Others

నామి కన్నా నామమే మిన్న- శ్రీచక్రము, మానవ శరీరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు : H.No.7-8-51,Plot 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
====================================================================
ధ్యాన విషయమై భగవాన్ శ్రీరమణ మహర్షి ఈ క్రింది విధంగా చెప్పారు. ‘్భగవన్నామము’, ‘ఆత్మ’ ఒకటేనని చెప్పేవారు భగవాన్ రమణ మహర్షి. మొదట్లో భగవంతుని నామజపం ధ్యానానికి ఏకాగ్రతకు ఉపకరిస్తుంది. భగవన్నామాన్ని మనం ధారణ చేసేముందు, మనస్ఫూర్తిగా పూర్తి విశ్వాసంతో ఆయన్ని ఆహ్వానించాలి. మనం ఆ విధంగా నమ్మకముంచితే ఆ భగవన్నామం మనసు విడువకుండా మనతో ఉంటుంది.
భగవన్నామజపం మనలో నిరంతరం కొనసాగుతుంటే ఇతర విషయములపైకి మనసు పరిగెత్తకుండా, నిశ్చలవౌతుంది. అప్పుడు మనిషి తన నిజస్థితి (ఆత్మతత్వం)లో ఉంటాడు. అట్లుండుటే నిజమైన ధ్యానమైనా, జపమైనా, ప్రయత్న పూర్వకంగా ధ్యాన జపాదులచేత మనస్సు ఇతర విషయాలపైకి మరలక నిశ్చలమై నిలిచినచో ఇక మిగతాది స్వస్వరూపమే!
అపుడు అభివ్యక్తుడైన భగవంతుడే (మనం చేసే జప ధ్యాన) రూపధారి మనలోపల జపం చేసేదెవరో అనే్వషించి గుర్తిస్తే అదే ఆత్మ అవుతుంది.
సః+అహం =సోహం, అంటే అదే నేను అని అర్థం. కాబట్టి ఈ ‘నేను’ అనేదే భగవంతుని మొదటి నామం అంటారు మహర్షి. అంతేకాదు ‘సత్‌స్వభావంతో వస్తు కేవలం’ అంటారు భగవాన్ రమణులు. అంటే వాటి యొక్క సత్‌యే వాటి స్వభావంగా ఉంది. వున్న వస్తువు ఒకటే, దానికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా నష్టం లేదు. ‘ఏకం సత్ విప్రాబహుదా వదంతి’ అని చెప్పబడింది కదా! భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ ఇదే విషయాన్ని భగవద్గీతలోనూ తెలిపారు.
సమస్త ప్రాణులయందు, సమముగానున్నట్టి పరమాత్మను, ఆయా ప్రాణుల శరీరములు నశించినను నశింపనివానిగా ఎవడు ఎరుకతో చూచుచున్నాడో అతడే నిజమైన చూపు కలవాడు అగును.
ధ్యానయోగం గురించి, శ్రీ పుష్పదంతాచార్యులిట్లు తెలిపిరి. ఓ పరమశివా! ఆకాశమే నీ కేశపాశమై నీ శిరస్సునందలి గంగావాహిని నక్షత్ర మండలానికి కూడా వ్యాపించి గగనకాంతులను సంతరించుకుంటుంది. ఈ బ్రహ్మాండగోళమంతా ఆ జల సమూహం మధ్యద్వీపముగా భాసిస్తుంది. చదువుల తల్లియైన సరస్వతీదేవిని ‘్భవాంబరవీధి విస్తృత విహార’ అని సంబోధించుటలో కూడా ఇదే అర్థం స్ఫురిస్తుందేమో!శ్రీకాళిదాస మహాకవి విరచితమని చెప్పబడే ‘చిద్గగన చంద్రిక’ అను గ్రంథంలో మహాకవి ఈ విధంగా చెప్పారు.
అమ్మా! వాగ్దేవీ, నా హృదయాకాశంలో గోచరించే నీ జ్యోతిర్మయమైన స్వరూపం, అపరోక్షానుభూతియనే మంచుతెర మధ్యలో కర్మబంధములనే అగ్ని కీలలను నశింపజేసి నీ తత్త్వ మహత్తును తెలియజేస్తుంది.
అనాదిగా ఊర్థ్వరేతస్కులైన మన మహర్షులు, తపస్యులు, యోగులు, దేవతాశక్తులను తమలోనికి ఆవహింపజేసుకునే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ధ్యానము పరిపక్వము చెందినపుడు ఆయా మంత్ర సంబంధమైన దేవత అనుగ్రహించి సాధకుని ఆవహించటం మంత్రసిద్ధిలో ముఖ్యమైన దశగా చెప్తారు. చిరకాలముగా సాధకులవలంభించిన మార్గమిదియే.
- ఇంకాఉంది

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9849560014