Others

ఫ్రీజర్‌ను శుభ్రం చేస్తున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవి వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి.. చల్లచల్లగా ఏదైనా పానీయం సేవిస్తే ఉల్లాసంగా ఉంటుంది అనుకుంటాం. అందుకనే వేసవిలో రకరకాల పానీయాలను తెచ్చి ఫ్రిజ్‌లో నిలువ ఉంచుతూ ఉంటాం. అందుకే ఈకాలంలో ఫ్రిజ్ వాడకం ఎక్కువగా ఉంటుంది. రుచికరంగా ఉన్న కూర ఏది మిగిలినా వెంటనే వచ్చే ఆలోచన దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి రేపు వేడి చేసుకుని తిందామని.. అలాగే పాలు, పెరుగు, పూలు.. ఇలా ఒకటేమిటి? రకరకాల పదార్థాలను నిలువ ఉంచడానికి ఫ్రిజ్‌ను ఉపయోగించడం సర్వసాధారణంగా మారిపోయింది. అయితే దాన్ని ఎప్పటికప్పడు శుభ్రపరచకపోతే మాత్రం పురుగులు చేరి మొదటికే మోసం వస్తుంది. కనుక ఫ్రిజ్‌లో చెత్తచేరిపోయిందనిపించిన వెంటనే శుభ్రం చేయడం మంచిది. ఫ్రిజ్‌ను శుభ్రం చేయడం కాస్త ఓపికతో కూడుకున్న పనే.. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకంటే అది అవసరం. ఫ్రిజ్‌ను ప్రతిరోజూ శుభ్రం పరచడం అంటే కష్టమైన పనే.. అందుకు ముందు జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే చెడు వాసనలు లేకుండా మీ పని సులభం అవుతుంది. అందుకు ఏం చేయాలి? అందుకు కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటివో చూద్దామా..
* ఫ్రిజ్‌ను శుభ్రం చేసేముందు అందులో ఉన్న పదార్థాలన్నీ తీసి బయటపెట్టాలి. చద్దివాసన కొట్టేవి, కుళ్లిపోయినవి ఉంటే వాటిని తీసి విసిరేయాలి. తర్వాత అందులో ఏం పెట్టాలో నిర్ణయించుకోవాలి. ఫ్రిజ్ లోపల కొంత తడి లేదా ఐస్ గడ్డకట్టి ఉంటుంది. కాబట్టి శుభ్రపరచడానికి ముందు ఫ్రీజర్ ప్లగ్ స్విచ్ ఆఫ్ చేసి, ప్లగ్ పక్కకు తీసిపెట్టి, కొద్ది సమయం అలాగే ఉండాలి. ఐస్ వదులైన తరువాత మొద్దుబారిన కత్తితో తొలగించాలి. లేదంటే శుభ్రం చేయడానికి కొద్దిగా కష్టమవుతుంది.
* ఫ్రీజర్‌ను త్వరగా డీఫ్రాస్టింగ్ చేయాలంటే హెయిర్ డ్రయ్యర్‌తో ఫ్రిజ్ లోపల తడి పూర్తిగా తొలగించాలి. ఫ్రీజర్ లోపల ఉన్న ఐస్‌ను కరిగించడానికి కూడా హెయిర్ డ్రయ్యర్‌ను వాడవచ్చు. దీంతో ఫ్రీజర్‌ను సులభంగా శుభ్రం చేయవచ్చు.
* డీఫ్రాస్ట్ చేసిన తరువాత ఒక శుభ్రమైన కాటన్ క్లాత్‌ను తీసుకుని పైన, కింది భాగంలో శుభ్రంగా తుడవాలి. ఫ్రిజ్‌లో ఉన్న ఆహారాన్ని బయటకు తీసేసిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా తుడవాలి.
* ఫ్రీజర్‌ను శుభ్రం చేయడానికి వెనిగర్ ఒక అద్భుతమైన క్లీనింగ్ ఏజెంట్. మూడుభాగాలు నీళ్లు, ఒక భాగం వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసి అందులో శుభ్రమైన వస్త్రాన్ని డిప్ చేసి తర్వాత ఫ్రీజర్‌ను ఆ తడి బట్టతో తుడవాలి. తిరిగి మంచినీటితో మరోసారి తుడవాలి.
* ఇంటి శుభ్రతలో ముఖ్యంగా వంటగది శుభ్రతలో బేకింగ్ సోడా చాలా బాగా పనిచేస్తుంది. బేకింగ్‌సోడా ఇది ఒక మ్యాజిక్ పౌడర్. ఇది అన్ని వస్తువులను సులభంగా శుభ్రచేస్తుంది. ఫ్రిజ్‌ను కూడా ఎటువంటి చెడువాసనలు లేకుండా మిళమిళలాడేలా చేస్తుంది. సన్నని రంధ్రాలున్న చిన్న డబ్బాలో బేకింగ్ సోడాను నింపి ఫ్రిజ్‌లో ఒక మూలలో పెట్టడం వల్ల చెడువాసనలు స్ప్రెడ్ కాకుండా ఉంటాయి.
* ఫ్రీజర్‌ను శుభ్రం చేయడానికి మరో నేచురల్ క్లీనింగ్ పరిష్కారం, ఫ్రీజర్ మొత్తం శుభ్రం చేసిన తర్వాత అందులో వెంటనే పదార్థాలన్నింటినీ నిల్వ చేయకుండా ఫ్రీజర్ డోర్‌ను తెరిచి పెట్టి పూర్తిగా తడి ఆరిపోనివ్వాలి.
* చాలామందికి ఫ్రీజర్ నుండి మంచి సువాసన వస్తే చాలా ఇష్టం. అటువంటివారు కొద్దిగా నీటిలో నిమ్మరసం కలిపి ఫ్రిజ్‌ను తుడవాలి. లేదా కొన్ని వెనీలా చుక్కలను కాటన్‌లో వేసి ఫ్రీజర్ కార్నర్‌లో పెట్టవచ్చు.
* ఫ్రిజ్‌ను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత తిరిగి ఆహారపదార్థాలను నిల్వ చేసుకోవచ్చు. అలాగని ఫ్రిజ్ మొత్తం నింపేయకూడదు. ఫలితంగా ఇతర పదార్థాలకు గాలి సోకకుండా అడ్డుకుంటుంది. కాబట్టి ఆహార పదార్థాల మధ్య కొంచెం ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి.
*