణంగా అనేక యోగ కేంద్రాలు, ఒత్తిడి నియంత్రణ, ఒత్తిడి తగ్గింపు కేంద్రాల మాదిరి బౌద్ధ క్షేత్రాలు వివిధ దేశాలలో వెలుస్తున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో ‘విపాశన’ను నేర్పించే సంస్థలు వెలిశాయి. అనేక ‘కల్ట్’లు పుట్టుకొచ్చాయి. అమెరికా వాళ్ళు, యూరప్ వాళ్లు సైతం ఇందులో తమతమ ప్రత్యేక పద్ధతులను ‘ప్రమోట్’ చేసేందుకు పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో బౌద్ధాన్ని, సనాతన ధర్మాన్ని ‘ప్రచ్ఛన్నం’గా భావించి సనాతన ధర్మం మెడలు విరవాలని, తమలోని ఆగ్రహాన్ని (అహాన్ని) చల్లార్చుకోవడానికి, నాలుగు రాళ్లు వేయడానికి, నిందా పూర్వకంగా తులనాడే ప్రసంగాలు చేయడానికి బౌద్ధాన్నీ దగ్గరికి తీసుకుంటున్నారు. అక్కున చేర్చుకుంటున్నారు. సాంత్వన పేర ‘సమిధలు’ విసురుతున్నారు. వివేకం, వివేచన, విజ్ఞత, సమ్యక్ జ్ఞానం సమాధి చేస్తున్నారు. ఇలాంటిదెప్పుడూ బుద్ధుడు కోరుకోలేదని వీరికి ఇంకెప్పటికి బోధపడుతుంది? అందుకోసం అలాంటివారు వర్తమానంలో బోధివృక్షాన్ని ఆశ్రయిస్తే మంచిదేమో!

-వుప్పల నరసింహం 99857 81799