Others

మహిళా ఇంజినీర్లకు ‘గూగుల్’ బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంకేతిక రంగంలో పురుషులకు దీటుగా మహిళలను ప్రోత్సహించేందుకు ‘గూగుల్’ సంస్థ మన దేశంలో ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఐటీ కంపెనీల్లో, ఇతర సాంకేతిక సంస్థల్లో మహిళల నిష్పత్తి తక్కువగానే ఉంది. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేలా సాంకేతిక రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు ‘ఉమెన్ ఇంజినీర్స్’ (డబ్ల్యూఈ) పేరిట ‘గూగుల్’ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో మహిళలను తీర్చిదిద్దేందుకు కూడా ‘గూగుల్’ అన్ని విధాలుగా అండగా ఉంటోంది. ‘టాలెంట్ స్పిరిట్’ కార్యక్రమంలో భాగంగా రాబోయే మూడేళ్ల కాలంలో 600 మంది మహిళా ఇంజినీర్లను తీర్చిదిద్దాలని ‘గూగుల్’ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రతిభావంతులైన విద్యార్థినులను ఎంపిక చేసి, వారికి ఏటా లక్ష రూపాయల చొప్పున ఉపకార వేతనాలు అందజేస్తారు. ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం లేదా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు ఉపకార వేతనాలు పొందేందుకు అర్హులు. ఎంపికైన వారికి ఆన్‌లైన్ క్లాసులు, సమ్మర్ క్యాంప్‌లు, బృందాలవారీగా ప్రాజెక్టులు నిర్వహిస్తారు. విద్యార్థినుల్లో సాంకేతిక అవగాహన, ఇతర నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తారు. ఎంపికైన విద్యార్థినులకు భారత్, అమెరికాలకు చెందిన సాంకేతిక నిపుణులు శిక్షణ ఇస్తారు. మొదటి ఏడాది వందమందికి, రెండో ఏడాది 200 మందికి, మూడో సంవత్సరంలో 300 మంది విద్యార్థినులకు శిక్షణ ఇచ్చి వారిని సాంకేతిక రంగంలో తీర్చిదిద్దుతారు. శిక్షణ పూర్తి చేసిన వారికి ‘గూగుల్’లో ప్రాథమిక స్థాయిలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఉపాధి రంగంలో ప్రోత్సహిస్తారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఇప్పటికే 180 మంది విద్యార్థినులకు శిక్షణ ఇచ్చి, ప్రపంచ వ్యాప్తంగా 80 కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పించారు. శిక్షణలోను, ఇంటర్వ్యూల సమయంలోను విద్యార్థినులకు సాంకేతికపరంగా, ఆర్థికపరంగా ‘గూగుల్’ సంస్థ సాయం అందజేసింది. లింగవివక్ష వల్ల, సామాజిక-ఆర్థిక కారణాల వల్ల భారత్ సహా అనేక దేశాల్లో సాంకేతిక రంగంలో మహిళలకు సమాన అవకాశాలు లభించడం లేదు. ఈ వివక్షను అంతం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయాలని ‘గూగుల్’ సంకల్పించింది.