Others

మానవుడే మహనీయుడు (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి భూగోళమంత గొప్పవాడు. ఇది అందరికీ తెలిసిన సత్యం. కానీ మనిషి తలచుకుంటే భూగోళాన్ని మించి విశ్వాంతరాల్లోకి వెళ్లి రాగలిగే శక్తి ఉన్నవాడు. అతని శక్తియుక్తులు అతనికి తెలియవు. అవసరమైనప్పుడు మాత్రమే ఎలాగైనాసరే వాటిని ఉపయోగించి విశ్వాంతరాళాలకు ఎదిగి విశ్వంభరుడవుతాడు. అలాంటి ఆలోచనతోనే ఓ అద్భుతమైన పాటను బాలభారతం చిత్రం కోసం ఆరుద్ర రాశారు. భీముడు తన తల్లికోసం స్వర్గంలో ఉండే ఐరావతాన్ని తీసుకురావడానికి బయలుదేరతాడు. కానీ స్వర్గానికి వెళ్లాలంటే ఎలా? అందుకే విలువిద్యలో ఆరితేరిన అర్జునుడు స్వర్గానికి తన విల్లంబులతో నిచ్చెనలు నిర్మిస్తే భీముడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆకాశంలో వెళుతుంటాడు. ఆ సన్నివేశం కోసం ఆరుద్ర కలం మానవుడి యొక్క గొప్పతనాన్ని చెబుతూ మోటివేషనల్ సాంగ్‌ను పలికించింది. మానవుడే మహనీయుడు/ శక్తియుతుడు యుక్తిపరుడు -మానవుడే మాననీయుడు అంటాడు ఆరుద్ర. అనుపల్లవిలో -మంచిని తలపెట్టినచో మనిషికడ్డులేదులే/ ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే అంటూ రాశారు. ఇక చరణంలో -దివిజగంగ భువిదింపిన భగీరథడు మానవుడే/ సుస్థిర తారగ మారిన ధృవుడు కూడ మానవుడే/ సృష్టకి ప్రతిసృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే/ జీవకోటి సర్వములలో శ్రేష్టతముడు మానవుడే -అంటూ రాశారు ఆరుద్ర. ఏ విషయంలోనైనా మనిషికి ప్రేరణ కలిగించడానికి ఇంతకంటే గొప్ప పాట మరొకటి ఉండదేమో.
గ్రహరాశులనధిగమించి/ ఘన తారల పథమునుంచి/ గగనాంతర రోదశిలో గంధర్వ గోళ గతులుదాటి మనిషి -చంద్రలోకమైన, దేవేంద్ర లోకమైన బొందితో జయంచి మరల భువికి తిరిగి రాగలిగే-వాడు ఒక్కడే, వాడే మానవుడు అంటారు ఆరుద్ర. మానవుడు మహనీయుడు అన్న స్టేట్‌మెంట్‌ను బలపర్చుకోడానికి ఆరుద్ర ఎత్తుకున్న పాత్రలు, వాటి వర్ణన, ఆ పాత్రల స్వభావాన్ని కళ్లముందుంచుతూ రాశారు. ఆరుద్ర కలం పదునుకు తగ్గట్టుగా ఉదాత్తమైన స్వరబాణీని అందించి పాటకు ప్రాణం పోశారు సాలూరి రాజేశ్వర రావు. ఇక ఈ పాటను ఆలపించిన ఘంటసాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వీళ్లంతా కలిపి మనిషి గొప్పతనాన్ని ఆకాశానికి ఎత్తారు. గొప్ప పాట ఇది.

-పరమేశ్వర్రావు, కనిగిరి