Others

ధర్మమూర్తి భార్గవరాముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భృగు వంశోద్భవుడు, జమదగ్ని మహర్షి కుమారుడు, సహస్ర బాహుడైన కార్తవీర్యార్జునుని సంహరించిన మహావీరుడు పరుశురాముడు. తండ్రి ఆజ్ఞానువర్తియై, కన్నతల్లిని హతమార్చి, తిరిగి తండ్రి ఆశీస్సులతో పునరుజ్జీవితురాలిగా చేసిన ధర్మవీరుడు, భూ భారాన్ని తగ్గింప భార్గవరాముని రూపంలో ఉదయించాడు శ్రీహరి. అనులోమ సంజాతుడై, బ్రాహ్మణుడగు జమదగ్నికి, క్షత్రియురాలగు రేణుకకు జన్మించి, బ్రాహ్మణ క్షత్రియ వివాదాలను గొడ్డలితో తీర్చి, ఆటవికులకు యజ్ఞోపవీత ధారణలు గావించి, బ్రాహ్మణులుగా మార్చిన అసామాన్య సామాజిక సంస్కర్త పరుశురాముడు. అంతేకాదు, బ్రాహ్మణ పక్షపాతియై, క్షత్రియులనేకులను సంహరించిన పరుశురాముడు, ‘‘మీరెన్ని దానములు పట్టినను, ఎంతగా కష్టపడినను విద్య వచ్చునే గాని, ధనము రాదని, వచ్చినను అది నిలువ ఉండదని’’ బ్రాహ్మణ కులానికే శాపమిచ్చిన గాథ ఉంది. ఆజన్మాంతం క్షత్రియ కులాన్ని నిర్మూలించిన పరుశురాముడు క్షత్రియుడైన శ్రీరాముని చేతిలో ఓడిపోవడం, శివధనుస్సు విరిచి వివాహితుడై వస్తున్న దశరథ రాముని ఎదిరించి భంగపడడం, విష్ణువు యొక్క ఒక అవతారం చేత మరొక అవతారం ఓడింప బడిన సందర్భం ప్రత్యేకం. విష్ణువు దశావతారాలలో ఆరవది పరుశురామావతారం. అక్షయ తృతీయ రోజునే బలరామ జయంతియని కొన్ని చోట్ల పేర్కొంటున్నా, పురుషార్థ చంద్రిక, నిర్ణయ సింధు మున్నగు గ్రంథాలు అక్షయ తృతీయను పరుశురామ జయంతిగా పేర్కొంటున్నాయి. పరుశురాముడు చిన్నతనంలో తన తండ్రి పితామహుడైన భృగు మహర్షి ఆశ్రమానికి వెళ్ళగా, ఆ బాలకుని తేజస్సుకు తాళలేక భృగు కళ్ళు మూసుకుని, ఆ బాలకుని హిమాలయాలకు వెళ్ళి తపమాచరించమని సూచించారు. బాలకుని తపస్సుకు శివుడు ప్రత్యక్షమై, నీవు ఇంకా చిన్నవాడవే, రౌద్రాస్త్రాలు ధరించే శక్తి నీకు లేదని, కొంతకాలం తీర్థయాత్రిలు చేయాలని హితవు పలికారు. తీర్థయాత్రలు పూర్తి చేసుకుని, తిరిగి తపస్సు ప్రారంభించగా, ఆ సమయంలో రాక్షస బాధలు తాళలేక, ఇంద్రాది దేవతలు శివుని శరణు వేడగా, శివుడు భార్గవ రామునికి పరుశువు అనే గండ్రగొడ్డలి ఇచ్చి, రాక్షసులపైకి పంపడంచేత పరుశురామ నామాంకితులైనారు. అలా స్వర్గంలో రాక్షసులను లేకుండా చేశాడు. ఒకనాడు తల్లి రేణుక నీళ్ళు తేవడానికి ఏటికి వెళ్ళి, అక్కడ చిత్రరథుడనే గంధర్వరాజు కుమారుడు తన భార్యతో జలవిహారం చేయడాన్ని చూసి, తనకు అలాంటి అదృష్టం లేదని చింతిస్తూ ఆశ్రమానికి ఆలస్యంగా వెళ్ళింది. ఆలస్యానికి కారణం తెసుకున్న జపదగ్ని, కళంకితయైన ఆమెను ఖండించాలని కుమారులను కోరాడు. ముగ్గురు మొదటివారు ఒప్పుకోని స్థితిలో నాలుగవ వాడైన పరుశురాముడు ఆమెను ఖండించాడు. తండ్రి, పరుశురాముని ఏదైనా వరం కోరుకోమనగా, తనకు మాతృ భిక్ష పెట్టమని ప్రార్థించాడు. అలా తల్లి పునర్జీవితురాలైంది. తండ్రి ఆశ్రమాన లేని సమయాన కార్తవీర్యార్జునుడు అనే రాజు, కామధేనువు ‘‘సురభి’’ని బలవంతంగా తీసుకుపోగా, పరుశురాముడు ఆ రాజును హతమార్చి, గోవును తిరిగి తెచ్చాడు. ఇందుకు పగబట్టిన కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్నిని హతమార్చగా, తిరిగి వచ్చిన పరుశురాముడు విషయం తెలుకుని, వారి మీదకు దండెత్తి గర్భస్థ పిండాలను కూడా వదలక చంపాడు. వారి నెత్తుటితో పితృ తర్పణం గావించాడు. ఇలా అందరినీ హతమార్చడం చేత భూమి అంతా పరుశురామునిదే అయింది. యజ్ఞం చేసి, భూమి అంతయూ బ్రాహ్మణులకు దానం చేశాడు. తర్వాత మహేంద్రగిరిపై తపస్సుకై ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. దానమిచ్చిన నేలపై తానుండ కూడదని బ్రాహ్మణులు అనగా, పరుశురాముడు పడమటి సముద్రం వద్దకు వెళ్ళి, తన స్రువమును సముద్రంలోకి విసిరి వేయగా, రెండు యోజనాల దూరంలో పడగా, సముద్రుడు ఆ ప్రదేశం నుండి ఉపసంహరించుకున్నాడు. దానినే కొత్తగా ఏర్పడిన మలబారు ప్రాంతంగా చెపుతారు. అక్కడే పరుశురాముడు నివసించగా, ఆయన ఉన్నచోట కరువు ఉండదని వజ్రోత్సవ చంద్రికలో పేర్కొబడింది. స్కంద పురాణాధారంగా, కశ్యప బ్రాహ్మణునిచే వెడలగ్టొటబడిన వాడైన పరుశురాముడు, సహ్యాద్రి పర్వత ప్రాంతమందు నివసించి, అక్కడి ఆటవికులైన కొండజాతి వారికి జందెములు వేసి, బ్రాహ్మణులుగా మార్చినట్లు వివరించ బడింది.

- సంగనభట్ల రామకిష్టయ్య