Others

తొలి స్టంట్ ఉమెన్ రేష్మా పఠాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షోలే సినిమాను దాదాపుగా అందరూ చూసే ఉంటారు. అందులో ‘బసంతి’ పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ పాత్రను పోషించింది హేమమాలిని. ఆ సినిమాలో ఓ షాట్‌లో రెండు చక్రాలు ఒకదాని తర్వాత ఒకటి విరిగిపోవడంతో గుర్రం బండి ఆగిపోతుంది. కానీ ఆ సీన్ చేస్తున్నప్పుడు అలా జరగలేదు. యాక్షన్ అనగానే బండిని ఉరికించి ఓ రాయిని ఢీకొట్టింది బసంతి. అయితే దానికున్న నిజమైన చక్రాలు కావడంతో విరగలేదు. దానితో బండి తిరగబడింది. దానికింద బసంతి ఇరుక్కుపోయింది. బసంతి చనిపోయిందని షూటింగ్‌లో ఉన్నవారందరూ భయపడ్డారట. బండిని లేపిన తరువాత బసంతి బతికే ఉందని తెలుసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారట. అయితే అప్పుడు బసంతి పాత్రలో కిందపడిపోయింది హేమమాలిని అని అందరూ అనుకుంటారు. కానీ ఈ సినిమాలో హేమమాలినికి డూప్‌గా నటించింది మాత్రం రేష్మాపఠాన్. ఈమె గురించి మాత్రం ఎవరికీ తెలియదు. ‘తొలి స్టంట్ ఉమన్’గా రేష్మాకు పేరుంది. ఈమె అనేక చిత్రాల్లో అత్యంత కఠినమైన స్టంట్లు చేసింది. రేష్మ చాలామంది నటీమణులకు డూప్‌గా నటించింది.
రేష్మ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. చిన్నప్పటి నుంచి రేష్మ చాలా చలాకీగా ఉండేది. చిలిపి పనులు ఎక్కువగా చేస్తుండేది. ఆమె పద్నాలుగు సంవత్సరాల వయస్సులోనే ‘ ఏక్ ఖిలాడీ 52 పట్టే’ సినిమాలో తొలి స్టంట్ చేసింది రేష్మ. సినిమాల్లో నటించొద్దంటూ ఆమెకు ఇంట్లో చాలా రకాల ఆంక్షలు విధించారు. ఆమె తండ్రి కొట్టాడు కూడా. కానీ రేష్మ పట్టుదల, ప్రతిభ, మొండితనం చూసి చివరకు ఆయనే మనసు మార్చుకున్నాడు. ఇటీవలే ఆమె బయోపిక్ ‘ది షోలే గర్ల్ రేష్మా పఠాన్’ విడుదలైంది. మొదట ఆమె బయోపిక్ తీస్తామని నిర్మాతలు కాల్ చేయగానే నమ్మలేకపోయిందట. ఎవరో తెలిసినవారు ఆటపట్టిస్తున్నారనుకుందట. ‘నేను ఎవరికి తెలుసని నా బయోపిక్ తీస్తారు?’ అనుకుందట. కానీ పదేపదే ఫోన్‌కాల్స్ రావడంతో ఆమె బయోపిక్ తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అనుకుందట. అలా తెరవెనుక స్టంట్ ఉమన్‌గా, డూప్‌గా మిగిలిపోయిన రేష్మ.. తన బయోపిక్ వచ్చినందుకు చాలా ఆనందపడుతోంది. కారణం ఆమె గురించి ఎవరికీ తెలియదు. ఈ బయోపిక్‌తో ఆమెకూ కొంత గుర్తింపు వచ్చింది. తొలి స్టంట్ ఉమెన్ రేష్మగా అందరూ ఇప్పుడు ఆమెను గుర్తిస్తున్నారు. భారతీయ సినిమాకు అత్యుత్తమ సేవలందించినందుకుగాను ‘్ఫలిం క్రిటిక్స్ గిల్డ్’ రేష్మాకు ఫస్ట్ క్రిటిక్స్ ఛాయిస్ ఫిలిం అవార్డుతో సత్కరించింది. గతంలో స్టంట్ ఆర్టిస్టులకు సరైన సదుపాయాలు ఉండేవి కాదని ఆమె అంటున్నారు. రేష్మాకు ఇప్పుడు 65 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఆమెలో స్టంట్లు చేయాలన్న ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు కూడా రేష్మా అంతే ఉత్సాహంగా ఉంది.