Others

వేసవిలో చల్లచల్లగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవిలో మండే ఎండలు, వేడిని తట్టుకోవడం ఎవ్వరికైనా కష్టమే. ముఖ్యంగా స్ర్తిలు, పిల్లల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే శరీరానికి చలువచేసే ఆహార పదార్థాలను తీసుకోవాలి. వేసవిలో శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది. దాహం ఎక్కువౌతుంది. ఎన్ని నీళ్లు తాగినా ఇంకా ఇంకా తాగాలనే అనిపిస్తుంటుంది. కొంతమంది డీహైడ్రేషన్‌కు లోనవుతుంటారు కూడా.. దీన్నుంచి తప్పించుకోవాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. ప్రకృతే ప్రకృతిలో జరిగే మార్పులను తట్టుకోవడానికి దారి చూపిస్తూ ఉంటుంది. వాటిని మనం గమనిస్తే చాలు.. మనకు మార్గం దొరికినట్టే. వేసవిలోనూ చల్లచల్లగా ఉండొచ్చు..
కిరణీపండు...
ఈ కిరణీపండునే తర్బూజా అంటారు. తర్బూజాను సూపర్ ఫుడ్‌గా చెప్పుకోవచ్చు. ఇందులో 96% నీటిశాతం ఉంటుంది. ఒక కప్పు తర్బూజ ముక్కలు ఒక బ్రెడ్‌స్లైస్‌కు సమానం అన్నమాట. ఫలితంగా ఇటు కడుపు నిండుతుంది, అటు చల్లదనం, ఆరోగ్యం.. రెండూ సమకూరుతాయి. వీటిలో కేలరీస్ తక్కువగా ఉన్నందున ఊబకాయం ఉన్నవారు కూడా హాయిగా, ఏ సంకోచమూ లేకుండా దీన్ని తీసుకోవచ్చు. తర్బూజను పొద్దున పూట అల్పాహారంలో మిగతా కూరగాయముక్కలతో కలిపి చక్కని రుచికరమైన సలాడ్‌గా తీసుకోవచ్చు. లేదా జ్యూస్‌గా కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకొన్నా వేసవి ఎండ నుంచి తర్బూజ శరీరానికి చల్లదనాన్ని చేకూరుస్తుంది. అంతేకాదండోయి తర్బూజను తీసుకోవడం వల్ల ఊబకాయం, మలబద్దకం, కడుపులో నరాలు పట్టుకున్నట్లు ఉండడం వంటి సమస్యలనుంచి దూరం కావచ్చు. నెలసరి నొప్పుల నుంచి కూడా తర్బూజ రిలీఫ్‌ను ఇస్తుంది.
పుదీనా
పుదీనా జ్యూస్ సేవించడం వేసవిలో పరిపాటే. అలా కాకుండా వంటల్లోను, సలాడ్స్‌లోనూ పుదీనా ఆకులను తీసుకొంటే మంచి సువాసనతో పాటు శరీరానికి కావాల్సిన విటమిన్ సి పుష్కలంగా ఇస్తుంది. పుదీనాతో చక్కని చట్నీ, సలాడ్‌లో గార్నిష్‌గా, పుదీనా జ్యూస్ ఇలా ఎన్నోరకాలుగా పుదీనను సేవించవచ్చు. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ముఖం కాంతివంతమవుతుంది.
పచ్చిమామిడి కాయ
మామిడి పండ్లు తినడం అందరికీ ఇష్టమే. మామిడి పండ్లతో జ్యూస్, పెరుగన్నంతో కలిపి తినడం అందరూ చేసేదే. మామిడి పండ్లే కాదు పచ్చికాయలూ ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి. పచ్చి మామిడిలో పీచుపదార్థం, విటమిన్ సిలతోపాటు, ఎన్నో రకాల మినిరల్స్ కూడా ఉంటాయి. పచ్చిమామిడిని ఉడకబెట్టి పుదీనా ఆకులు, బెల్లం కలిపిన షరబత్ వారంలో రెండు లేక మూడు సార్లు తీసుకుంటే శరీరంలోని అధిక వేడిని నియంత్రించవచ్చు.
సబ్జా గింజలు
ఇవి చూడడానికి నల్లగా, చిన్నగా ఉంటాయి. కానీ నీళ్లల్లో వేసిన వెంటనే ఆ నీటిని తీసుకొని తెల్లగా కనిపిస్తాయి. వేసవిలో వీటిని తీసుకోవడం మంచిది. ఈ సబ్జాగింజలను మంచినీటిలో వేసుకొని రోజంతా తీసుకుంటే శరీరంలోని వేడి తగ్గుతుంది. వీటిని సలాడ్స్‌లోను, జ్యూసుల్లోను, మజ్జిగలో కలుపుకుని తీసుకోవడం వల్ల అధిక కొవ్వు తగ్గిపోతుంది. అంతేకాదు ఊబకాయులకు శరీర బరువును నియంత్రించడంలో వీటికి మించినవి లేవు.
పుచ్చకాయ
వేసవిలో పుచ్చకాయ తినడం ఆరోగ్యానికే ఎంతో మంచిది. ఇందులో 91%నీరు ఉంటుంది. పుచ్చకాయలో షుగర్ శాతం కూడా తక్కువగా ఉన్నందున డయాబెటీస్ ఉన్నవారు హాయిగా తీసుకోవచ్చు. ఇక శరీర బరువును నియంత్రించాలనుకొన్నవారికి పుచ్చకాయ అద్భుత ఆహారం. కేవలం వేసవిలోనే కాదు అన్ని కాలాల్లోనూ దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గించుకోవడమేకాక అధిక కొవ్వును దూరం చేసుకోవచ్చు.
చియా సీడ్స్
ఇవి సబ్జాగింజల్లాగే ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. బ్లడ్ షుగర్, ఎనీమియాలను తగ్గించుకోవచ్చు. ఈ గింజలు ప్రొటీనులు, పీచుపదార్థాలు, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్‌లతో పాటు ఎన్నో రకాల మినిరల్స్ ఉంటాయి. వీటిని పుడ్డింగ్స్, సలాడ్స్, జ్యూస్‌లతో తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గించుకోవచ్చు.
పెరుగు
తెలుగువారికే కాదు ప్రపంచంలోని అందరికీ పెరుగు పరిచయమే.. పెరుగులో విటమిన్ బి 12, కాల్షియమ్, ఫాస్పరస్, ఎమైనో ఆసిడ్స్ ఎన్నో ఉంటాయి. ప్రతిరోజూమజ్జిగ తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గడమేకాక చర్మం కాంతివంతమవుతుంది.
కొబ్బరిబోండాం
వేసవి తాపం తీర్చడానికి కొబ్బరి నీళ్లు దివ్యౌషధం. ఒక గ్లాసు కొబ్బరినీళ్లల్లో 50 కేలరీస్ మాత్రమే ఉంటాయి. కొబ్బరినీళ్లలో విటమిన్ సి, మేగ్నిషియమ్, పొటాషియమ్, మరియు సోడియంలు ఉంటాయి. కొబ్బరినీళ్లు శరీర తాపాన్ని తీర్చడమే కాక కడుపునింపుతాయి. దీనివల్ల శరీర బరువును నియంత్రింవచ్చు.
వెలగపండు
వెలగపండును తీసుకోవడం వల్ల వేసవి తాపం దూరమవుతుంది. వెలగపండు తాపనివారిణే కాదు, జీర్ణక్రియను వేగవంతం చేసి మలబద్ధకాన్ని పోగొడుతుంది. వేసవిలో వెలగపండుతో షరబత్, లస్సీ, మురబ్బాలాంటివి కూడా చేసుకోవచ్చు.
అలోవెరా
అలోవెరా మహిళలకు ఔషధకారిణి. ఎండ వల్ల కమిలిన చర్మానికి అలోవెరా గుజ్జు చక్కని పరిష్కారం. అలోవెరా గుజ్జుతో జ్యూస్ చేసుకొని తాగడం వల్ల శారీరిక ఉష్ణోగ్రత త గ్గుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. అలోవెరాతో బ్లడ్ సుగర్, కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు.