సబ్ ఫీచర్

ఇల్లాలి కష్టానికి విలువ లేదా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్వాతంత్య్రం’ అంటే ‘తన జీవితాన్ని గురించి తానే నిర్ణయాలు తీసుకుంటూ ఎవ్వరిపైనా ఆధారపడకుండా జీవించడం’. నిజానికి తన జీవితాన్ని గురించి తానే నిర్ణయాలు తీసుకొనడంగానీ, ఇతరులపై ఏ మాత్రం ఆధారపడకుండా జీవించడం కానీ ఎవ్వరికీ సాధ్యంకాదు. అందువల్ల ఎవ్వరూ సంపూర్ణంగా ‘స్వతంత్రం’గా జీవించలేరు. కుటుంబంలోగాని, సమాజంలోగాని అందరూ పరస్పర ఆధారంగానే జీవించాల్సి వుంటుంది. ఇంటివద్ద ఉండిస్ర్తిలు స్వాతంత్య్రం లేనివారుగానూ, ఇంటి బయట వ్యవహారాలు నిర్వహించే పురుషులు స్వాతంత్య్రం కలిగినవారుగానూ భావించటం సహజం. ‘న స్ర్తి స్వాతంత్య్రం అర్హతి’ అనడంలో అర్థం- స్ర్తిలు ఇంటివద్ద ఉండి కుటుంబ సభ్యులందరి సౌకర్యవంతమైన జీవితానికి కృషి చేస్తూ ఉండాలి అని మాత్రమే తప్ప పురుషుడికి ఏ విధంగానూ బానిసగా వ్యవహరించాలని కోరడం కానీ కాదు అని అందరూ గ్రహించాల్సి ఉంటుంది. ఆకాశమంత ఆనందాన్ని అందిస్తున్నారని ఎందుకు అనుకోరు.

- సన్నిధానం యజ్ఞనారాయణమూర్తి