Others

పవిత్రం, అధికఫలవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే మాసాలలో వైశాఖ తృతీయ అక్షయ సంపదలు అందిస్తుంది. ‘‘వైశాఖ మాస శుక్ల తృతీయా- అక్షయ తృతీయోచ్ఛతే’’ అని శాస్త్ర వచనం. కుబేరుడే ఈరోజున మహాశివుని దగ్గర నుంచి అక్షయ సంపద లను పొందాడని పురాణ వచనం. వైశాఖాన్ని మాధవం అని కూడా పిలుస్తుంటారు.
వైదిక కాలమానం ఖగోళ శాస్త్ర, జ్యోతిష శాస్త్రాల ననుసరించి సూర్యచంద్రులు శక్తివంతమైన స్థానాల్లో వుండిదేదీప్యమానంగా ప్రకాశిస్తారని, సూర్యుడు జీవుని లోని చైతన్యానికి, చంద్రుడిని మేధస్సుకు అధిదేవతగా భావించే మన హిందూ సంప్రదాయం సూర్యుని తీవ్ర ఉష్ణ ప్రభావం సర్వులకూ క్షేమాన్ని మాత్రమే అందించాలని దానికి నమస్కార ప్రియుడైన సూర్యునికి నమస్కారం ఈతృతీయ రోజున చేసి సూర్యుని అభయాన్ని పొందాలని శాస్తవ్రచనం.
పూర్వకాలంలో అక్షయ తృతీయ రోజున ఒక వైశ్యుడు యవలు, గోధుమలు, శనగలు, నీళ్ళతో కూడిన కుండలను బ్రాహ్మణులకు దానం చేశాడు. మరు జన్మలో అతడు క్షత్రియునిగా పుట్టి అనేక రెట్ల అధిక సంపదలకు యజమాని అయ్యాడు. పూర్వ జన్మలో చేసిన దానం వల్లనే నేనీ జన్మలో లక్షలకు అధికారిని అయ్యానని ఈజన్మలోనూ పుణ్యకార్యాలు చేయడం మొదలుపెట్టాడా క్షత్రియుడు. ఆ వైశ్యుని ఆదర్శంగా తీసుకొని దానాలు చేయడం ఇత రులు ఆరంభించారనే కథ జనశ్రుతిలో ఉంది. ఎండలుమండే వాతావరణం కనుక చల్లటి నీరు నిండిన కుండలు, చందనం, గొడుగు, నారి కేళాలు, మామిడిరసాలు, వెండిబంగారాలు, చందనం లాంటివి దానంచేయడం మంచిదనే శాస్తవ్రచనం.
హిరణ్యకశపునికోసం ఉగ్ర నరసింహ రూపాన్ని సంతరించుకున్న మహావిష్ణువు సింహాచలంలో వరాహనారసింహునిగా ప్రతి ష్టంచబడ్డాడు. ఆ ఉగ్రనారసింహుని సంవ త్సరం పొడవునా చందనం అలది ఉంటారు. అక్షయ తృతీయనాడు ఆ చందాన్ని తీసివేసి భక్తులకు స్వామి నిజరూప దర్శనం లభింప చేసి అంతకుముందు స్వామి నుంచి తీసిన చందనాన్ని భక్తులకు పంచిపెడ్తారు. ఈ చందనం ధరించినవారికి సకలరోగాలు దూరమవుతాయ. అక్షసంపదలు ఒనగూడు తాయ. ఈ చందరోత్తరణ తర్వాత నరసింహుని నిజరూప దర్శనం కోసం ప్రపంచం నలు మూలల నుంచి భక్తులులక్షలాదిగా తరలి వస్తారు. బదరీనాథ్ క్షేత్రంలోని బదరీ నారాయణ స్వామి ఆలయాన్ని అక్షయ తృతీయ నాడే తెరుస్తారు. మధుర మీనాక్షీదేవి సుందరేశ్వర స్వామిని పెళ్లాడిందని పురాణ గాథలు చెపుతున్నాయి. భిక్షాటన చేసే శివుడికి ఈరోజునే అన్నపూర్ణ అన్నంపెట్టి లోకుల ఆకలిని తీర్చిందని అంటారు. శ్రీ మహలక్ష్మిని పూజించడం సత్సంప్రదాయం. చైత్రంలో వచ్చే తదియకు ‘డోలావ్రత’ తదియయని, వైశాఖ మాసంలో వచ్చే తదియను ‘రంభాతదియ’యనీ అంటారు. ఈ రోజుల్లో మహిళలు ఆచరించే పూజలు వ్రతాలు విశేష పుణ్యఫలాన్ని యిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

- కె. వాణిప్రభాకరి